విజ్ఞానకోశము . మిధ్యా ప్రతిబింబము GH పెద్దసైజులో ఏర్పడును. ఇది KJ వద్దనున్న కంటిచే చూడబడును. 9 వ పటములో చూపబడినట్లు గెలిలియో దూర 8 వ దర్శనితో అక్షికటకము CN ద్విపుటాకార కటక మై యున్నది. దూరముగా నున్న వస్తువు యొక్క బ్రతిబింబము EM తలక్రిందులుగా ఏర్పడును. EM నుండి వచ్చు కాంతికిరణములు ద్విపుటా కారకటకము వద్ద వక్రీభవించు టచే మిధ్యా ప్రతిబింబము GH నిటారు (erect) ఏర్పడును. కలవు. పటము 1. A ఈ రెండు దూరదర్శసులకు రెండు ముఖ్యభేదములు ఒకటి భూదూరదర్శనితో - ప్రతిబింబములు నిటా రుగా కనిపించును. అందుచే భూమిపై నున్న వస్తువు లను తలక్రిందులుగా కాకుండా చూచుటకు అది ఎంతో ఉపయోగకరము. రెండవది సమాన అధికీకరణమునిచ్చు భూదూరదర్శని పొడవు ఖగోళ దూరదర్శని పొడవు కంటే తక్కువ. ఛాయాగ్రహణయంత్రము (Photographic camera): ఛాయాగ్రహణ యంత్రములో ముఖ్యముగా ఒక దీర్ఘ చతురస్రాకారపు పెట్టె ఉండును. ఈ పెట్టెకు ఒక వై పున ఛాయాగ్రహణపు ప్లేటు (plate) గాని, ఫిల్ము గాని ఉండును. రెండవవైపు మధ్యగా వస్తుకటకము అమర్ప బడియుండును. ప్లేటునుండి కటకమునకుగల దూరమును మార్చి ప్లేటుపై వస్తువు ప్రతిబింబము స్పష్టముగా ఏర్పడు నట్లు చేయవచ్చును. కాంతి కెమెరాలోనికి కటక ముగుండా మాత్రమే పోవలెను. కటకముద్వారా పోవు కాంతిని తగ్గించి, హెచ్చించుటకు వీలగునట్లు కటకము యొక్క కటకముయొక్క ద్వారము (aperture)ను మార్చవచ్చును. ఛాయాగ్రహణ కటకములలో, ఏస్టిగ్ మేటిజము (astigmatism), ప్రతిబింబపు వక్రత, (curvature of the image), వికారము (distortion) మొదలగు 611 కాంతి - జ్యామితికాంతిశాస్త్రము లోపములు ఎంతమాత్రమును ఉండుటకు వీలు లేదు. అందుచే ఈ లోపములను సాధ్యమైనంతవరకు తగ్గించు ప్రయత్నములో వివిధ రకములైన ఛాయాగ్రహణ కట కములు తయారు చేయబడినవి. ఏనిలో రెండు ముఖ్య రకములు కలవు. మొదటిది పెట్టి వల్ చిత్తరుపు కటకము (Petzval portrait lens); రెండవది ఘ్రసరళ రేఖాత్మక కటకము (Rapid rectilinear lens). ఈ రెండును 10, 11 పటములలో చూపబడినవి. మొదటి రకపు కటకములో వికారము (Distortion) తప్ప తక్కిన లోపములన్నియు నిర్మూలింపబడినవి. అందుచే ఈ రకపు కటకములు ఇప్పుడు కూడా సాధారణముగా చిత్తరువు కాలల (Portrait Studios) లో ఉపయోగింపబడు చున్నవి. శీఘ్రసరళ రేఖాత్మక కటకము రెండు నిర్వర్ణ పటము 10. 1 T 3 పటము 11. కటక ద్వంద్వము (achromatic doublet) లచే నిర్మింప బడును. ఒక్కొక్క నిర్వర్ణ కటక ద్వంద్వములో క్రౌను గాజుతో చేయబడిన కుంభాకార మెనిస్కన్ (Convex crown meniscus) ఫ్లింట్ గాజుతో చేయబడిన పుటాకార మెనిస్కస్ (Concave flint meniscus) ఉండుమ. రెండు నిర్వర్ణకటక ద్వంద్వముల మధ్య కాంతినిరోధకము (stop) ఉండును. రెండు నిర్వర్ణకటక ద్వంద్వములు ఒకే మాదిరిగా నుండుటచే ఈ కటకము సౌష్ఠవమును కలిగి యున్నది. ఈ కటకములో కోమా (coma), వికారము (distortion) మొదలగు లోపములు చాలావరకు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/660
స్వరూపం