Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసియా

సంగ్రహ ఆంధ్ర


కానరావు. సూర్యుడు కొన్ని రోజులవరకు కానరాడు. ధ్రువము నొద్ద ఆరు నెలలు రాత్రి, ఆరు నెలలు పగలు ఉండును. కొన్ని రోజులవరకు సూర్యాస్తమయము కాదు. వర్ష పాతము 10", 12" ఉండును. ఈ మండలమున వృక్షజాలము కానరాదు. అక్కడక్కడ వూస్, విచెన్, ప్రొట్రికమ్ మొదలగునవి కనబడును. పక్షులు చేపలు ఇక్కడి సహజ సంపద. వేట, చేపలు పట్టుట ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తులు. ప్రజలు ధ్రువపు జింకలను పెంచుదురు. ఈ ప్రాంతమున ధ్రువపుజింక, ధ్రువపు నక్క, పొట్టేలు మొదలయినవి ఉండును. ధ్రువపుజింక మాంసము,పాలు, చేపలు ఇక్కడి ప్రజల ఆహారమునకు పనికివచ్చును,

పంటలు : వడ్లు, గోధుమలు, పొగాకు, సింకోనా, రబ్బరు, మల్బరీ, సోయాచిక్కుడు, ప్రత్తి, చెరకు, నూనె గింజలు, జొన్నలు, తేయాకు మొదలగు పెక్కు పంటలను పండించుటలో ఆసియా చాల ప్రసిద్ధిగాంచినది. ప్రపంచములో నూటికి 95 పాళ్ళ ధాన్యము ఆసియాలోనే పండును. రబ్బరు, తేయాకు, చెరకు పంటలలో ఆసియా ప్రథమ స్థానము గడించినది. ఆగ్నేయ ఆసియా ముఖ్యముగా పంటలకు చాల ప్రాముఖ్యము చెందినది. జపాన్, ఇండియా, తాయిలాండ్, కొరియా, బర్మా, ఫిలిప్పయిన్ దీవులు, మలయా దేశములలో అధిక సంఖ్యాక జనులు వ్యవసాయము ముఖ్య వృత్తిగా కలిగి ఉన్నారు. నైరృతి ఆసియాకు చెందిన ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాఖ్, సౌది అరేబియా, ఎమెన్ దేశములు వ్యవసాయము విషయమున మిక్కిలి ప్రసిద్ధి చెందినవి కావు. ఈ దేశములలో కాఫీ, ప్రత్తి, గోధుమలు, మొక్కజొన్న, ఖర్జూర ఫలములు పండును.

ఖనిజములు  : ఖనిజ సంపదలో ఆసియా ఖండము ఏ మాత్రము ఇతర ఖండములకు తీసిపోదు. ఇనుము, బొగ్గు, పెట్రోలియం, మాంగనీసు, అభ్రకము, సీసము, వెండి, కిరసనాయిల్, తగరము, రాగి, బంగారము మొదలయిన అనేక ఖనిజములు ఈ ఖండమందు లభ్యమగుచున్నవి.

రవాణా సౌకర్యములు  : పరిశ్రమలు, రవాణా సౌకర్యములు యూరప్, అమెరికా దేశములలో అభివృద్ధిచెంది. నట్లు ఆసియాలో అభివృద్ధి చెందలేదు. దీనికి ఆసియా నైసర్గికస్థితి, పరిమాణము, శీతోష్ణస్థితి ముఖ్యకారణములు. ధ్రువ ప్రాంతములు చాల వెనుకబడియున్నవి. ఆగ్నేయ ఆసియా చాల సారవంతమైన దగుటవలన అందు రవాణా సౌకర్యములు తక్కిన ప్రాంతములందు కంటే ఎక్కువగానే ఉన్నవి. నైరృతి ఆసియాలో, సరకులను, మనుష్యులను, మోయుటకు ఒంటెలను ఉపయోగించెదరు. గాడిదలు, గొట్టెలు, బజ్జెలు, హిమాలయ పర్వతములను దాటుటకు ఉపయోగపడుచున్నవి. కంచర గాడిదలను, గుఱ్ఱములను, ధ్రువపు జింకలను, క్కుక్కలను, ధ్రువపు కుక్కలను "స్లేస్ (Sledges)" అను ఒకరకపు మోటు బండ్లకు కట్టుదురు. యాంగ్ సికియాంగు, సికియాంగ్ అమూరు, గంగ, మున్నగు మహానదులు రహదారులుగా ఉపయోగపడుచున్నవి. వీటిగుండ పెద్ద స్టీమర్లుకూడా లోపలికి రాగలవు.

మొదటి సంగ్రామము తరువాత రైలు మార్గములు విరివిగా అభివృద్ధి చెందినవి. ట్రాన్సు సైబీరియన్ రైలు మార్గము పొడవు 5400 మైళ్ళు. మోటార్లు, లారీలు, వాడుకలోనికి రాగానే ఆసియాలో రోడ్ల అభివృద్ధికూడ ఎక్కువైనది. ఆసియా నుండి అన్ని దేశములకు విమాన సౌకర్యములు కలవు.

రేవు పట్టణములు : ఆసియాలో కరాచీ, బొంబాయి, కొచ్చిన్, మద్రాసు, కలకత్తా, రంగూన్, సింగపూర్, హాంకాంగు, కేంటన్ మొదలగునవి ముఖ్యమయిన రేవు పట్టణములు. ఈ రేవు పట్టణములనుండి ముఖ్యముగా ఆహారధాన్యములు, ప్రత్తి, నూనెగింజలు, జనపనార, తేయాకు, కాఫీ, ఉన్ని, తోళ్ళు, రబ్బరు, కొబ్బరి, నల్ల మందు, బొగ్గు, ఇనుము, మాంగనీసు, తగరము మొదలయినవి ఎగుమతి అగును. యంత్ర సామగ్రి, నూలు, ఉన్ని గుడ్డలు, పంచదార, మోటారులు, యంత్రములు మొదలయినవి దిగుమతి అగును.

ప్రజలు - వృత్తులు  : ఆసియా ఖండమునందు ప్రపంచమునందలి మొత్తము జనాభాలో సగముకంటే ఎక్కువ కలదు. ఈ జనాభా అంతయు, ఆసియాయందు అంతటను ఒకేరీతిగా వ్యాపించి యుండలేదు. ముఖ్యముగా చైనా, హిందూదేశములు ఎక్కువ జనాభాను కలిగి యున్నవి. చైనా జనాభా 47 కోట్లు, ఇండియా జనాభా 36 కోట్లు. సగటున ఒక చదరపు మైలునకు 70 మంది