Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/678

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పిజ్ఞానకోశము ” “ఫ్లాక్సు" (Flax), 'రామి' (Ramie) అను చైనా గడ్డిమొక్క మొ. వానిలో వివి అనేకములగు మిల్లిమీటర్ల పొడవుండును. అట్టి సందర్భములో అర్ధద్రవ్యమును తయారుచేయునపుడు వాటిని చిన్నముక్కలుగా ఖండన యంత్రములోని కత్తులచే సరుకవలసి యుండును. అట్లు కాక సహజములైన నారచారముల సూక్ష్మభాగములు కర్ర, ‘ఎస్పార్టో' (Esparto) లలో వలె ఒకప్పుడు రెండు మూడు మిల్లీమీటర్లకు మించక పొట్టిగానుండును. అట్టి సందర్భములో ముక్కలుగా నరుకుట అనవసరమగును. అందుచే వానిని వేరుగా ఖండించుట మానుదురు. కాని కనీసము కొంత పరిమితి వరకైన ఒత్తిడిచేయుట, చితుక కొట్టుట, చూర్ణము చేయుటయును అవసరమగును. అందుచే చాల తక్కువరకపు కాగితములైనచో తప్ప తక్కినవాటి విషయములో దంచుట ఎప్పుడును తప్పని సరిగా చేయుదురు. అందుచే ఖండించుట, దంచుట, అను నీ క్రియావిధానముల వలన ఈ క్రింది సమష్టి ఫలితములు సిద్ధించును. నారదారముల నొండొంటిని విడదీయుట, చితుకగొట్టుట, చదునుచేయుట, సంయోగితము చేయుటయు కూడ వీనిచే చేకూరును. ఈ ఫలితముల జల కలయికను మనకు కావలసిన విధముగా మార్చి ఈ క్రియా విధానమును సవరించుట సాధ్యపడును. ఇట్లు చేయుట వలన మనకు కావలసిన ఏ ప్రమాణము లోనికై నను తయారుచేయబడు కాగితము యొక్క గుణవిశేషములను మార్పుచేయగలము. ముతకరకమగు అద్దుడు కాగితము నుండి నాజూకైన బ్యాంకు నోటుకాగితము, నిగరెట్ కాగితము వరకును గల రకరకములైన కాగితముల నిట్లు తయారుచేయవచ్చును. తుదకేర్పడు నారదారములు సూక్ష్మదర్శినితోగూడ గుర్తింపరానంత సూక్ష్మ భాగ ములుగా దంచుటవలన బ్యాంకునోటు కాగితము, సిగ రెట్ కాగితము తయారుచేయబడును. అట్టి వివిధ నిష్పత్తులతో కూడిన ఫలితములను సాధించుటకు కావలసిన సవరింపుల విధానము కేవలము ఖండించు విధములోను, దంచెడి విధములోను మాత్రమే కాదు. అసలు నారదారముల యొక్క నిర్మాణ లక్షణములమీద కూడ ఇది ఆధారపడి యుండును. ప్రతి నారదారమును స్వకీయమైన ప్రత్యేక లక్షణములను కలిగియుండును. తనకు కావలసిన సవరణ 629 " కాగితపు పరిశ్రమ లను చేయుటలో కాగితపు నిర్మాత వీటిని మనస్సులో నుంచుకొనును. బలమైన కాగీతమును చేయుటకు, ఖండిం చుటకు తక్కువ ప్రాధాన్యమును చిరుకకొట్టుటకు ఎక్కువ ప్రాధాన్యమును ఒసగవలెను. ఈ పరిస్థితులలో ప్రత్తి, జనుము, ఫ్లాక్సు (Flax) మొ. వాని నారదారముల పొడవుల చివరలను ఖండించి, విడబరచి, పెనవేసికొను నట్లు చేయుదురు. ఇట్లు చేయుటవలన అల్లిబిల్లిగా పెనవేసి కొనుట, బలముకలిగి యుండుట అను లక్షణము లభివృద్ధి యగును. ప్రత్తి నారయొక్క నులిపోగులను ఇట్లు తయారు చేసినచో అల్లిబిల్లిగా నున్న వలవలె లేక కిటికీ జాలరిపనివలె కనబడును. "ఫ్లాక్సు" జనుముల యొక్క నారదారము ఇట్లు గాక నార నులిపోగులు ముద్దలు కట్టి రంగువేయు కుంచె ఆకారముగా కనబడును. రోటిలో (beater) చితుక గొట్టుటచే నీటిని పీల్చుకొనుటవలన కలుగు సార్ధశాఫలితము కొన్ని నారదారముల రకము లలో తక్కినవాటికంటే ఎక్కువ సులభముగా సిద్ధించును. "ఫ్లాక్సు" (Flax) జనుములయొక్క నారదారములు త్వరగా జలసంయోగము నందును. అప్పుడవి ఎప్పుడును రొంపివలె అంటుకొనున ట్లగపడును. ప్రత్తి ఆ విధముగా అగపడకపోవుటచేత, చేతితో తాకుటవలన దానిని సులభ ముగా గుర్తింపగలము. పండ్రెండుగాని, అంతకు ఎక్కువ గాని గంటలవరకు దంచిన పిమ్మట, పదార్థము తడిని గ్రహించి పనికివచ్చునట్లు నలుగును. అట్టి పరిస్థితిలో కాగి తము చేయు లోహ తంతువులపై పదార్థము ఎక్కువ నీటి పరిమాణమును తనలో నిలుపుకొన గలిగి యుండును. ఎండినపిదప పదార్థము అధిక సంకోచమును పొందును. అట్లు పూర్తి చేసి తయారు చేయబడిన కాగితము గలగల మను చప్పుడును, గట్టితనమును ఎక్కువగా కలిగి యుండును. దాని నేత మందము ఎక్కువ దగ్గరగా నుండును. సచ్ఛిద్రత (porous) తక్కువగా నుండును. సిరాను నిరోధించుటకై చేయవలసిన ఉపరితల నిర్మాణము యొక్క పరిమితి కూడ స్వల్పతరముగా మండును. అడుగు రేకు (bed plate) మీదను, గిరగిర తిరిగెడి డ్రమ్ము(revolving drum) వంటి దానిమీదను గల కత్తుల యొక్త కోణములను సరిచేయుటవలన, వరకుట యొక్షయు దంచుట యొక్కయు ఫలితములు సాధింపబడుచున్నవి.