కాగితపు పరిశ్రమ స్తూపములు సామాన్యముగా రెండు, అంతకంటె ఎక్కువ భాగములు లేక వేడి గాలి గొట్టములుగా విడదీయబడి యుండును. వీనిమధ్య 'ఒడి స్తూపములు' (Nip rolls) ఉండీ, ఇంకను కడి ఆరకుండగనే కాగితమును నునుపుగా జేయును. డెకెల్ పట్టీలు (Deckle Straps) కాగితపు వేడల్పును స్థిరపరచుటకై ఏర్పాటు చేయబడు చున్నవి. గుజ్జుగా చేయబడిన అర్ధద్రవ్యము లోహతంను వుపై పరుపబడినది మొదలుకొని, అది 'బ్రెస్టుబాక్సు' ద్వారా వెలువడి వచ్చునప్పుడు కాగితపు టల్లికతన అంచులను నిలబాటు చేసికొన గల్గునట్లు ఎండువరకును ఈ డెకెల్ పట్టీలు (Deckle Straps) కాగితపు గుజ్జు ద్రవము వెంబడినే దానికి మార్గదర్శకముగా అనుసరిం చుచు వచ్చును. ఈ డెకెల్ పట్టిల ఈ డెకెల్ పట్టీల మధ్యదూరమునకు కావలసినట్లుగా హెచ్చించవచ్చును, లేక తగ్గింపవచ్చును. ఇట్లు చేయుటవలన కాగితపు వెడల్పును కావలసిన విధ ముగా మార్పుచేసికొన వచ్చును. లోహతంతువును దాని స్థానమునందు నిలుపుటకై 'ట్యూబ్ రోల్సు' యొక్క పరంపర యుండును. వీనికిని లోహరంతువునకును మధ్య ఇవి కలియు తావుల వెంబడి నే చదునైన ఒక రాగి లేక కర్రతొట్టి (tray) అమర్చబడి యుండును. దీనిలోనికి లోహతంతువునుండి జారెడు నీరు ప్రవహించును. ఈ తెల్లని నీటిలో కాగితపు గుజ్జుయొక్క తునకలుండును. ఈనీరు లోతైన తొట్టెలోనికి ప్రవహించు నట్లు చేయబడును. అందుండి దానిని తోడి గుజ్జుతునక లను సురల ఉపయోగించెదరు. లోహతంతువు యొక్క ఆవలి కొన యొద్ద రెండు లేక అంతకంటే ఎక్కువ పీల్చేడి పెట్టెలు (Suction Boxes) ఉండును. నీటిని ఇంకను ఎక్కువగా తొలగించుట విని ప్రయోజనము. వీనికి మధ్య 'డేండీ రోల్' (Dandy Roll) అనబడు ఒక లోహతంతు వుతో చేయబడిన స్తూపము వంటి ఆకారముండును. ఇది నీటి గుర్తును, అలను లేక ఉంచబడిన గుర్తులను కాగిత మున కిచ్చుట కుపకరించును. లోహతంతువు కొక కొన నున్న బ్రెస్ట్ రోలు ఆధారము నుండి వేరొక కొన నున్న 'మొదటి 'పీల్చేడి పెట్టె' వరకును ఉన్న యంత్రము యొక్క చట్రము ఒక బలమైన జత కీళ్ల మీద వ్రేలాడునట్లు చేయ బడును, ఇది యిటువటు క్షితిజ సమాంతరముగా సంచల 632 సంగ్రహ ఆంధ్ర సమునందుటకు శక్తి గలిగియుండును. సవరించుటకు వీలైన 'ఎక్సేంట్రిక్' అగు యంత్రభాగమునకు నీలచే తగు విధ ముగా బిగించబడునదై క్షితిజ సమాంతరముగా సంబంధము కలిపెడి ఒక కడ్డీ ఈ సంచలనము కలిగించుటకు సాధన ముగా నుండును. చేతి కా కాగితమునకు చేతితో వలెనే ఈ సంచలనమిచ్చుట కాగినపుటల్లిక ఏర్పడుటకు తోడ్పడు చున్నది. రెండవ 'పిల్చెడి పెట్టె' నుండి తడితో నున్న గుజ్జు యొక్క అల్లిక 'చదును చేయు' స్తూపములకు (Couch Rolls) మధ్య నుండి పోవునట్లు చేయబడును. చేతి కాగితము తయారుచేయుటలోని 'చదునుచేయుట' తో గల పోలికను బట్టి వీని కి పేరు పెట్టబడినది. వీటివలన ఇంకను మిగిలిన నీరు ఒత్తి, ఓడ్చబడి, శద్ధ్వారా కాగితపు టల్లికకు తగిన గట్టీ దనము కలిగి, లోహతంతువు నుండి విడివడుటకు వీలు కలుగును. ఇదియే ఈ స్తూపముల వలని ప్రయోజనము. ఈ చదునుచేయు స్తూపములను మీట (levers) ల తోను, బరువులతోను కప్పుట వలన కాగితపు టల్లిక మీద నున్న ఒత్తిడిని సరిచేయుచుందురు. ఆధునిక యంత్రములలో పై చదును స్తూపము లేక క్రింది చదును స్తూపముమాత్ర ముండును. దీనికి ఎగపీల్చుట (suction) ద్వారా నీటిని తొలగించు ఏర్పాటు ఉండును. కాగితపు టల్లిక యిప్పుడు పూర్తిగా ఏర్పడి తడికాగితముగా తయారగును. అప్పు డది రెండు ఒత్తుడు స్తూపముల ఏర్పాట్ల ద్వారా పోయి యంత్రపు పొడి కొనకు చేరును. ఎండించుట ఎంత మృదు వుగా, ఎంత క్రమముగా చేసిన, అంతిమ ఫలిత మంత బాగుండును. త్వరగా నెండించుట అంత లాభదాయకము కాదు. అట్లుచేసినచో సంకోచము హెచ్చుతగ్గులు కలిగినదై మితిమీరి యుండును. అందుచే కాగితము పెళుసుగా వచ్చును. వేడిచేయు ప్రదేశపు పై శాల్యము అందుచే సాధ్య మైనంత పెద్దదిగా చేయబడును. ఇది దానికొక కారణము, అంతియగాక యంత్రములు చాలవేగముతో నడుపబడును. కావున ఎండించుస్తూపములు బహు సంఖ్యాక ము 'ములుగా మొదటి ' రెండు మూడు స్తూపములలో మిక్కిలి యెక్కువ ఇగురుట లేక ఆరుట జరుగును. ఇవి తప్ప తక్కిన స్తూపములన్నియు ఎడతెగని సంచారము చేసెడి ఉన్ని అల్లికల (feits) వంటి వానిచే ఆవరింపబడి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/681
స్వరూపం