విజ్ఞానకోశము రాను నష్టప్రాయమయ్యెను. దత్తకాదులు కామశాస్త్ర మును పరిపూర్ణముగా, సకలాంగముగా రచింపక చదవ యవములనే రచించిరి. పాంచాల బాభ్రవ్యుని గ్రంథము బృహత్కాయ మగుటచే జిజ్ఞాసువులకు దురధ్యేయము. కనుక సర్వశాస్త్రమును సమగ్రముగా సంక్షేపించి, లఘు పరిమాణములో, అల్పగ్రంథములో ఈకామసూత్రములను వాత్స్యాయనుడు రచించెను.” ఇందు మనకు ప్రజాపతి మొదలుకొని వాత్స్యాయనుని వరకు కామశాస్త్రేతిహాస మీయబడినది. కామశాస్త్రము ప్రజాపతి మూలమనుటవలన ఈ శాస్త్రము అత్యంత ప్రాచీనమునియు, పవిత్రమనియు, ఆదరణీయమనియు స్పష్టమగుచున్నది. ప్రాచీన భారత దేశ సంఘసంస్కర్తలలో శ్వేత కేతువు ప్రముఖుడుగా గానవచ్చుచున్నాడు. ఇతడు ఉద్దాలకుని పుత్రుడు. ఛాందోగ్యోపనిషత్తునందు బ్రహ్మ విద్యను సొంతము అధ్యయనము చేసినవాడు. కామసూత్ర వృత్తికారుడగు భాస్కర నృసింహుడు శ్వేత కేతువు బ్రహ్మవిద్యతో తనివి చెందక కామశాస్త్రమును రచించెననీ చెప్పుచున్నాడు. ఈ విషయమున భేదాభిప్రాయముండుట ఉచితమే. ఏది ఎట్లున్నను శ్వేత కేతువు మహాభారతములో నొక సంఘసంస్కర్తగా వర్ణింపబడెను. శ్వేతకేతువునకు పూర్వము స్త్రీలలో బహువివాహ సంప్రదాయము కలడట. వరదా రాఖీ గమనముకూడ ప్రాక్కాలమున సున్నదట. "పక్వాన్నమిన రాజేంద్ర! సర్వసాధారణాః 'స్త్రీయః॥ తస్మాత్తాను నాకు ప్యేతనర జ్యేత, ర మేతచః" అనగా "ఓ రాజేంద్రా ! పక్వాన్నము పరీతిగ ఏరిది వారిది అను భేదములేక సర్వ సాధారణమో అనగా సర్వులకు అనుభవార్హ మో అట్లే స్త్రీలును సర్వసాధా రణలు. కనుక పురుషులు వారిమీద కుపితులు కారాదు. విరక్తులు కారాదు. కేవలము రమింపవలెను." అనునది ఇటప్రమాణము. సమాజమిట్లు అవ్యవస్థితముగా నుండగా మర్యాదా నిబంధనము చేసినది శ్వేత కేతువు. ఈ మహా మహుడు లోకులకు మధ్యపాన నివృత్తిని, అధమవర్ణము వారు బ్రాహ్మణులు, గురువులు, మున్నగువారి కన్నియ లను వివాహమాడునట్టి అనుచితాచారము నుండి నివృత్తిని. పరస్త్రీ గమన నిషేధమును ఉపదేశించి, సమాజవ్యవస్థను నిర్మించెను. దత్తకుడు మధురానివాసియగు ఒక బ్రాహ్మ 1 647 కామశాస్త్రము ణుని కుమారుడు. అతనితల్లి శ్రమాతి సమయమునందే గురణించెను. ఆరనితండ్రి అతనితో పాటలీపుత్రమున నివాస మేర్పరచుకొనెను. కొలది కాలమునకు తండ్రి కూడ మరణించెను. ఒక వృద్ధ బ్రాహ్మణి ఆడాలకుని అందుచేతనే అతనికి దత్తకుడు అని పేరు. ఆధ ర్తకుడు జనతికాలమున సర్వవిద్యలు, సర్వకళలు వేర్చై దత్తకాచార్యుడని పేరుగాంచెను. ధనార్జనమునకు సుల భోపాయము నన్వేషించుచు దత్తకుడు పాటలీపుత్ర నగరమునందలి వేశ్యవాటికయందు ప్రవేశించెను. వేశ్యల ధనార్జనోపాయములను, వారి చరుకబుద్ధిని, కౌటిల్య మును, కూలంకషముగ సధ్యయనముచేసి అతడు వేశ్య ల కే ధనార్జనోపాయములను నేర్పుటలో గురువాయెను. ఆవేశ్యలందరు ప్రార్థింపగా అతడు "వై శికమును" రచిం చారాయణుడు, ఘోటకముఖుడు అర్థ శాస్త్రము నందును, గోనర్దేయుడు, గోణకాపుత్రుడు, కతంజలి వ్రాసిన మహాభాష్యమందును పేర్కొనబడినారు. వాత్స్యాయనుడు, తన కామసూత్ర గ్రంథమును గూర్చి యిట్లు చెప్పెను, "పూర్వశాస్త్రములను, ప్రయోగ ములను పరీక్షించియు, అనుసరించియు ఈ కామసూత్రము సంక్షేపముగా నిబద్ధమైనది. భాభ్రవీయమగు సూత్రమును గ్రహించి, విమర్శించి, వాత్స్యాయనుడు గ్రంథమును నిర్మించెను. ఈ వాత్స్యాయన కామసూత్రముల నిర్మితికి అనంతరము, తత్పూర్వ కామశాస్త్రములు ఉపేక్షితములై నష్టప్రాయము లాయెను. మహర్షి యగు పాణిని యొక్క అష్టాధ్యాయి, వ్యాకరణ శాస్త్రములో ఎట్లు అగ్రస్థాన మును అధిష్ఠించునో అట్టి అగ్రస్థానమునే కామశాస్త్ర ములో, వాత్స్యాయనుని గ్రంథము ఆక్రమించును. ఇది సమగ్రమై లోక సాహిత్యములో ఉన్నతస్థానము నలంకరించు గ్రంథ రాజములలో నొకటి. ప్రాచీనభారతము యొక్క సంస్కృతి జీవన విశేషములకు ఈ గ్రంథ ము ఆకరము. ఇందు ఏడు అధికరణములు, 38 అధ్యాయ ములు, 64 ప్రకరణములు కలవు. మొదటిది సాధారణాధి కరణము. ఇందు శాస్త్రసంగ్రహము, ధర్మార్థకామ ములలో కామమునకు గల స్థానము, విద్యలు, కళలు, నాగరకుని జీవితము, అతని దూతలు మొదలగునవి కలవు.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/696
స్వరూపం