Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - . వలన బహిర్గతము చేయబడు కాంతి రేఖాసముదాయము ఉపస్థితములైన ఉదజని అణువులలో జరుగు ఈ చర్యలను సంగ్రహించును. ఇదిగాక, స్థిరముగా నుండేడి గ్రహము లను, విద్యుత్ స్వభావముగల కర్తులను, వాటికి సంబం ధించిన ఇతర అంశములను ప్రయోగించి బోహర్ శాస్త్రజ్ఞుడు సాధింపగలిగిన వివరణమంతటికిని విద్యుచ్ఛక్తు కాంతివేగము కనుగొనబడినది. కదలుచుండు యానకములో కాంతి u అను సూత్రముచే వేగము యొక్క మార్పు (1 – 1) ట కనుగొనబడును. (F పదార్థము యొక్క వక్రీభవన గుణ కము ; U= పదార్థ వేగము) గాజు, నీరు మొదలగు పదార్థ ములలో కాంతి అన్నిదిక్కులకు ఒకేవేగముతో పోవును. అని పేరు 'పెట్టెను. ఈ విధముగా ఉదజని యొక్క విచ్ఛిన్న స్ఫటికాకృతి గల క్వార్ట్జ్, అభ్రకము మొదలగువాటిలో కిరణము (Spectrum) అణువులో గర్భితమైయున్న విద్యుత్కణ సంబంధమైన శక్తుల యొక్క ఫలితముగా వివరింపబడినది. పదార్థ నిర్మాణమును పరిశీలించుటకు విచ్ఛిన్నకిరణదర్శని ప్రయోజనకారి అయ్యెను. కాంతివేగము : పి. జి. పు ప్రకృతియందు భౌతికముగా ముఖ్యమైన స్థిరమగు విలువలను కలిగియున్న వాటిలో కాంతి వేగము ఒకటి. కాంతి వేగమును నిర్ణయించుటకై పెక్కు సంవత్సరములు పరిశోధనలు సాగింపబడెను. ప్రస్తుతము పరిశోధకులచే అంగీకరింపబడిన దీని విలువ సెకనునకు 2,98,790 కిలో మీటర్లు లేక 1,88,000 మైళ్ళు. కాంతి వేగము దాని యొక్క రంగును బట్టియు ఉత్పత్తిస్థానమును బట్టియు ఉండదు, కాంతిలోని అన్ని వర్ణములు శూన్యప్రదేశమందు ఒకే వేగముతో పోవును. అన్ని విధములగు పదార్థ యానకములలోను కాంతిలోని వివిధములయిన రంగులు వివిధ వేగములతో పోవును. సప్తవర్ణములలో ఊదా వర్ణపు కాంతి కనిష్ఠ వేగముతోను, ఎఱుపు వర్ణపు కాంతి గరిష్ఠ వేగముతోను, మధ్యవర్ణముల కాంతులు మధ్యతరగతి వేగములతోను పోవును. శూన్యప్రదేశములోకంటే ఏదైన పదార్థయానకములో కాంతి వేగము తక్కువగానుండును. ఆ రెండు వేగముల నిష్పత్తి ఆ పదార్థపు వక్రీభవన గుణక మునకు సమానము. ప్రస్తుతమునకు శూన్య ప్రదేశమునందు కాంతి వేగము సెకనుకు 299,790 కిలోమీటర్లు. అనగా అది సుమారు సెకనునకు 1,86,000 మైళ్లని ఆమో దింప బడినది. ఇంతకుమించిన వేగముతో పోవు పదార్థము గాని, శక్తిగాని వేరొకటి లేదు. ఏదైన పదార్థ యానక ములో కాంతి వేగము ఆ పదార్థపు గమనమును, పదార్థ వక్రీభవన గుణకమును బట్టి స్వల్పముగా మారుచుండునని 619 కాంతి వేగము దిక్కు నుబట్టి మారుచుండును. విద్యు దయస్కాంత తరంగములగు రేడియో తరంగముల వేగము, కాంతి వేగము ఒకటియే. ప్రయోగాత్మకముగ కాంతి వేగమును కనుగొనుటకు కాంతి నియమితదూరము పోవుటకు పట్టు కాలమును కనుగొనవలసి యుండును. కాలదూరముల సరియైన కొలతపై ప్రయోగశుద్ధత (accuracy) ఆధారపడి యుండును. కాంతి వేగము అత్యధికమగుటచే నిర్ణీత దూరము అధికముగ నుండుటయో లేక సూక్ష్మ పరిమితిని సరిగ తెలుపు పరికరములుండుటయో అవ సరము. కాల ప్రప్రథమముగా కాంతి వేగమును నిర్ణయించుటకై ప్రయత్నించినవాడు ఇటలీ దేశస్థుడగు గెలిలియో. అతని ప్రయోగమందు ఇద్దరు పరిశీలకులు చెరియొక దీపమును పట్టుకొని కొంతదూరము ఎడముగా నిలుచుందురు. మొదటి పరిశీలకుడు తన దీపమును తెరచినవెంటనే ఆ వెలుగును చూచి రెండవ పరిశీలకుడు సాధ్యమైనంత త్వరగా తన దీపమును తెరచును. ఈ ప్రయోగములో మొదటి పరిశీలకుడు తన దీపమును తెరచినది మొదలు కొని రెండవవాని దీపపు కాంతిని చూచువరకు పట్టు కాలము, కాంతి మొదటివానినుండి రెండవవానివరకు పోయి తిరిగి మొదటివానిదగ్గరకు వచ్చుటకు పట్టు కాల మునకు సమానమని తలచవలెను. కాని కాంతికి గల అపరిమిత వేగమునుబట్టి పరిశీలకులు దీపమును తెరచుటకు గాని, చూచుటకుగాని పట్టు కాలముకంటే, కాంతి వారి మధ్యనున్న దూరమును ప్రయాణము చేయుటకు పట్టు కాలము చాల తక్కువగుటచే ఈ పద్దతి విఫలమాయెను. అయినప్పటికిని దీనియందు అనుసరింపబడిన ప్రయోగ విధానము క్రింద వర్ణింపబడిన సూక్ష్మపద్దతులలోని విధాన