కాంతిస్వభావము అగుటవలన దృష్టి పంచేంద్రియములతో అతి ప్రాధాన్య మును వహించుచున్నది. కాంతి రెండు దృక్పథములను కలిగి యున్నది. మొద టిది పదార్థవిషయిక జ్ఞానము నిచ్చు దృష్టికిని, తద్వార మున బాహ్యముకాని మనస్సునకును సంబంధించినది. ఇది ఈ వ్యాసమునకు విషయము కాజాలదు. రెండవది స్థూలప్రపంచమునకు సంబంధించినది. కాంతి యొక్క పుట్టుక ఉత్పత్తి, ఆకాశముగుండా ప్రయాణము చేయు విధానము, పదార్ధములతోటి దాని యొక్క స్పర్శ మొద లగు విషయములు బాహ్యప్రపంచ దృక్పథమునకు సంబం ధించినవి. ఈ పై విషయములను సరిగా అవగాహన చేసి కొనుటయే కాంతిని, దాని స్వభావమును తెలిసికొనుట శక్తి నిత్యత్వ (conservation of energy) సూత్ర ములకు లోబడిన అన్ని శక్తులవలెనే, కాంతియును ఒక రకమగు శక్తి . పదార్థములయందు జరుగు శక్తి యొక్క మార్పులవలన కాంతి ఉత్పత్తి యగుచున్నది. అనేక విధ ములగు విద్యుదయస్కాంత కిరణ ప్రసరణములలో కాంతి ఒక రకమైనదని నవీనాభిప్రాయము. కాంతియొక్క ఈ విద్యుదయస్కాంత కిరణప్రసరణములు ఒక వైపున నిస్తంత్రీవార్తా ప్రేరణ ప్రసారమునందు ఉపయోగింప బడు విద్యు త్తరంగములనుండి, మరియొకవైపున రేడియో ఏక్టివ్ పదార్థములనుండి బహిర్గతములగు 'గామా' వికి రణముల వరకును గలవు. మానవునకు తెలిసినంతలో ఈ విద్యుదయస్కాంత వికిరణములే, ప్రకృతిలో ఎక్కువ విరివిగానున్న శక్తి. జంతు, వృక్ష సంబంధములగు ప్రాణు లకు సంబంధించినంతమట్టుకు వాటి యొక్క జీవనాధారపు టునికి యందును, వాటి పెరుగుదల యందును ఈ విద్యు దయస్కాంత వికిరణములు మిక్కిలి ప్రధానమగు పాత్రను వహించుచున్నవి. కాంతి సెకండునకు 1,86,000 మైళ్ళ వేగముతో ప్రస రించును. ఆకాళమునందు గరిష్ఠ వేగముతో ప్రయాణము చేయగలదు. కాంతి యొక్క మరియొక ముఖ్యలక్షణ మేమనగా దాని వేగము న్యూటను యొక్క సాపేక్షిక గతి సూత్రములతో ఎట్టి సంబంధమును లేక, ఇతర పదార్థ ఇతరపదార్థ ముల చలనములతో సంబంధములేని స్థిరమగు విలువను సంగ్రహ ఆంధ్ర 3. లిగియున్నది. ఐన్ స్టీనుచే కాంతి యొక్క వేగమును గూర్చి సిద్ధాంతీకరింపబడిన ఈ నూతన భావన పదార్థ ముల యొక్కయు, శక్తుల యొక్కయు, పదార్థముల శక్తులకును మధ్యగల పరస్పర సంబంధముల యొక్కయు విషయములను గూర్చి నూతన దృక్పథమును కలుగ చేసినది. ఐన్ స్టీన్ యొక్క ఈ సాపేక్ష సిద్ధాంతమును బట్టి కాంతి వేగము ఏ వస్తువు యొక్క వేగమునకైనను “రమావధి అయినది. "పరమార్థము యొక్కయు, శక్తి యొక్కయు నిత్యత్వమునకు సంబంధించిన సూత్రములు వేరువేరు" అను ఊ వదలబడి పదార్థమునకు శక్తికి సమత్వమును తెలిపెడి నూతన భావన స్థాపించబడినది. నిశ్చల స్థితియందుండు . అను పదార్థము M. C. కు సమానమగుగూఢ ( లేక సంభావ్య). శక్తి నికలిగి యుండును. (C కాంతి యొక్క వేగము,) ఇదియే అణుశక్తి యొక్క = ఉనికి (సంభావ్యత) కి నాందీ ప్రస్తావన అగుచున్నది. 622 2. కాంతి యొక్క ఉత్పత్తి : పదార్థమునందలి పర మాణువులలో గాని, అణువులలో గాని జరుగుచుండు శక్తి యొక్క మార్పులవలస కాంతి ఉత్పత్తి యగుచున్నది. ప్రతి పరమాణువునకుగాని, అణువునకుగాని కొన్ని స్థిర మైన శక్తి యొక్క దశలను కలిగియుండు సామర్థ్యము గలదు. ఉన్నత దశ నుండి హీనదశకు పరమాణువులు లేక అణువుల శ క్తి మార్పులను చెందునపుడు, ఆశక్తులయందలి తారతమ్యత, ఆ భేదము యొక్క విలువపై నాధారపడి యుండు ఏదో ఒక విధమగు శక్తి యొక్క కిరణ ప్రసర ణముగా బహిర్గతమగును. ఈ భేదము తగినంత విలువను కలిగియున్నపుడు, అదియే కాంతిరూపముతో బయల్ప డును. స్వాభావికస్థితిలో మండు సామాన్యమైన పదార్థము కిరణ ప్రసరణమును చేయలేదు. కాని తగినంత ఉష్ణము లేక విద్యుచ్ఛక్తి సహాయము వలన ఆ పదార్థము ప్రకోపింప చేయబడినపుడు, ఆ పదార్థమునందుండు శక్తి ఉన్నత దశకు చెందిన శక్తిగా ఉద్రేకపరచబడును. ఈ పదార్థ ఘటకములగు కొన్ని కణములు మరల వాటి స్వాభావిక స్థితికి వచ్చినపుడు అవి సాధారణముగా కాంతిని ప్రసరింపచేయును. ఉష్ణము లేక విద్యుచ్ఛక్తివంటి శక్తి జనక ముల ప్రభావము ఆ పదార్థములపై పడునంతకాలము, ఆ ద్రవ్యములు కాంతిని ప్రసరింపచేయుచునే యుండును.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/671
స్వరూపం