Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాటన్, సర్ ఆర్థరు థామస్

సంగ్రహ ఆంధ్ర


వర్గములతో వాదించి, కాటన్ వారిని ఒప్పించి, నీటిపారుదల సౌకర్యములను కలిగించు ప్రయత్నము లను ఆచరణములోనికి తెచ్చెను.

మొట్టమొదట తమిళనాడులోని కావేరి, కొలరూగా అను నదులమీద ఆనకట్టలను కాటన్ నిర్మించెను. వీటివల్ల వరదల ప్రమాదము తొలగిపోవుటేగాక తిరుచ్చిరపల్లి, తంజావూరు జిల్లాలకు నీటిపారుదల వసతు లేర్పడినవి. ఈ రెండు ఆనకట్టలు 1836 లో పూర్తిచేయబడినవి. ఇదిగాక కొలరూగా నదిపైన 70 మైళ్ళు దిగువగా మరొక ఆనకట్టను నిర్మించి దక్షిణ ఆర్కాటు జిల్లాకు కూడ కాటన్ నీటివసతులు కల్పించెను.

గోదావరీనదికి ఆనకట్ట పథకము 1845 లో తయారు చేసి ఇతడు మద్రాసు ప్రభుత్వమునకు సమర్పించెను. ధవళేశ్వరము దగ్గర ఈ ఆనకట్టను కట్టదలచినచోట మొత్తము పొడవు 6287 గజములు. కాని సదిమధ్య మూడు లంక లుండుటచే నిర్మించవలసిన ఆనకట్ట మొత్తము పొడవు 3946 గజములే. ఇది బ్రహ్మాండమయిన పనియే! గోదావరీ ఆనకట్ట నిర్మాణము 1847 లో ప్రారంభమయినది. ఐదేండ్లలో (1852) ఆనకట్ట నిర్మాణము పూర్తి అయినది. ఈ లోగానే కాలువల త్రవ్వకము పనులుకూడ పూర్తి గావింపబడినవి. దిగువ గోదావరి ప్రాంతములో కరపురాకాసికి ఉద్వాసన చెప్పబడినది.

కృష్ణానదిమీద బెజవాడవద్ద ఆనకట్టకు పథకము తయారుచేసినవాడు సర్ హెన్రీ అట్వేల్ లేక్ అను నాతడు, ఆ పథకమును కాటన్ బలపరచినాడు. సర్" లేక్ ప్రారంభించిన కృష్ణ ఆనకట్టను చార్లెసు ఆర్ పూర్తి గావించినాడు. ఈ చార్లెను ఆర్' అను నాతడు కాటన్ కు శిష్యుడే. కృష్ణానది ఆనకట్ట నిర్మాణము కూడ కాటన్ సలహాలతోనే పూర్తి అయినది. దీని నిర్మాణకాలము 1852-1855.

ఆ తరువాత పెన్న నదిమీద నెల్లూరుదగ్గర ఆనకట్ట నిర్మాణమునకై కాటన్ కృషి గావించినాడు. నెల్లూరు ప్రాంతము ఇందుమూలముగా ధాన్యాగారముగా ప్రసిద్ధి కెక్కి ఆ ప్రాంతపు ప్రజలు సుఖించుచున్నారు. పిమ్మట పాలార్, దీయార్, వెల్లార్ అను నదులమీద కూడ ఆనకట్టలు నిర్మించుటకు అతడు కృషి గావించినాడు. గోదావరి, కృష్ణా, కావేరీనదులకంటే ఇవన్నియు చాల చిన్నవి. అయినను, వీటివల్ల కూడ ఆయా ప్రాంతీయ ప్రజలకు క్షామబాధ తొలగిపోయినది. మధురజిల్లాకు జీవన ధాత్రియైనది పెరియార్ నది, పెరియార్ ప్రాజెక్టుకు కూడ ప్రణాళికను తయారుచేసినది కాటన్ మహాశయుడే.

1877 6 ఆంధ్ర, దక్షిణ జిల్లాలలొ మహాక్షామము వచ్చినది. "డొక్కల కరవు" అను పేరుతో ఇది ప్రసిద్ధమయినది. ఈ కరవువల్ల 77 లక్షలనుంది చనిపోయిరి. అయితే ఈ రకపు బాధలు నీటి పారుదల సౌకర్యము లున్న ప్రాంతములకు' ఏమాత్రము సోకలేదు. అంతేగాక, ఆనకట్ట లున్న జిల్లాలనుంచి ఆహారపదార్థములను కరపుచే పీడితము లయిన ప్రాంతములకు పంపుటకు అవకాశము కలిగినది. ఈవిధముగా కాటన్ మహాశయుడు దీర్ఘ దృష్టితో నిర్మించిన ఆనకట్టలవల్ల అసంఖ్యాక జనులకు మహోపకారము జరిగినది.

1862 లో కాటన్ పదవీవిరమణ గావించెను. కాని, అటు తరువాత కూడ ఇతడు ఇంజనీరింగు సలహాదారుడుగా పనిచేయుచునే యుండెను. కృష్ణపై కర్నూలు దగ్గర ఆనకట్ట నిర్మాణమునకు ఆయన పథకము వేసినాడు. కాని ఆయన ఉద్యోగకాలములో అది జరుగలేదు. తరువాత ఈ ఆనకట్ట విషయములో ఆయన సలహాలను ఇచ్చుచునే యుండెను. దీని నిర్మాణ విషయమై శ్రద్ధ వహించినాడు. కర్నూలు సమీపములోని సుంకేశులదగ్గర ఆనకట్ట తయారయినది. కాని ఆ ప్రాంతపు ప్రజలు నీటిని వాడుకొనక దాని యుపయోగము సరిగా పొందజాలకపోయినారు.