కాంతి తరంగ వాదము
సంగ్రహ ఆంధ్ర
తగ్గించబడును. ఇటీవల ఇట్టి కటకముల నిర్మాణములో చాలా అభివృద్ధి జరిగినది.
టి. శే.
కాంతి - తరంగవాదము :
17 వ శతాబ్ది నడిమికాలమువరకు కాంతి యనునది అటుధారా నిర్మితమని (Stream of corpuscles) సర్వ సాధారణముగా విశ్వసించబడెను. ఈ అణువులు కాంతి మూలమునుండి ప్రసారితములై అచ్చటినుండి సరళ రేఖలలో బయటికి ప్రయాణించెను. ఈ అణువులు పారదర్శక (Transparent) పదార్థములగుండా చొచ్చుకొని, అపార దర్శక (Opaque) పదార్థముల ఉపరితలములనుండి ప్రతి బింబించును. ఈ అణువులు కంటిలో ప్రవేశించి చక్షురింద్రియమును (Sense of Sight) ఉత్తేజిత మొనర్చును. ఈ సిద్ధాంతమునకు 'కాంతి అణుసిద్ధాంతమని (Corpuscular Theory) పేరు. ఇది ఇజాక్ న్యూటన్ చే ప్రతిపాదింపబడెను. ఇది ఋజు రేఖావిశిష్ట కాంతి ప్రసరణము (Rectilinear propagation), కాంతి పరావర్తనము (Reflection), కాంతివక్రీభవనము (Refraction of Light) వంటి దృగ్విషయములను (Phenomena) తృప్తికరముగా సమాధానించెను. సాంద్రతర యానముల గుండా కంటే, అల్పతరయానములగుండా (rarer Media) కాంతి ఎక్కువ నిదానముగ ప్రయాణము చేయును అని చెప్పు ప్రయోగఫలితములకును, న్యూటన్ సిద్ధాంతమునకును విరోధము ఘటిల్లినది. ఈ కారణముచే ఈ సిద్ధాంతము స్థాపనీయము (untenable) కాలేదు. 'కాంతి యొక్క జోక్యము' (interference of light), 'కాంతినమనము' (Diffraction of Light) 'కాంతిధ్రువకరణము' (Polarisation of Light) వంటి ముఖ్య విషయములను ఈసిద్ధాంతము వివరింప లేకపోవుట వలవగూడా ఇది అప్రతిపాదనీయ మయ్యెను.
17 వ శతాబ్ది మధ్యకాలమున, కాంతియనునది ఒక విధమయిన తరంగచలనము (Wave Motion) అను భావము వృద్ధిచెంద నారంభించెను. ఒక యానము (medium) ద్వారా క్షోభముయొక్క ఉత్పత్తిస్థానము (Source of disturbance) నందలి కంపనగతికి చెందిన శక్తి యొక్క ప్రేషణమునకు ఒసగబడిన వేరే తరంగ చలనమనునది. క్రిస్టియన్ హైజెన్స్ అనునతడు 1678 సం. లో ప్రప్రథమముగా ఒక కాంతి తరంగ సిద్ధాంతమును ఉపపాదించెను. ఈ సిద్ధాంతము ప్రకారము, ఆకాశము (Space) అంతటను వ్యాపించియున్న 'ఈధర్ '(Ether) అనబడు ఉష్యన్తయానము (Hypothetical Medium) నందలి డోభమునకు (disturbance) మూలము స్వయం ప్రకాశకమగు పదార్థము అని తెలియుచున్నది. ఈ క్షొభముః తరంగముల రూపములో ఆకాశమంటను ప్రవృతిరుగును. కాంతి యొక్క శక్తి యంతయు అన్ని దిక్కలకు ఏకరీతిగా వ్యాపించును. ఈ తరంగములు కంటిమీద పడినప్పుడు నేత్రనాడి ( Optic Nerve) రేపబడి చక్షు రింద్రియ మేర్పడును (Sense of Vision). ఈ తరంగములు వాటితో శక్తిని కొనిపోవును. హైజెంస్ సిద్ధాంతమునుబట్టి, ఘన ద్రవపదార్థములయందు సంభవించు కంపనములవలె ఉపన్యస్తయానమునందలి (Hypothetical Medium) కంపనములు గూడ యాంత్రిక స్వభావము గలవి. ఇట్లు 'ఈధర్ ' అను పదార్థమందు స్థితిస్థాపకతరంగములను (Elastic Waves) ప్రేరణము' చేయు ధర్మము (property) కలదు. వీటినే మనము కాంతిగా దర్శించుచున్నాము. ఈ తరంగములను హైజెన్స్ అను దైర్ఘ్య తరంగముల (Longitudinal)ని భావించెను. అనగా, ఈ తరంగములు ధ్వని తరంగములవలె నుండునని అర్థము. ధ్వని తరంగములలోని కంపనములు, వాటి ప్రసారమార్గమునకు సమానాంతరము (parallel) గానుండును.
తరంగచలనము, యానములో (medium) ప్రసారము నొందు విధానమును గూర్చిన భావన హైజెన్స్ డే. అందుచే దీనికి 'హై జెన్స్ సూత్ర ము” (principle), అను పేరుకలిగెను. పటములో చూపబడినట్లు 'W.F” ఆకాశము (Space) నందలి తరంగములలోని ఒక భాగముగను