విజ్ఞానకోశము - పదమునకు శాస్త్రీయముయిన వివరణము లభ్యము కాకుండెను. క్రీ. శ. 1672 వ సంవత్సరములో సర్ ఇజాక్ న్యూటన్ అను విఖ్యాత శాస్త్రవేత్త, దూరదర్శని యొక్క అద్దపుబిళ్ళలవలన ఉత్పన్నమగు వర్ణపుటంచులను (colour- ed fringes) త్రోసివేయ (eliminate) ప్రయత్నించు చుండెను. ఆ సందర్భములో, ఈ దోషమునకు కాంతి యొక్క నైజగుణమే కారణమై యుండవచ్చునని ఆతడు నిశ్చయించేను. ఈ నిశ్చయమును పురస్కరించుకొని, కాంతి, రకరకములయిన రంగులను ఉత్పాదనము చేయు రీతులను, గాజుపట్టకముల (Glass prisms) ను విశ్లేష సాధనములుగా గొని పరిశీలింప ప్రారంభించెను. తెల్లని కాంతి కాంతి విశ్లేషణశాస్త్రము వనియు, ప్రతిరంగును గాజు పట్టక ముగుండా చొచ్చుకొని పోవునపుడు భిన్న ప్రమాణముగా వంగియుండుననియు అతడు నిశ్చయించెను. అట్టి రంగుల సముదాయమున కే పచ్ఛిన్నకిరణము (Spectrum) అని పేరు. కాంతివికిరణము (Dispersion of Light) : కాంతి, అండలి రంగులలోనికి విడదీయబడుట వికిరణమనబడు చున్నది. కాంతి గాజు పట్టక ముగుండా చొచ్చి వక్రీభవిం చుటచే ఇది సిద్ధించుచున్నది. వర్ణసహితమైన కాంతి రేఖ (beam of coloured light) గాజు పట్టక ముగుండా చొచ్చుకొని పోవునపుడు, తరం: దైర్ఘ్యము (wave length ) ను బట్టి, దానిమార్గము మారును. ఎఱ్ఱని కాంతి కిరణము యొక్ష మార్గము తెర కనిష్ఠము గాను, ఊదా రంగు కాంతి రేఖ యొక్క మార్గము గరిష్ఠముగాను ఎరుపు వక్రీభవనము చెందును. నారింజ గాజు పట్టకము పసుపు, నిర్ణీతమయిన కోణమువద్ద ఆకుప చ కాంతికిరణము గాజుపట్టక శ్యామవర్ణము మును డీకొన్నప్పుడు, ప్రతి పటము 1. కాంతివికిరణము : తన పరిశీలనమువలన, అంధ కార మయమైన ఒక గదిలోనికి ఒక తెల్లని కాంతికిరణము ప్రవేశ పెట్టబడి ఒక గాజుపట్టక ముగుండా చొచ్చుకొని పోవునట్లు చేయబడినచో అది కచ్చితముగా ఇంద్రధనుస్సు నందలి రంగులవంటి రంగుల యొక్క సముదాయమును ఉత్పన్నము చేయునని న్యూటన్ నిరూపించెను. ఇట్లు ఉత్పన్నమయిన రంగుల కిరణములలో, ఒక్కొక్క దానిని ఇతర గాజుపట్టక ములగుండా చొచ్చుకొనిపోనిచ్చి, వాటిలో ఎట్టి మార్పును సంభవింపకుండుట గమనించెను. కాని మొదటి గాజుపట్టక ముకంటె భిన్నముగా, తలక్రిందులు చేయబడిన మరియొక పట్టక ముగుండా కిరణముల సము దాయమును పోనిచ్చినప్పుడు, బయటికి వచ్చిన కిరణము మరల తెల్లని సూర్యకిరణముగనే కనిపించెను. దీనినిబట్టి తెల్లని కాంతిలో ఏడురంగులు సమ్మిళితములై యున్న 615 వర్ణ కిరణము యొక్క వక్రీ భ వనము ఎల్లప్పుడును సమానముగానే ఉండును. అందుచేత ప్రతి వర్ణకిరణము, తెరపైన కచ్చితముగా ఒకే స్థలముమీద పడును. కాబట్టి దానిని గుర్తించుటకు అది పడు స్థానమే చాలియుండును. విచ్ఛిన్న కిరణదర్శని (Spectroscope); విచ్ఛిన్న కిరణాలేఖ్యము (Spectrograph) : విచ్ఛిన్న కిరణమును ఉత్పాదనము చేయు పరికరము విచ్ఛిన్న కిరణదర్శని అనబడును. సామాన్యమైన విచ్ఛిన్న కిరణదర్శనీయందు కాంతిని లోనికి ప్రవేశ పెట్టుగొట్టమును, సమాంతరిత్ర (collimator) యు, ఒక గాజుపట్టక మును, ఒక దూర దర్శని యంత్రమును ఉండును. కాలిమేటర్ అను ఈ గొట్టమునకు ఒక తుదయందు కాంతిని ప్రవేశ పెట్టుటకు ఒక బీట (slit) యు, మరి యొక చివరయందు కాంతి సమాంతరితమయి కేంద్రీకరించుటకు అనువగు ఒక కటకము (lens) ను ఏర్పరుపబడియుండును.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/664
స్వరూపం