కామశాస్త్రము 11. కౌచుమారము (సుభగంవరణము; కామసాధన మునకు వలసిన మంత్రైషధములు) 22. హస్తలాఘవము, 28. విశేషభఢ్యపాన యోజనము, 24. సూచీవానము, (బట్టలు కుట్టుట), 25. సూత్రక్రీడ, 26. నీణా డమరుక పాద్యము, 27. ప్రహేళికలు ప్రొడుపుకథలు మొదలగు నవి) 28. అంత్యాక్షరి, 29. దుర్వాచకము క్లిష్ట రచన. 80. పుస్తక వాచనము, 91. నాటకాఖ్యాయికా దర్శనము 22. సమస్యాపూర్తి, 33. పట్టికా వేత్రవానము (వేము వెదురుమొదలగు వానియల్లిక,) 84, తర్కకర్మ, (కృత్రిమ సాధనలు), వీటిని కామతృప్తికొరకు ఉపయోగించుట, వాటిజ్ఞానము, 35. తక్షణము (చెక్కుట), 36. వాస్తు విద్య, 37. రూప్యరత్నపరీక్ష, 88. ధాతువాదము, 30. సుణిరాగాకరము, 40. వృక్షాయుర్వేదము, 41. మేష కుక్కుట లావకయుద్ధము, (గొట్టె, పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు - వీటి ములు 42. శుకశారికా ప్రలాపనము, ఓలి. ఉత్పాదనము - సంవాహనము - శరీర సుర్దనము, 44. అక్షర ముష్టి కాకథనము, 45. మ్లేచ్ఛిత వికల్పము (ఇతరు లెరుగకుండ మర్మభాషలో మాట లాడుట) 44. దేశభాషా విజ్ఞానము, 47. పుష్పశకటి, 48. నిమి త్తజ్ఞానము, 49. యంత్రమాతృక, 50. ధారణ, 51. సంపాద్యము, 52. మానసీక్రియ, 58, కావ్యక్రియ, 54. కోళము, 55. ఛందోజ్ఞానము, 56. క్రియాకల్పము, 57. ఛలితకము, 58. వస్త్రగోపనము, 58. ద్యూతము, 60. పాళకక్రీడ, 61. వైనాయికీజ్ఞానము, (గుఱ్ఱములను, ఏనుగులను అదుపులోనికి తెచ్చుట) 82. వై జయికిజ్ఞానము (విజయవిద్యలు) 38. బాలక క్రీడనకము, 64. వ్యాయా మము. ఈసూచిక ప్రాచీన భారతీయుల జీవనమందలి వివిధాభిరుచులను చాటుచున్నది. సంప్రయోగము దళాంగమని కామశాస్త్రకారుల మతము, దశాంగములు 1. ఆలింగనము, 2. చుంబనము, 8. నఖక్షతము, 4. సీత్కృతము, 5. మాతము, 6. సంవే శనము, 7. ఉపనృప్తకము, 8. దంతక్షతము, 9. ఔప రిష్టకము, 10. పురుషాయితము. కామశాస్త్రములలో నొక్కొక్క అంగము శాఖోపశాఖలుగా వివరింపబడెను. ఉదా : నఖడతము. ఇందు నఖములు ఎట్లుండవ లెవో, తతము రెట్లుండవలెనో, వివిధ ప్రాంతములలోని భిన్న 650 సంగ్రహ ఆంధ్ర భిన్న వ్యవహారము లెట్లుండవలెనో వివరింపబడినది. వాత్స్యాయన శాస్త్రమునందు కూడ బంధములు వర్ణింప బడినవి. ఉత్తర కాలికుల గ్రంథములలో బంధములకు అను చిత ప్రాముఖ్యము ఒసగబడినది. B నాగరక వృత్తిమనునది మనకు ప్రాచీన కాలపు విలాస పురుషులు జీవితమును తేటతెల్లము చేయును. నాగరకుడు ఆదర్శపురుషుడు. అతడు గ్రామస్థులకుకూడ అనుకర ణీయుడు. అతడు గృహీతవిద్యుడై స్వవృత్తి నవలంబించి గృహస్థుడగును. అతని నివాసము పెట్టణమందుగాని నగర మండుగాని సజ్జనాశ్రయ ప్రదేశమందుగాని ఉండును, అతని భవనము ఆసన్నోదకమై వృక్షవాటికతో ఒప్పు చుందును. గృహమునం దనేక గదులు వేరువేరు పనులకు నియతమైయుండు భవనమందు రెండు భాగములుండును. బాహ్యగృహమందు మంచము, దానిమీద తెల్లని కోసుల మగు దుప్పట్లు, దిండ్లు ఉండును. రెండవ ప్రతిశయ్యకూడ నుండును. అచ్చటనే పీఠము, వేదికయు నుండును. రాత్రి ఉపయోగింపగా మిగిలిన అనులేపనములు, దండలు, సుగంధపు పెట్టె, లవంగములు, తమలపాకులు కూడ అచ టనే యుండును. చిలుకకొయ్యకు తగిలింపబడిన వీణ, ఆ లేఖ్యమునకై చిత్రఫలకము, కుంచెలు గల పెట్టె, ఏదియో యొకపుస్తకము, గోరింట పూలమాలలు ఉండును. అచ్చటనే ద్యూతఫలకము, ఆకర్షకఫలకము కనిపించును. నివాసగృహమునకు సమీకమున శకుని పంజరములు వ్రేలాడుచుండుము. వృక్షవాటికయందు ఉయ్యెలయు ఛాయయు, పువ్వులు నుగల శిలాపట్టము నుండుము. నాగ రకుడు ప్రొద్దున లేచి కాలకృత్యములు నిర్వహించి, దంతధావనముచేసి, అనులేపనము, ధూపము, మాలికలు గ్రహించి, పెదవులకు అత్తుకపూసుకొని అద్దములో తన ఆకృతిని చూచుకొని, శరీరమునకు అత్తరు రాచుకొని, సుగంధ పూర్ణమగు తాంబూలమును చర్వించవలెను. భోజనానంతరము శుకశారికా ప్రలాపములతో, గొట్టె పొట్టేళ్ళు, కోళ్ళు మొదలగు వాని పందెపు యుద్ధములతో, ఆయాకళలతో, క్రీడలతో, నాగరకుడు కాలము గడుపును. పెటాది సహచరులతో మాటలాడును. తీరు వాత నిదురించును. అఫరాహ్లమందు గోష్ఠి విచారము చేయును. సాయంకాలము సంగీతమును వినును. అనం
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/699
స్వరూపం