విజ్ఞానకోశము -౨
ఆసియా
చొప్పున కలరు. టండ్రాభూమి, మధ్యాసియా పీఠభూమి ప్రాంతము, నైరృతి - ఆసియా, అరేబియా, సై బీరియా
మొదలయినవి చాలా అల్ప జనాభా కలిగిన దేశములు.
ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయము. సిల్కు, నూలు, బట్టల నేత, చేపలు పట్టుట, రబ్బరు పెంపకము, ఖనిజము లను త్రవ్వుట మొదలగునవి ఇతర వృత్తులు. మిల్లులలోను, ఫ్యాక్టరీలలోను జనులు పనిచేయుచున్నారు. ఇరాన్, ఇరాఖ్, టర్కీ దేశాలలో తివాచీలు నేయుదురు. జపాన్ లోని ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయమే అయినను, అచ్చట పరిశ్రమలు బాగుగ అభివృద్ధిచెందుటవలన అశేష జనులు ఆయా వ్యాపారములందు కృషి సల్పుచున్నారు.
జాతులు...మతములు_ సంస్కృతులు : ఆసియాఖండము లనేక జాతి, మత, సంస్కృతులకు పుట్టినిల్లు, ఈ ఖండ మందు నూటికి 60 మంది మంగోలియాజాతివారు. వీరు సైబీరియా, జపాన్, కొరియా, మంచూరియా, చైనా, ఇండోచైనా, హిమాలయ పర్వత ప్రాంతము, ఇండోనీషియా, మలయా, ఫార్మోజా మొదలయిన దేశములలో కలరు. వీరు చామనచాయ గలిగిన శరీరము, నల్లటి జుట్టు, చప్పిడిముక్కు కలిగి పొట్టిగానుందురు. శరీరమునందును ముఖములందు వెండ్రుక లుండును.
గంగా సింధు మైదాన ప్రాంతము, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, సిరియా, ఇరాక్, అరేబియా మొదలగు దేశములలో కాకసస్ జాతివారు కలరు.
దక్షిణ హిందూదేశము, అండమాన్ దీవులు మొదలగు దేశములలోని కొందరు ప్రజలు మలయా, ఫిలిప్పైన్, సుమిత్ర దీవులలోని జనులు "నిగ్రోయడ్" జాతివారు. వీరికి సల్లటి శరీరము, మెత్తటి జుట్టు, చప్పిడిముక్కు, పొడుచుకొని యున్న పెదిమలు ఉండును.
ఇంకను ఆఫ్రోలోయడ్ జాతివారు కలరు. హిందూ దేశ మధ్యభూభాగమున నున్న కొన్ని కొండజాతులు ఈ జాతికి చెందినవే.
ఆసియాలోని ప్రజలందరు ఆయా ముఖ్యజాతులకు చెందినవారని నిర్ధారణగా చెప్పుట కష్టము. పెక్కు జాతుల సంబంధ బాంధవ్యములచే మిశ్రజాతులు ఏర్పడినవి.
ఆసియాలో జూతులతో పాటు వివిధమతములు, సంస్కృతులు కలవు. ఈ ఖండము జైన, బౌద్ధ, మహమ్మదీయ, క్రైస్తవ, హిందూమతములకు జన్మస్థానము. మొట్టమొదట పేర్కొనదగినది చైనా సంస్కృతి. ఇది చాల ప్రాచీనమైన సంస్కృతి. మంచూరియా, ఉత్తర కొరియా, జపాన్, ఫార్మోజా, మంగోలియా, టిబెట్, ఇండోచైనా, తాయిలాండ్, తూర్పు ఇండియా దీవులు మొదలయిన దేశములలో చైనా సంస్కృతి కన్పడును. ఈ దేశములన్నియు చైనా సంస్కృతి ప్రభావమునకు లోనైనవి. చాలమంది చైనీయులు బౌద్ధులు. మహమ్మదీయ, క్రైస్తవ, టాయిమతములు ఈ దేశములందు వ్యాపించినవి.
ఆసియాలోని రష్యా దేశీయుల సంస్కృతికూడ ప్రశస్తమైనది. ఈ సంస్కృతిగల ప్రాంతమును నాలుగు మండల ములుగా విభజించవచ్చును.
1. యూరపులోని రష్యా తూర్పు భాగము నుండి యూరల్ పర్వతముల చివరవరకు ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతము చాల అభివృద్ధి చెందుచున్నది. అనేక పట్టణములు పెరిగినవి. రహదారి సౌకర్యములుకూడ ఎక్కువగుచున్నవి.
2. పర్వతమయమయిన కాకేషియా ప్రాంతము. ఇది నల్లసముద్రమునకును, కాస్పియన్ సముద్రమునకును మధ్య నున్నది. టర్కీ, ఇరాన్ దేశముల సరిహద్దు ప్రాంతములు ఈ మండలములోనివే. ఈ మండలమున సోవియట్లు అను సంపూర్ణ స్వాతంత్య్రము కలిగిన అనేక దేశములు కలవు.
3. కాకేషియానుండి తూర్పుగా చైనావరకు ఉన్న ప్రాంతము. దీని మధ్య ఎడారులు, పర్వతములు, గడ్డి భూములు కలవు. ఈ ప్రాంతమునందలి జనులు అనేక ఉపజాతులకు, సంస్కృతులకు చెందినవారు. వీరి మతములు, భాషలు వేరు వేరుగా నున్నవి. వీరిలో పెక్కుమంది మిశ్రమజాతి సంస్కృతులను కలిగి యున్నారు. ' 4. విశాలమైన మైదానము. ఇది అడవులతో, పర్వతములతో, గుట్టలతో నిండియున్న సైబీరియా ప్రాంతము.
హిందూదేశము ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగి.యున్నది. దీనికి ఆసియాలోని తక్కిన ప్రాంతములతో సంబంధము లేదు. ఇండియా, పాకిస్థాన్ దేశాలను కొంతవరకు చైనాతో సరిపోల్చ వచ్చును. ఈ దేశాలు చైనా