Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/686

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము ॥ ౨ అనవేమారెడ్డి యనంతరము కొనురగిరి రెడ్డి క్రీ. 1888 ప్రాంతమున కొండవీటి రాజ్యమునకు రాజాూయెను. తాను రాజుకాగనే కొమరగిరి రెడ్డి తనకు పట్టుగొమ్మయు తన సోదరీభర్తయు, మహాశూరుడు నగు కాటయవేముని ప్రధాన మంత్రిగా నియమించెను. కాటయ వేముడు ప్రధాన మంత్రిపదవికి సర్వధా అర్హుడు, అమాత్య శేఖరున కుండవలసిన సర్వ లక్షణములు నాతనికి గలవు. అతడు కాకలు దీఱిన కదననీరుడు. రాజనీతిలో అందెవేసిన చేయి. వి వేకము గలవాడు, మహా పండితుడు. ఆర్య ధర్మరత దీక్షితుడు. ప్రభుభక్తి పరాయణుడు. తరతరములుగా రాజు వంశముతో ననుబద్ధమైనదాతనివంశము. అన్నిటికిని పైన ఆతడు కొమరగిరిని ప్రాణాధికముగా ప్రేమించువాడు. తన శ్యాలకునిపై కాటయవేమునకు గల ప్రేమ యెంత గాఢ మైనచనగా ఆతడు తన కుమారునకు కొమరగిరి పేరు పెట్టుకొని ఆనందించినాడు. ఆతని పేర నెన్ని యో గ్రామ ములను దానము చేసినాడు. కొమరగిరి ప్రభువునకును తన దావపై అట్టి ప్రేమవిశ్వాసములుండుట సహజము. కావుననే కాటయవేముని తన రాజ్యమునకు ప్రధాన మంత్రిగాను, సర్వసేనాధ్యక్షునిగాను చేసి అతడు గౌర వించినాడు. నిజమునకు కొమరగిరికి రాజ్యప్రాప్తికూడ కాటయ వేముని మూలముననే కల్గినది. శ్రీకృష్ణుడు ధర్మరాజును కౌరవ సింహాసనాధిష్ఠితుని గావించినట్లు కాటయవేమ శూరుడు కొమరగిరిని రెడ్డి రాజ్యశ్రీకి పట్టభద్రుని గావించె నని శాసనమున ప్రశంసింపబడినాడు. ఈ శాసన వాక్యము కేవల ప్రశంసాపరము కాదు. కొమరగిరి రాజేట అంత సుకరముగా జరిగిన పనికాదని ఇది సూచించుచున్నది. దాయాదులవలన ఎన్నియో యడ్డంకులు వచ్చినట్లును, వాని నెల్ల సమర్థుడగు కాటయవేమ గౌరి తన బాహు, ధీ పాటనములతో తొలగించి కొమరగిరిని రెడ్డి రాచగద్దెపై నిల్పినట్లును చరిత్రకారులూహించుచున్నారు. కొనురగిరికి గాక తనకే రెడ్డి రాజ్యాధిపత్యము సంక్రమింపవలసి యున్నదని యెదురుతిరిగినవాడు కోమటి వేమారెడ్డి. ఈతడు రెడ్డి రాజ్యస్థాపకుడైన ప్రోలయ వేనూ రెడ్డి అన్నయగు మాచారెడ్డి మనుమడు, మహా విద్వాంసుడు; శూరుడు. ఈతని తాతతండ్రులు చందవోలు ముఖ్య 637 కాటయ వేమారెడ్డి పట్టణముగా కొంత ప్రదేశమునకు రాజప్రతినిధులై కొండ వీటి రాజ్యమునకు పెట్టనికోటలై యుండిరి. అన వేమ భూపాలునకు సంకతి లేనందున అతని పిమ్మట రాజ్యాధి కారము, రాజవంశములో పెద్దకుమారుడైన మాచా రెడ్డి మనుమడగు వనకే సంక్రమించుట న్యాయమని కోమటి వేమా రెడ్డి వాదులాడదొడగెను. తాను ప్రభువునకు పౌరసు డగుటచే తనదేరాజ్యమని కొమరగిరి పట్టు. ఈతగవులాటలో కొందరు వండనాథులు కోమటివేముని విక్రమున నిల్చిరి. కాటయవేమారులు కొమరగిరికి ప్రాపై యుండిరి. రెడ్డి రాజ్యసింహాసనము కొరకై బయలుదేరిన యీ దాయాదులు కలహములు పెరుగుటకు ముఖ్యహేతువు కొమరగిరి కాటయవేముని ప్రధానమంత్రిగా నియమిం చుటయై యున్నది. మొదటినుండియు 'రెడ్డి రాజులకు బ్రాహ్మణులే ప్రధానమంత్రులై యుండిరి. ప్రోలయ వేమారెడ్డిక్ రామాప్రెగ్గడ, మల్ల నాథులను వారు మంత్రు లుగా నుండిరి. అనపోతరాజునకు సోమయ పెగ్గడ మంత్రి. అనవేమ మహీపాలునకు ఇమ్మడిమంత్రి ప్రధానిగాను, పెద్దనమంత్రి దండనాథుడుగాను ఉండిరి. ఇట్టి పూర్వా చారమునకు విరుద్ధముగా కొమరగిరి కాటయ వేముని కాటయవేముని ప్రధానిగావించుట బ్రాహ్మణమంత్రులకు కోపకారణమై వారు కోమటి వేముని పక్షము వహించుటకు దారితీసి యుండును. మొత్తముమీద రాజ్యములో పలుకుబడిగల వర్గము రెండు పక్షములుగా చీలి యొక పక్షమువారు పెదకోమటిని, మరియొక పథమువారు కొమరగిరివి బలపరచుస్థితి యేర్పడెను. ఇట్టి పిషమపరిస్థితులలో కాటయ వేమసింహుడు ధీరుడై కొనురగిరి పదమున నిల్చినందుననే యా యావదను గడచి యాతడు రెడ్డి రాజ్యసింహాసనము నెక్కగల్గెను. అప్పటికి కోమటి వేమునకు కాటయవేము సంతటి ప్రజ్ఞాశాలితో ఢీకొనజాలినంత అంగబలము గాని, అర్థబలము గాని లేనందున అతడప్పటికీ కాటయ వేమ పక్షమువారు తనకొసగిన పరిమిత స్వాతంత్ర్యము వంగిక రించి చందవోలు ప్రభువుగా నుండజొచ్చెను. కాని యాతని డెందమునమాత్రము పగ నివురుగప్పిన నిప్పై యుండెను. కాటయవేముని పలుకుబడి హెచ్చి యాతడు మహామంత్రియై ప్రాభవము గనుట కోనుటి వేమునకు కంటిలో నలునైయుండెను.