కాంతివేగము
సంగ్రహ ఆంధ్ర
ములను సరిగా పోలియున్నది. అట్టి అధిక వేగములను కొలుచుటలో కచ్చితమగు కాలపరిమితులను సులభముగా పరిశీలించుటకు వీలుగా, కొలువబడెడు దూరమైనను ఎక్కువగా నుండవలెను; లేక చాల తక్కువయగు కాల పరిమితులను కొలుచుటకు వీలుగానుండు విధానమైనను కని పెట్టబడవలెను. వీటిలో మొదటి వికల్పమునకు అనువగు పరిస్థితులు ఖగోళశాస్త్రమునకు సంబంధించిన దూరములలో లభ్యమగును. ఈ విధానము ననుసరించి డెన్మార్కు దేశీయుడగు రోమర్' అను వానిచే మొట్టమొదట 1676 లో కాంతియొక్క వేగము నిర్ణయింపబడెను.
రోమరు ప్రయోగము : క్రీ.శ. 1676వ సంవత్సరమున డెన్మార్కు దేశీయుడగు 'రోమరు' ఖగోళ దూరములను ప్రయోగించి కాంతివేగమును కనుగొనెను. బృహస్పతి గ్రహమునకు చెందిన ఒక ఉపగ్రహము యొక్క (దేని కక్ష్యాతలము బృహస్పతి యొక్క కక్ష్యాతలముతో ఏకీభవించునో) వరుసగావచ్చు గ్రహణముల మధ్యనుండు కాలమును రోమరు పరీక్షించెను. భూమి బృహస్పతిని సమీపించునపుడు ఈ గ్రహణముల మధ్యగత కాలవ్యవధులు తగ్గుటయు, భూమి బృహస్పతికి దూరముగ పోవునపుడు ఈ గ్రహణముల మధ్యగత వ్యవధులు హెచ్చుటయు కనుగొనబడెను. కాంతి ఆకాశములో వయనము చేయుట తగు కాల భేదమే దీనికి కారణమని చెప్పబడెను. ఈ తారతమ్యమును కనుగొని, భూభ్రనుణ కక్ష్యావ్యాసమును
పయనించుటకు కాంతికి పట్టు కాలమును గుణించి, కాంతి వేగమును రోమరు నిర్ణయించెను.
ఫిజూ ప్రయోగము : ఫ్రాన్సు దేశస్థుడైన ఫిజూ క్రీ.శ. 1849 వ సంవత్సరములో ప్రయోగశాలా పద్ధతిద్వారా కాంతి వేగమును కనుగొనేను. ఈ పద్ధతిలో సూక్ష్మ కాల పరిమితులను సరిగా కొలుచు పరికరముగా ఒకే వేగముతో తిరిగెడి పళ్ళచక్రము ఉపయోగింపబడెను. S వద్దనుండి బయలుదేరు కాంతి పళ్ళచక్రములోని F నుండి ఒక దూరప్రదేశమునకు పోయి తిరిగివచ్చుసరికి చక్రపు ప్రక్కపంటిచేత అడ్డగింపబడునటుల చక్రము తిరిగెడి వేగము సరిపెట్టబడెను. చక్ర వేగము, చక్రమునందలి పళ్ళ సంఖ్య, కాంతిపోయివచ్చెడి దూరము—— ఇది తెలియుటచే కాంతి వేగము కనుగొనబడెను.
పూకాల్టు ప్రయోగము : ఫ్రాన్సు దేశీయుడైన పూకాల్టు క్రీ.శ. 1850 వ సంవత్సరమున తిరిగెడి దర్పణము యొక్క సహాయముతో సూక్ష్మకాలపరిమితులను సరిగా నిర్ణయింప కలిగెను.
S వద్దనుండి బయలుదేరు కాంతి, తిరిగెడి దర్పణము R వద్ద పరావర్తనము చెంది, ఫుటాకార దర్పణము M మీద కేంద్రీకరింపబడును. అచ్చట మరల పరావర్తనము చెంది కాంతి వెనుకకు మరలి R స్థిరముగ ఉన్నచో I ఒద్దను, R. తిరుగుచున్న యెడల ఒద్దను సంకేంద్రీకరింపబడును, II1 దూరమును, R తిరిగిన కోణమును కొలచి, వాటిని