Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/682

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము -౨

కాటన్, సర్ ఆర్థరు థామస్

యుండును. ఒకమారు ఒక తలమును, రెండవమారు కాగితపు రెండవ తలమును వేడిచేయు ప్రదేశమును స్పర్శించునట్లు వేడిగాలి గొట్టములు ఈ స్తూపములకు అమర్పబడియుండును. ఎండించెడి స్తూపములు సాధారణముగా రెండు లేక మూడు కూర్పులు లేక వేడిగాలి గొట్టములుగా విడదీయబడి యుండును. వీనిమధ్య ఒత్తెడి స్తూపములు (Nip Rolls) ఉండును. ఇవి కాగితము ఇంకను తడిగా నుండి మార్పునొందు స్థితిలో నుండగనే దానిని చదును చేసి, నునుపుపరచుటకు వినియోగించును.

ఎండించిన తర్వాత మెరుగు పెట్టుట జరుగును. మెరుగు పెట్టు స్తూపముల యొక్క రెండు మూడు కూర్పులు, లేక వేడిగాలి గొట్టములు సాధారణముగా దీనికొఱకు అమర్పబడును. కావలసిన తలము యొక్క ప్రమాణము (grade) ననుసరించి, ఈ యేర్పాటు చేయబడును. ఈ మెరుగు బెట్టు స్తూపములు దృఢీకృతమైన ఇనుపరోలర్ల (chilled Iron Rolls)తో చేయబడిన నిట్టనిలువు గొట్టములుగా నుండును. సామాన్యముగా నివి అయిదు ఉండును. ఒక దానిలో నొకటి గిరగిర తిరుగుచుండును. వీనిలో కొన్ని ఆవిరితో వేడిచేయుటకు వీలుగా రంధ్రములుచేయబడి యుండును. ప్రతి గాలిగొట్టము పైనను ఉన్న మీటలు (levers) సరిచేయుట వలన కావలసినప్పుడు వానిపై నొత్తిడి యుపయోగింపబడును. తుదకు కాగితము చల్లబరచెడి స్తూపములవద్దకు పోవును. అవసరమైనచో నీటిని చల్లి, కాగితమును చల్లబరచి, దానిని ఒక రీలుమీద గుండ్రముగా చుట్టుదురు.

కదలుచుండగా యంత్రముయొక్క వేగము తరచు మార్చవలసి వచ్చును. వివిధభాగముల యొక్క వేగము పరస్పరము కొద్ది మార్పు చెందుటకు వీలుగా సవరించుటకు తగిన యేర్పాట్లు చేయబడి యున్నవి. వేరు వేరు దళసరితనములకొరకుమ, వేరువేరు గుజ్జుపదార్థములు కొరకును కావలసిన రీతిగా కాగితపు టల్లిక వేరువేరు విధములుగా సంకోచ వ్యాకోచములు పొందుటకు ఈ ఏర్పాట్లుపకరించును.

శ్రేష్ఠతరమైన తరగతికి చెందిన కాగితములను తయారుచేయు కర్మాగారములలో 90 అం. వెడల్పుగల యంత్రములను సాధారణముగా నుపయోగింతురు. అంతకంటే నెక్కువ వెడల్పుగల యంత్రములకంటె కూడ అవి ఎక్కువ చిక్కని నేతగలిగినట్టియు, సమానవ్యాప్తి కలిగినట్టియు కాగితములను తయారు చేయును. కాని వార్తా పత్రికల కుపయోగించు కాగితములు 240 అం. ల వెడల్పువరకు ఉండి, నిమిషమునకు 1200 అ. వరకును తయారగును. మొదటి రకపు యంత్రములు వారమునకు 20-40 టన్నులు వరకును, రెండవ రకపు యంత్రములు 750 టన్నుల వరకును కాగితము నుత్పత్తి చేయును.

వి. యన్.


కాటన్, సర్ ఆర్థరు థామస్ :

సర్ ఆర్థర్ థామస్ కాటన్ మహాశయుడు ఇంగ్లండు దేశములో ఆక్సుఫర్తునకు సమీపములో నున్న ఉడ్ కొట్ గ్రామములో 15-5-1803 తారీఖున జన్మించెను. స్థాపత్య విద్యలో (Engineering) పట్టభద్రుడయిన తరువాత కాటన్ 1821 మే నెలలో ఇండియాదేశమునకు తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా పచ్చెను. కంపెనీవారాతనిని కన్యాకుమారీ ఆగ్రము దగ్గరకు కొన్ని ప్రణాళికలను గూర్చిన ప్రాథమికా న్వేషణములు గావించుటకై పంపిరి. పాంబన్ జలసంధిని లోతు చేసి, ఓడలు పోవునట్లు చేయవచ్చునని కాటన్ ఒక పథకము వేసి పంపెను. కాని కంపెనీ అప్పటిలో ఆ పథకమును ఆమోదించలేదు. 1824 లో బర్మాయుద్ధము వచ్చెను. కంపెనీవారి పనుపున కాటన్ ఆ యుద్దములో పని చేసినాడు. యుద్ధము ముగిసి కాటన్ ఇండియాకు వచ్చినతరువాత 1828 లో కంపెనీవారాయనను దక్షిణ భారత దేశములో నీటివనరులను కల్పించి అభివృద్ధిచేయు పనిలో నియమించిరి.

దక్షిణ భారతములో ఎన్నో సదులున్నవి. అయిననేమి ? ఏటేటా కరవులు వచ్చుచునే యుండెడివి. ఆ కరవుల వాతబడి అసంఖ్యాకులయిన ప్రజలు మరణించుచునే యుండెడివారు. ఇదంతయు చూచి, సధులకు ఆనకట్టలు కట్టి, కాలువలు తీసి, నీటివనరు లేర్పాటుచేసి ప్రజల బాధలు తొలగించవచ్చునని ఇంజనీర్ కాటన్ ఊహచేసెను. కొన్ని పథకములను వేసి తూర్పుఇండియా కంపెనీవారిముందు ఉంచెను. అప్పటి రాజకీయ ప్రయోజనములను పురస్కరించుకొని, రైల్వేలను నిర్మించుటయే తత్ క్షణ కర్తవ్యమని భావించుచున్న కంపెనీ అధికార