కాంతి - జ్యామితికాంతిశాస్త్రము
సంగ్రహ ఆంధ్ర
లలొ కలుగును. ఇవికాక పతనకాంతి ఒకే రంగు కలది కానిచో వస్తువులో లేని కొన్ని రంగులు ప్రతిబింబములో కూడ కన్పించును. ఈ లోపమును వర్ణవిపధనము అని అందురు. దీనికి కారణము, కాంతికిరణపు వక్రీభవనము దాని రంగును బట్టి మారుచుండుటయే పైన చెప్పిన వివిధ లోపములు సవీన దృగ్యంత్రములలో సవరింపబడినవి.
దృగ్యంత్రములు (Optical Instruments); సూక్ష్మ దర్శిని (Microscope) : కంటికి అస్పష్టముగా కన్పించు నట్టి వస్తువుల వివరములు బాగుగా కన్పించునట్లు, పెద్ద సైజులో వస్తువుల ప్రతిబింబములను ఏర్పరచు దృగ్యంత్రమును “సూక్ష్మదర్శని' అని అందురు.
సూక్ష్మదర్శనులలో రెండురకములు కలవు. మొదటిది సరళ సూక్ష్మదర్శని (Simple microscope). రెండవది మిశ్ర సూక్ష్మదర్శని (Compound microscope). వీటిలో మొదటిరకము తక్కువ అధికీకరణము (magnification) కావలసినపుడును, రెండవరకము చాలా ఎక్కువ అధికికరణము కావలసినపుడును ఉపయోగింపబడును. సరళ సూక్ష్మదర్శనిలో ఒకేఒక కుంభాకార కటకము సహాయమున వస్తువుల ప్రతిబింబములు పెద్దవిగా కనిపించును. 6 వ పటములో A B అను కుంభాకార కటకము (తక్కువ నాభ్యంతరము కలది) చూపబడినది. F దాని సంగమ బిందువు. P p అను వస్తువు దాని నాభ్యంతరములోపల నుంచబడినది. వస్తువునుండి బయలుదేరు కాంతికిరణములు కటకమువద్ద వక్రీభవించుటచే, వస్తువుకంటే పెద్దదైన ప్రతిబింబము Q q వద్ద ఏర్పడినది.
ఎక్కువ అధికీకరణము కావలసినప్పుడు మిశ్రసూక్ష్మ దర్శనిని ఉపయోగింపవలసి యున్నది. ఇది పనిచేయు విధానము 7 వ పటమునుండి తెలిసికొనవచ్చును. మిశ్ర సూక్ష్మదర్శనిలో రెండు కటకములు లేక కటకముల సంపుటి (System of lenses) సహాయమున వస్తువు కంటె ఎన్నో రెట్లు పెద్దదైన ప్రతిబింబము ఏర్పడును.
7 వ పటములో P అనునది వస్తువు. వస్తువునకు సమీపములో నున్న కటకము A, వస్తుకటకము (object glass) అనియు, కంటికి సమీపములో నున్న కటక ము B అక్షికటకము (eye-piece) అనియు పిలువబడును. వస్తువు P యొక్క ప్రతిబింబము S వస్తుకటకము A వలన ఏర్పడినది. S యొక్క ప్రతిబింబము Q అక్షికటకము B వలన ఏర్పడినది. ప్రతిబింబము Q మిధ్యా ప్రతిబింబము, వస్తువు P కంటే ఎన్నో రెట్లు పెద్దది.
దూరదర్శని (Telescope) : దూరముగా నున్న వస్తువు యొక్క ప్రతిబింబమును పెద్దదిగా కనపడునట్లు చేయు దృగ్యంత్రము దూరదర్శని అని పిలువబడు చున్నది. దూరదర్శనులలో అనేక రకములు ఉన్నవి. వీటిలో ఖగోళ దూరదర్శని (Astronomical Telescope), గెలిలియో (Galileo) చే నిర్మింపబడిన భూదూరదర్శని (Terrestrial Telescope) అనునవి ముఖ్యమైనవి. ఇవి పనిచేయు విధానము 8, 9 పటములవలన సుస్పష్టమగును. 8 వ పటములో A B వస్తుకటకము, CN అక్షికటకము. కటకము A B దాని సంగమతలము (Focal plane) లో నున్న వస్తువు యొక్క ప్రతిబింబము EM ను ఏర్పరచును. ఇది వాస్తవిక ప్రతిబింబము; తలక్రిందులుగా నుండును. ఇది అక్షికటకము C N యొక్క నాభ్యంతరములోపల ఏర్పడుటచే, దీని