కాంతిస్వభావము సంగ్రహ ఆంధ్ర ఈథరు అను ఊహాయానకము యొక్క భౌతిక ధర్మ (Spectral radiations) కు సంబంధించిన దృగ్విషయము ములను కనుగొనుటకు జరుపబడిన పరిశోధనలనుండి బయల్పడిన పరస్పర విరుద్ధములును, అసందర్భములును అగు పై రెండు అంశములు 'కాంతి తరంగవాదము ప్రమాణాత్మక మేనా ? అను శంతను కలిగింప జేసినవి. అందుచే తరంగవాద సిద్ధాంతము, కాంతి యొక్క వరా వర్తనము, వక్రీభవనము, పరస్పర సమాఘాతము (interference), విశ్లేషణము (diffraction) లను సంతృప్తికరముగా వ్యాఖ్యానించినప్పటికిని, ఈ సిద్ధాంత మును త్రోసిపుచ్చి, మఱియొక నూతన భావమును సిద్ధాంతీకరించి చేయవలసి వచ్చినది. ఈ క్రొత్తగా సిద్ధాం శ్రీకరించి చేయబడిన దానినే 'తేజః పరిమాణవాదము' (Quantum Theory of Light) అందురు. ఈ సిద్ధాం తము ప్రకారము కాంతిజనకమునుండి కాంతిశక్తి పరి మాణములలో అనగా తేజః పుంజములుగా వికిరణము చేయబడుచున్నదని ఊహించబడినది. ఈ కాంతి పరిమాణ ములు నిర్దిష్టమగు తరచుదనమును లేక రంగులను కలిగిన కిరణములకు నిర్దిష్టమగు విలువలను కలిగియుండునని ఊహించబడుచున్నది. సంప్రదాయ సిద్ధమైన అవిచ్ఛిన్న కాంతి తరంగ వాదమును, ఈ కాంతి యొక్క విచ్ఛిన్న స్వభావము లేక పరిమాణవాదపు స్వభావము వెనుకకు నెట్టినది. కాంతియొక్క పరస్పర సమాఘాతము (Inter- ference), కాంతి విశ్లేషణము (diffraction) లను వ్యాఖ్యానించుటకు తరంగవాదము ఎక్కువ ఉపయోగ కరముగా నున్నది. వీనిని సరిగా వ్యాఖ్యానించ లేక పోవుట, ఈ తేజఃకణ వాదమునందలి లోపము ఈ విధముగా కాంతి ద్వివిధ పాత్రలను నిర్వహించు చున్నదను విషయము గుర్తించబడినది. కాంతియొక్క పరస్పర సమాఘాతము (Interference), విశ్లేషణము (diffraction) లను చక్కగా విశదీకరించగల అవిచ్ఛిన్న తరంగవాదము ఒక వైపునను, నల్లని పదార్థపు వికిరణ ప్రసరణము (Black body radiation)ను, ఛాయా విద్యుత్ప్రభావమును (Photo electricity) ను విపు లీకరించగల విచ్ఛిన్న తేజః పరిమాణ వాదము (Quantum Theory), ఇంకొకవైపునను ఉన్నవి. వివిధ పరమాణు వులు, అణువులనుండి వచ్చు వర్ణమాలా వికిరణముల లను సులభముగా వివరింపజేయుట ఈ తేజః పరిమాణ సిద్ధాంతమునకు అనుకూలమగు మరియొక ముఖ్య సాక్ష్యము. కాంతి యొక్క తరంగ యాంత్రిక సిద్ధాంతము {Wave Mechanical Theory of Light) ఈ రెండు విభిన్న దృక్పథములను సమన్వయ పరచుచున్నది. కాంతికి సంబంధించిన దృగ్విషయముల నన్నిటిని చక్కగా సమస్వ యము చేసికొనుటకు ఈ క్రొత్త సిద్ధాంతము వీలుగా నున్నది. కాంతి, స్థూల ఫలితముల సందర్భములలో తరంగ సూపము నొండు నియు, ఆణుపరమాణువులలో సంబం ధము కల్గిన సూక్ష్మఫలితముల సందర్భములలో తేజః సరిమాణ రూపమును పొందుననియు ఈ క్రొన్తి సిద్ధాంతపు సారాంశము. ఈ విధముగా కాంతి యొక్క సర్వ సమన్వయ సిద్ధాంతము స్థాపించబడినది. 624 1. కాంతియొక్క రంగు సూర్యుడును పలురకము లగు కాంతిజనకములును తెల్లని కాంతిని ప్రసరింప జేయును. ఈ తెల్లని కాంతి పట్టక ముగుండా ప్రసరింప చేయబడినప్పుడు, అది దాని ఘటక వర్ణములుగా విభజింప బడును. ఈ కాంతిజనకము లన్నిటినుండి బహిర్గతమగు కిరణప్రసరణములతో వర్ణమాల యందలి ఎఱుపునుండి ఊదారంగు వరకుగల కాంతి ప్రసరణములు మాత్రమే కంటికి కనిపించును. ఒక చివర అరుణవర్ణము తరువా తను, రెండవ చివర ఊదారంగు తరువాతను కంటిని ఉ త్తేజపరచలేని కిరణములు గలవు. వర్ణమాలకు చెందిన స్త్రీయ విజ్ఞానమునందు ఈ అదృశ్య భాగములోని వాటిని అతి రక్త కిరణము (Infra red) అనియు, అతి నీలలోహిత కిరణము (ultra violet) లనియు పిలిచెదరు. తరచుదనము యొక లేక తరంగ దైర్ఘ్యముల సహా యమువలన వేరువేరు రంగులను గుర్తింతురు. కాంతి తరంగముల నిడుపులనుబట్టి ఆయా రంగుల కిరణములను గుర్తింపవచ్చును. వివిధ కిరణ ప్రసరణముల యొక్క వర్ణమాలా లక్షణములను బట్టి వివిధములగు కాంతిజనక ములను గుర్తింపవచ్చును. విద్యుద్దీపమునుండి, కర్బన విద్యుత్ ధనువునుండి వెలువడు కిరణముల వర్ణమాలలు అవిచ్ఛిన్నముగానుండి అందలి ఘటక వర్ణములు క్రమముగా నొకదానితో నింకొకటి కలియుచు ఉండును, సోడియము
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/673
స్వరూపం