ఆసియా కళ
సంగ్రహ ఆంధ్ర
వలె భాగ్యవంతమయినవి కావు. ఇండియా, పాకిస్థాన్ దేశాలలో అనేక జాతులవారు, ఉపజాతులవారు కలరు. ఉత్తర హిందూదేశములో నుండెడువారిలో చాలమందికి యూరోపియన్ సాయిడ్ జాతితోను, నైరృతి ఆసియాలోని సెమిటిక్ జాతితోను సంబంధము కలదు. హిందూ దేశములోనికి యూరోపియనులు, చైనీయులు, అనేక మంది వలసవచ్చిరి. హిందూ దేశము బౌద్ధ, మహమ్మదీయ, జొరాస్ట్రియన్, క్రైస్తవ మతముల వ్యాప్తికి దోహద మిచ్చినది. బౌద్ధ, జైన మతములు హిందూమతము నుండియే బయలు దేరినవి.
ఆగ్నేయ ఆసియా, సంస్కృతి : ఆగ్నేయ ఆసియా ఉత్తరభాగమున, బౌద్ధమతము, దక్షిణభాగమున, తూర్పు ఇండియా దీవులు మొదలగు దేశములలో మహమ్మదీయ మతము వ్యాపించియున్నది. కొన్ని దేశములలో ఇతర మతములుకూడ కొన్ని కలవు.
నైరృతి ఆసియాలోని టర్కీ, అరేబియా ఇరాన్, ఇరాక్, ట్రాన్సుజోర్డాన్, ఇజ్రాయిల్ దేశములలో మహమ్మదీయ మతము కలదు. ఈ ప్రాంతము ప్రాచీన కాలమునుండి అనేకజాతుల సంస్కృతుల కలయికకు కేంద్రస్థానముగా నున్నది.
ఈ ప్రాంతమున వర్ధిల్లిన ప్రాచీన సంస్కృతులలో యూఫ్రెటీస్, టై గ్రీస్ నదుల లోయ ప్రాంతమున ఉండెడి బాబిలోనియన్ సంస్కృతి మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది.
వి, వి.
ఆసియా కళ : ఆసియా భిన్నజాతులకు చెందిన ప్రజలతోడను, విశేష భేదములతో గూడిన శీతోష్ణమండలముల తోడను, మిక్కిలి వ్యత్యాసములు గల సంప్రదాయములతోడను, ఆచారములతోడను, మతములతోడను గూడిన మహాఖండము. జాతులు అత్యంత భిన్నస్వరూపములు కలిగియున్నవి ; అందుచే మనుష్యవర్ణన శాస్త్రములో విశేషానుభవము లేనివారు కూడ ఒక వ్యక్తి ఏ దేశమునకు చెందిన వాడో నిర్దేశించుటలో పొరపాటుపడరు. దక్షిణభారత దేశములోని ద్రావిడజాతిని గాని, ఉత్తర చైనాలోని మంగోల్ జూతిని గాని, బిడూయిన్ జాతికి చెందినవారని పొరపాటు పడుట కవకాశములేదు. “మార్పుచెందని తూర్పు" అని చెప్పుట ఒక పురుషాంతరమునకు పూర్వము పరిపాటిగా ఉండెడిది. కాని ఇది ఇప్పుడు కేవలము పొరపాటు; ఏమన, “మార్పు చెందనిది" అన్న పదము యూరపుఖండ దేశములకు ఎట్లు అన్వయింపదో తూర్పుఖండములందలి మహాజాతులకును అట్లే అన్వయింపదు. చైనాను ఉదాహరణముగా తీసికొందము; ఒక దానితో నొకటి సంబంధము కలిగియుండని అనేక వంశముల యొక్క పరంపర ఈ దేశమును పాలించియుండెను; ప్రతి క్రొత్త వంశమును ఆచార వ్యవహారములలో ప్రాతిపదికములగు మార్పులను ప్రవేశ పెట్టుచుండెను. ఉదాహరణమునకు; ఇంతకుపూర్వ మందున్న మంచు రాజవంశము పిలకలను పెంచుకొనుట ప్రవేశ పెట్టగా, ప్రజాప్రభుత్వము దానిని తొలగించెను. “
"శాశ్వతత్వము” ను, సహజమైన సారూప్యము నష్టము కాకుండ, రక్షించిన అంతరంగిక శక్తిని కలిగియున్నారని కొన్ని తూర్పు జాతుల యొక్క ప్రజలను గూర్చి మనము నిస్సంశయముగా చెప్పవచ్చును. జపాన్ ఒక్కటే కొన్ని ప్రత్యేక పరిస్థితులను కలిగియున్న దేశము; ఇంచుమించు ఖండమునుండి పూర్తిగా విడిపడియుండుట; నివాస యోగ్యమగు ఆసియాలో ఎక్కడో మారుమూలగా ఉన్న దాని ఉనికి, ఒకే రాజవంశము నెడల భక్తి కలిగి యుండుటచే పొరుగుదేశముల దురాక్రమణము నుండియు, శాశ్వతములగు ఆంతరంగిక కల్లోలముల నుండియు, సంరంక్షింపబడుట ; ఇవి ఈ దేశమునకు ప్రత్యేక పరిస్థితులు. ఆసియాయందలి గొప్పవగు ఇతర జాతు లేవియును ఇట్టి సంరక్షణమునుగాని, వ్యక్తి పరిజ్ఞానముతో గూడిన అస్తిత్వమును పొందు అవకాశములను గాని, కలిగియుండలేదు.
ఉదాహరణకు పారశీక దేశమును తీసికొందము. ఇది తన జాతీయ వ్యక్తిత్వమును గమనింపదగిన విధముగా నిలబెట్టు కొన్నది; కాని భూగోళ సంబంధమగు ఉనికి దానిని అన్ని కాలములందును విజేతలకు బలి చేసినది. పదవ శతాబ్ధమున, ప్రాచీనులచే స్థిరత్వము పొందించి బడిన భాషయు; మహమ్మదీయులకు పూర్వమందుండిన రాజవంశముల స్థిర సంప్రదాయములును లేనిచో నీ జాతి బ్రతికియుండెడిదా యని అనిపించును.