Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/675

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాకినాడ నేర్పడుచుండు పరి వేష్టనముల వలెను, కాంతి విశ్లేషణము (diffraction) చెందును. పదార్థములయందు రాసా యనిక క్రియలను జరుపుచు వాటి సంఘట్టనములయందు విపరీతమగు మార్పులను జరుపును. ఈ విధముగా కాంతి భౌతిక పదార్థముల యొక్క మనుగడయందు అధ్యంత ప్రధానమగు పాత్రను వహించుచున్నది. కాకినాడ: సి. ఆ కాకినాడ పట్టణము కాకినాడ తాలూకారును, తూర్పు గోదావరిజిల్లాకును ముఖ్యపట్టణము. పాశ్చాత్య దేశీయ వర్తకసంఘములు భారతదేశముతో వర్తకముకొరకు క్రీ. శ. 1600 ప్రాంతమున నెలకొనిన నాటినుండియు ఈ నగర ప్రాముఖ్యము క్రమముగ వెచ్చగుచువచ్చెను. 1871 వ సంవత్సరమునాటికి జనసంఖ్య 17,889 వరకు పెరిగెను. 1951 నాటికి 99,952 మంది జనుల సంఖ్య తోను, ఎనిమిది చదరపుమైళ్ళ భూవిస్తృతితోను సముద్ర తీరమున ఇది ఒక సుందర పట్టణమై 1886 వ సంవత్స రమునాటికి మ్యునిసిపాలిటీ యైనది. బంగాళాఖాన మున కోరంగి సముద్ర మనెడి గుఱ్ఱపు డెక్క ఆకారముగ నుండెడి యైదుమైళ్ళ వెడల్పును, యైదు మైళ్ళ పొడవును గల సముద్రపు రేవుభాగములో నైరృతిమూలగా ఈ పట్టణ మున్నది, గోదావరీనది స ప్రశాఖలుగా విడిపోయి సముద్రమున సంగమించుచున్నది. ఈ శాఖలలో మిక్కిలి యుత్తరమున నున్న కుల్యభాగాశాఖ సముద్రమున చేరుచున్న చొల్లంగి క్షేత్రమునకు ఆరుమైళ్ళలో కాకినాడ యున్నది. రెండవశాఖ యగు కోరంగినది (అత్రిశాఖ) కోరంగి యొద్ద సంగమించుచున్నది. కోరంగి, కాకినాడకు పది మైళ్ళ దూరమున గలదు. 'ఇది ప్రాచీన కాలము నుండియు ఓడలకు రేవు స్థలముగా నున్నది. నదియొక్క వండుచే ఈ రేవు క్రమముగ పూడిపోవుటచే దీని ప్రాముఖ్య మంతయు కాకినాడకు సంక్రమించినది. కోరంగి, సముద్ర. తీరపు అగ్రమని 'ప్లీనీ' యను చరిత్రకారుడు వ్రాసెను. ఇవుడు కోరంగి సముద్రమునకు కొన్ని మైళ్ళ దూర ములో నున్నది. కోరంగి యొద్ద ఓడలు నిల్పుటకు బల మైన రాతిగోడ కట్టబడినది. అది ఇప్పుడు శిథిలమైనది. ఇప్పుడు కాకినాడకు అయిదు మైళ్ళ దూరమున సముద్ర సంగ్రహ ఆంధ్ర మున లంగరు వేసికొని ఓడలు నిల్చుచున్నవి. ఈ యోడల నుండి 'కాకినాడ రేవునకు నూరేసి టన్నుల పెద్ద పడవలు సరకులను చేర్చును. ఓడల గుర్తుకొర కి ప్రాంతమున నాలుగు దీ: స్తంభములు కట్టబడెను. కాకినాడ దగ్గర సున్న స్తంభము 1977 నుండి ఉపయోగరహితమై యున్నది. కాకినాడకు ఉత్తరమున అయిదు మైళ్ళలో నున్న వాకలపూడి దీప స్తంభములోని తిరుగుడు దీప మిప్పుడు ఓడలకు గుర్తుగా పనిచేయుచున్నది. మిగిలినవి ఉపయోగరహింగములు. ఓడలనుండి పెద్ద పడవలు కాకినాడకు ప్రక్కగా సముద్రములో చేరుచున్న ఉప్పుటేరుగుండా రేవునకు చేరును. ఈ ఉప్పుపేరునకు రెండు వైపులను రాతిగట్లు కట్టబడినవి. కాకినాడ, చామర్లకోటల కాలువలనుండియు, ఏలేరునది నుండియు పండునీరు ఉప్పుటేరులో చేరునుగాన ఈ యోడ రేవు కాలువ పూడిపోకుండ త్రవ్వు పడవలు పనిచేయుచు దీనిని మరమ్మతు చేయుచుండును., 625 8 చదరపు మైళ్ళు వ్యాపించి, శాఖానగరములతో కాకినాడ విశాలమైన పట్టణముగా నొప్పుచున్నది. ఉప్పు చేపేరునకు పడమరగానున్న భాగమును జగన్నాథపుర మందురు. ఉప్పుకోటారులు, క్రైస్తవ మిషనరీలు, పాఠశా లలు, దేవాలయములు, హిందువుల నివాసములు, నుల్లాడి సత్యలింగమునాయకరు అను మహాచాశ యొక్క సత్ర ములు, విద్యాలయములు మున్నగువానితో ఇంపుగ నుండి ఈ శాఖానగరము ఉప్పుపేరుమీద వంతెన చే ముఖ్య నగరములో కలియుచున్నది. ఈ ఉప్పుటేరు వంతెనమీద ఒక దాత కట్టించిన ఎత్తైన గడియారపు స్తంభ మున్నది. క్రీ. శ. 1600 కు పూర్వము కాకినాడ చరిత్ర అంతగా తెలియదు. పూర్వమిచ్చట కాకుల సంఖ్య అమితముగా నుండుటచే దీనికి కాకివాడ యని "పేరు కలిగెనందురు. ఒకమారొక వర్తకుడు తన బియ్యపుకొట్లలోనికి కాకులను రావించి 978 కాకులను పట్టి చంపెనట! పూర్వ 'మొకప్పు డిది నాటు ఓడల వ్యాపారము జరుగుగ్రామమై యుండనోపును. ఆంధ్రదేశము క్రీ. పూ. 225 నుండి క్రీ.శ. 225 వరకును శాతవాహనుల పాలనలో నుండెను. శాత వాహనుల నాణెములపై నుండిన ఓడ బొమ్మనుబట్టి నాటి నౌకా వాణిజ్యాసక్తి తెలియగలదు. క్రీ. శ. రెండవ