కాపాలికము - కాపాలికులు ములలో పై ఎగాక గోళకీయమను మరియొక భేదము కలదు. ఈ సిద్ధాంతము వారు దక్షిణదేశమున 18, 14 శతాబ్ద వ్యాపించిరి. ఈ సిద్ధాంతమునకు సంబంధించిన 1) శ్వేశ్వర శివాచార్యులను నొక మహనీయుడు కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి మతగురువైనట్లు మల్కాపుర శాసనము నందలి ఈ క్రింది శ్లోకము తెల్పుచున్నది. "విద్యామంటు వర్తినం గణపతి వ్యాపాలదీదా గురుం | శ్రీవిశ్వేశ్వర శంభు మీఱితవతాం తేచకుషీ చకుషీ!" పై మనములలో కాపాలిక మొకటి. పాశుపతము ముల్లేఖించినపుడు “లకులీశ పాశుపత"మను దానిని గురించి చెప్పవలెను. లకుల మనగా “గద లేక దండము." ఈ పాశుపతమున శివుడు గదా దండధారిగా నిర్వచింప బడినాడు. అందుచే ఈ మతానుయాయులు దండమును . ధరింతురు. పై పట్టికలోని మతముల కన్నింటికంటె లకులీశ పాశుపతము ప్రాచీనమనియు, దానిలో నుండియే మిగిలినవి ఉద్భవించిన వనియు భండార్కరు పండితుని అభిప్రాయము. లకులియను నొక యాచార్యుడు క్రీ.శ. మొదటి శతాబ్దమున నుండేవనియు, అతడు "పంచా ధ్యాయి" అను మతగ్రంథ మొకటి రచించెననియు అతని ఆ మతము "లకులీశ "మని నిర్వచింపబడెననియు దానినుండి మిగిలినవి యుద్భవించినవనియు, మరి కొంద రనుచున్నారు. ఉత్తర హిందూస్థానమున లకులీశ విగ్రహం మొకటి దొరకినదట! లకులీశ పాశుపత ప్రశంస మాధవాచార్యులవారు గన సర్వదర్శన సంగ్రహమున చేసి యున్నారు. పంచాధ్యాయిలోని విషయము లీ యైదు. 1 కార్యము, 2 కర్మ, 8 యోగము, 4 విధి, 5 దుఃఖాం తము. పైన పేర్కొనబడిన శైవమత భేదములకన్నిటికిని నీ యైదును సమానములు. కాని "విధి" (పూజాచార ము)లో మాత్రము భేదములున్నవి. పూర్వోక్త ములయిన యైదు శుద్ధ శైవమత భేదములలో కాపాలిక కాల్తా ముఖములు రెండును నొకటే అని కొందరును, భిన్నము లని మరికొందరును అభిప్రాయపడుచున్నారు. భగవద్రా మానుజులు తన సూత్రభాష్య వ్యాఖ్యానములో చెప్పిన ధర్మములు (కపాలమును ధరించుట, శ్మశానమున సంచ రించుట మొదలైనవి) రెండు మతములకును సమానము. అని యెంచవలేను. మాధవాచార్యుల వారును, ఆనంద 842 సంగ్రహ ఆంధ్ర గిరియు ఉజ్జయినీ నగరమున శ్రీ శంకరాచార్యుల వారు కాపాలికులతో వాదము చేసినట్లు తెల్పుచున్నారు. ఒకా నొక కాలమున ఉజ్జయినీ నగర మీ మతానుయాయులకు ముఖ్యస్థానముగా నుం డెను. దక్షిణమున శ్రీశైలము శ్రీ కూడ వీరికి గొప్ప యాత్రాస్థానమై యుండెను. ఉజ్జయిని నగరమున మహాకాళాలయ మున్నదను విషయమును కాళిదాసుడు తన మేఘ సందేశ కావ్యమున వచించెను. అచ్చట కాపాలికులు శివుని పూజించు నపుడు నరబలుల సర్పించి, మధుమాంసాదులను స్వామికి ని వేదించుచుండిరట! ఒక కాలమున 'కాపాలికులు రాజస్థానమునుండి దక్షిణమున మైసూరు మండలమువరకు వ్యాపించినట్లు పరిశోధకులు తెల్పుచున్నారు. వీరి మతాచారము లీ క్రింది విధముగా వర్ణింపబడినవి. "నరాస్థిమాలా కృతభూరీ భూషణః శ్మశాన వాసీ నృకపాల భోజనః | పశ్యామి యోగాం జన శుద్ధ దర్శనః " జగన్మిథో భిన్న మభిన్న మీశ్వరం " వాచస్పత్యమున కాపాలిక శబ్దమున కి క్రింది యర్థమీయ బడినది. "శపాతేన నృకపాలేన చరతి అభ్యవహారాదికం కరోతి" శివుడు కపాలధారి. అందు భైక్షమును చరించు చుండును. శ్మశానమున నివసించును; భస్మమును ధరిం చును. అందుచే పరమమాహేశ్వరులగు వీరు పైన చెప్పిన నాల్గుపనులను చేయుటలో నాశ్చర్యమేమి ? మరియు ? శివుడు భూతనాథుడు గాన నీరును భూతప్రేత పిశాచ ములతో సంబంధమును కల్గియుండిరి. వారినిగూర్చి ఈ క్రింది శ్లోకముకూడ చెప్పబడినది. "మ సిద్ధాక్తపపాభిమారిత మహామాంసా2 హుతీర్ణుహ్వతాం | వహ్ని బ్రహ్మక పాల కల్పిత సురాపానేన నః పారణా ! సద్యః కృత్త కఠోరకంఠ విగళత్కీలాలధారోలై అర్చ్యోనః పురుషోపహార బలిఖి ర్దేవో మహాభైరవజ". ఇంతకంటే భీభత్సమైన మత ముండునా ? ఒక గ్రంథమున నీ మతమొక యతిమార్గిక మతమని తెల్పబడినది. దీనితో పాటు "పాశుపతమును, మహావ్రతమును" కూడ ఈ అతిమార్గిక మతములలో చేర్చినారు. వీరికి వేదములు ప్రమాణములు కావు. వీరు ఆగమముల నంగీకరించిరి.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/691
స్వరూపం