Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/674

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - జ్వాల, పాదరస దీపము మున్నగు కాంతిజనకముల వికిర ణముల వర్ణమాలలు ప్రత్యేక మైన స్ఫుటమగు రంగులను కలిగియుండును. ఇట్టి వాటిని ఏక వర్ణ ప్రసరణము (Monochromatic radiations) అని పిలిచెదరు. వీటి వర్ణమాలలు ఒక దాని పై నొకటి పడనట్టియు, ఒక దానితో నింకోకటి కలియనట్టియు, విడివిడిగా స్పష్టమగు నిర్దిష్ట మైన రంగులను కలిగియుండును. P మిగిలిన సూర్యకాంతి యందుండు భిన్న వర్ణముల సంఘటిత స్వభావమువలన ప్రకృతియందు అనేక విధములయిన వింతవింతలు గొలువు రంగులు ఏర్పడుచున్నవి. ఆకులు, హరితపురంగు తప్ప మిగిలిన రంగుల ప్రసరణముల నన్ని టిని విలీనము చేసికొని ఆకుపచ్చరంగును మాత్రము ప్రస రింప జేయుచున్నవి. ఈ హరిశపురంగు అప్రధాన హరిశ కిరణ (Secondary green) ప్రసరణముగా వ్యాపించును. అటులనే అరుణపుష్పము, పీతవర్ణఫలము తమకు సంబం ధించిన రంగులను మాత్రము వ్యాపింపచేసి మిగిలిన వానిని విలీనము చేసికొనును. రంగులు గల వివిధ పదార్థముల యొక్క వివిధ వర్ణప్రసారములు ఈ వ్యాపన సాదృశ్య మునే కలిగి యుండును. ఒక ఎఱ్ఱని గాజు, రంగుల నన్నిటిని విలీనము చేసికొని అరుణ కాంతిని మాత్రము తనగుండా ప్రయాణము చేయనిచ్చును. పైకి స్ఫటికములవలె స్వచ్ఛముగ కనిపించు పదార్థములు, వాటి మందము ఎక్కువగా నున్నపుడు రంగును కల్గి యున్నట్లు కనిపించును. గాలి, సముద్రము, ఇట్టి సిద్ధాంత ములకు సుస్పష్టమైన ఉదాహరణములు. కొలది పరిమాణ ములలో తీసికొనబడిన గాలి, సముద్రపు నీరు పూర్తిగా పారదర్శకము (Transparent) లుగా కనిపించును. కానీ వాతావరణముచే ఆవరించబడిన ఆకాశము, ఎక్కువ లోతుగల నీటితో నిండియున్న సముద్రము, రెండును దట్టమగు నీలపు రంగును కనబరచును. వీని యందుండు ఆ యణువులచే సూర్యకాంతి వెదజల్లబడినపుడు ఏర్పడు దృగ్విషయమే ఈ నీలత్వము. విడివిడిగా గాని లేక చిన్న చిన్న సమూహములుగా గాని తీసికొనబడిన అణువులు కాంతిని చాల బలహీనముగా బలహీనముగా వెదజల్లును. దానిని , గుర్తించవలయుననిన, ప్రత్యేకమగు ప్రయోగాత్మక సాంకేతిక విధానము కావలయును. గాలియందు గాని, 79 625 కాంతిస్వభావము సముద్రమునందు గాని ఉండునట్లు పెద్ద పెద్ద మొత్తము లలో అణువు లున్నచో, వాటిచే వెదజల్ల బడునట్టి మొత్తము కాంతి మామూలు కంటికి స్పష్టముగా కనిపించునంత ఎక్కువగా నుండును. కాంతి - పదార్థములతో దాని సంబంధము అతి నీల రోహిత (ultra violet) వికిరణముల (Radiations) తోను, ఉష్ణమును సమ్మిళితమయి సూర్యుని నుండి బహిర్గతమగు వెలుగు భూమికి బయటనుండి వచ్చుచున్న అతి ముఖ్యమైన దృగ్విషము. ఇది మృశజీవులయందును, సజీవులయందును అతి ప్రధానమగు ఫలితములను కలుగ జేయుచున్నది. భూమియందు ఉత్పన్నమగు వివిధము లయిన సకల జీవరాసులు పరిణామమునకు అది పూర్తిగా బాధ్యతను కలిగియున్నది. అంతేకాక భూమ్యుపరితల ముపై నుండు పదార్థముల యొక్క సాన్య పరికల్పన యందు (distribution) అనంతమును, అవిచ్ఛిన్నమును అగు ఫలితములను కలుగజేయునున్నది. వృక్షసముదాయ మునకు, జంతు సముదాయమునకు అనుకూలమగు ఉష్ణో గ్రతను, గాలియందు ఆర్ద్రతను మున్నగు భౌతికపు మార్పులను వాతావరణమునందు ఉత్పన్నము చేయు చున్నది. ఈ రెండు విధములగు జీవరాసులకును అత్యవసర నుగు రాసాయనిక ప్రక్రియలను జరిగించుటకు తోడ్పడు చున్నది. సూర్యకాంతియే లేకపోయినచో భూమిపై ఈ జీవరాసుల మనుగడ ఉండెడిదిగారు. మనుగడ ఒక వేళ ఉండినను, ఇంతకాలము సజీవముగా ఉండెడిదిగాడు. సకల జీవరాసులకు భూమి ఆధారభూతముగాను, కాంతి వాటిని పోషించు శక్తిగాను, ఉన్నవి. పదార్థములతో సంబంధము కలిగినపుడు నునుపైన ఉపరితలములందు కాంతి పరావర్తనము చెందును. గఱు కైన ఉపరితలములపై, పడుటవలన వాటి వర్ణలక్షణ ములతో ఆ పదార్థములను వ్యక్తము చేయునట్టి కాంతి ఆ వ్యాపనము జరుగును. పారదర్శక (transparent) పదార్థములగుండా ప్రయాణము చేయునపుడు కాంతి కిరణము తన మార్గమునందు మార్పునొందుచు వక్రీ భవనము (refraction) చెందుచున్నది. అనుకూల పరి స్థితులతో నీటికణముల వలన ఏర్పడిన ఇంద్రధనుస్సులోని రంగులవలెను, సూర్యచంద్రుల చుట్టును గుండ్రముగా