Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - . ఇట్లు పదార్థములు ఇవర విధములగు శక్తులను కాంతి రూపమగు శక్తిగా మార్పు నొందింపచేయుటకు సాధన మగుచున్నవి. ఈ విధముగా ప్రసరింప జేయబడిన కాంతి యొక్క వర్ణ సంఘట్టనము, ఆ ద్రవ్యము ప్రకోపింప చేయబడిన ఉష్ణో గ్రత పైనను, ఆద్రవ్య స్వభావముపైనను ఆధారపడి యుండును. తగినంత విద్యుత్ పీడనము (Electric Potential difference) గల విద్యుత్తును రెండు కర్బన విద్యుద్వారములకు కలుపుటవలన విద్యుచ్ఛాపము (Elec- tric arc) జనించును. ఆ చాపమునుండి ప్రజ్వలింప చేయ బడిన కాంతి సూర్యునినుండి వికిరణమొందు శక్తివంతమైన తెల్లని కాంతిని పోలియుండును. వర్ణమాల దర్శక (Spectroscope) సహాయమున ఈ కాంతిని విభజించి నపుడు, ఆకాంతి వివిధవర్ణములు / విశ్లేషణము చెందుటను వర్ణమాల (Spectrum) లో చూడగలము. ఆ కాంతి అనేక వర్ణముల వికిరణములను కలిగి యున్నట్లుగాను, క్రమక్రమముగా అవి ఒకదానితో ఇంకొకటి కలియునట్లు, గాను, ఈ రంగుల వికిరణములన్నియు వేరువేరు నిష్ప త్తులలో నున్నట్లుగాను పొడచూపును. అట్లుగాక అదే విద్యుత్పీడన భేదమును రెండు తామ్ర విద్యుద్వారముల మధ్య ఉపయోగించి, విద్యుచ్ఛాపమును ప్రజ్వలింపచేసినచో దానినుండి వెలువడు కాంతివికిరణములు పూర్తిగా భిన్న మైన రంగును కలిగియుండును. ఈ శాంతిని విశ్లేషణము చేసినపుడు ఈ వికిరణములు లెక్క లేని రంగుల కాంతి వికిరణములను కలిగియుండక, రంగునందును, గాఢత్వము నందును, పూర్తిగా భిన్న వర్ణములు గల కొన్నిటిని మాత్రమే చూపించును. ఇట్టివానిని ఏక వర్ణ కిరణ ప్రసరణము (Monochromatic radiations) అందురు. 3. కాంతి ప్రసరణ విధానము: సెకండునకు 1,88,000 మైళ్ళ వేగముతో కాంతి వికిరణములు ఆకాశములో ప్రయాణము చేయును. ఈ ప్రసరణమునకు ద్రవ్య సంబంధ మగు యానకము ఎట్టిదియు అవసరములేదు. ప్రసరణము, పరావర్తనము, వక్రీభవనము, పరస్పర సమాఘాతము (Interference), విశ్లేషణము (diffraction) మున్నగు విషయములందు ధ్వని తరంగములు ఎట్టి దృగ్విషయము లను కనబరచునో, అట్టి దృగ్విషయములను కాంతికిరణము 623 కొంతిస్వభావము లందును సమన్వయకరచుటకు, ధ్వని తరంగముల ప్రసరణ మునకు తగిన యానకమువంటి యాసకము కాంతికిని అవసరమగుచున్నది. విశ్వవ్యాప్తమైనదని ఊహించబడు చున్న 'ఈథరు' అనెడు ఆకాశము ఇట్టి యానక ముగా సిద్ధాంతీకరింపబడినది. అది కాంతిప్రసరణమునకు అనువగు యానకమని భావింపబడుచున్నది. ఒక నిర్దిష్టమైన తరచు దనము (frequency) లో నుండు డోలవములు (Osci- llation) గల కాంతికిరణములు ఈథరు అను యాన కములో పై తరచుదనపు తరంగములుగా జనించి సరళా వర్తగతి యందు ప్రయాణము చేయుచున్నవని ఊహించబడు చున్నది. ఈ ఊహించబడు ఆకాశయానకము యొక్క భౌతిక ధర్మములను కనుగొనుటకు చేయబడిన ప్రయత్నము లన్నియు నిష్ఫలమగుట కాని లేక సరస్పర విరుద్దములగు అసమగ్రమైన నిర్ణయములతో అంతమగుట గాని సంభ వించినది. తరువాత కొంతకాలమునకు కాంతి యొక్క తరంగవాదముచే వివరింపబడలేని నూతన దృగ్విషయ ములు కొన్ని బయల్పడినవి. వాటిలో ముఖ్య మైనది 'ఛాయా విద్యుత్ప్రభావము' (photo electric effect). శూన్యప్రదేశమందుంచబడిన ధాతువు యొక్క ఉపరి తలముపై కాంతికిరణములను పడునట్లు చేసిన, ఆ లోహపు ఉపరితలమునుండి విద్యుత్తు యొక్క ఋణశక్తి పూరక మూలాధారమగు ఋణ విద్యుదణువులు (electrons) బహిర్గతము చేయబడుచున్నవి. కాంతి యొక్క తరంగ వాదము ననుసరించి, ఆ ఋణ విద్యుదణువుల (ఎలె జ్ఞానుల) శక్తి, ఆ లోహపు ఉపరితలముపై పడు కాంతి పరిమాణమునకు సంబంధ సామ్యములో నుండక, పథన కాంతి నికిరణ (Incident light radiation) పు తరచు దనము యొక్క ప్రమేయము (function) గా నుండు నని కనుగొనబడినది. కాంతి యొక్క తరంగ వాదముచే సమన్వయము చేయబడలేని మఱియొక భౌతిక సిద్ధాంత దృగ్విషయము గలదు. అది నల్లని వస్తువుచే వికిరణము (radiate) చేయబడు శక్తి. ఒక నిర్ణీతమగు అధికోష్ణోగ్రత దగ్గర నల్లని వస్తువు ప్రసరింప జేయు శక్తి, తరంగ వాదము యొక్క సిద్ధాంతము ననుసరించి ఊహింపబడిన విధాన మునకు ఏమాత్రము సంబంధములేని సామ్యములలో వేరు వేరు రంగులందు విభజింపబడుచున్నది.