Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/657

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాంతి - జ్యామితీకాంతిశాస్త్రము

సంగ్రహ ఆంధ్ర


ద్వికుంభాకార కటకమును అభిసరణ కటకము (convergent lens) లేక ధనకటకము (Positive lens) అనియు అందురు. ఇదేపరిస్థితులలో ద్విపుటాకార కటకమును ఉపయోగించిన, కాంతికిరణములు అవసరించును (Diverge). అందుచే ఈ కటకమును అపసారికకటకము (Divergent lens) లేక ఋణకటకము (Negative lens) అని అందురు.

ఒక దృగ్యంత్రములోని కటకముల యొక్క ఉపరితలముల కేంద్రములన్నియు ఒకే సరళరేఖపై ఉండునట్లు కటకములు అమర్చబడి యుండును. ఈ సరళ రేఖ సౌష్ఠివముతో కూడిన అక్షము (axis of symmetry). దృగ్యంత్రము దానిచుట్టునున్న ప్రాంతమును రెండు భాగములుగా విభజించునని చెప్పవచ్చును. అని వస్తువు అవకాశము (object space), ప్రతిబింబపు అవకాశము (image space). కాంతిమంతమైన వస్తువునుండి బయల్వెడలి దృశ్యంత్రమును ప్రవేశించు కాంతికిరణములు వస్తు కాంతికిరణములనియు (object rays), దృగ్యంత్రము నుండి బయటికివచ్చు కాంతికిరణములు ప్రతిబింబపు కాంతికిరణములనియు (image rays) పిలువబడును. వస్తువు యొక్క అవకాశములో నుండు ప్రతి బిందువునకును సంబంధించిన ప్రతిబింబము ప్రతిబింబపు అవకాశములో ఏదో ఒక నిర్దుష్టమైన బిందువువద్ద ఏర్పడును. వస్తువునకును, దాని ప్రతిబింబమునకును గల సంబంధము నిర్దుష్టమైనది (unique), పరివర్తనీయమైనది (reversible). దృగ్యంత్రమునుండి బయటికివచ్చు ప్రతిబింబపు కిరణములు నిజముగా ఒక బిందువువద్ద కలియుచున్నట్లయిన అది వాస్తవిక ప్రతిబింబము (real image) అని పిలువబడును. అట్లుకాక ప్రతిబింబపు కిరణములు ఆ బిందువునుండి అపస రించుచున్నట్లయిన (Diverge) అది మిధ్యా ప్రతిబింబము (virtual image) అనబడును.

గొస్ యొక్క సిద్ధాంతము (gauss theory), కార్డినల్ బిందువులు (cardinal points) కటకముల సంపుటిచే నిర్మింపబడిన దృగ్యంత్రములో ప్రతిబింబము ఏర్పడు విధానమును సి. యఫ్. గౌస్ (C. F. Gauss) అను శాస్త్రజ్ఞుడు 1841 వ సంవత్సరములో ప్రచురించెను. ప్రతిబింబము యొక్క స్థానము, కటకములకు సంబంధించిన కొన్ని ముఖ్యజించువుల (cardinal points) స్థానముపై ఆధారపడి యుండును. ఈ బిందువులలో ప్రధానబిందువులు ( Principal points) H, H1, సంగమ బిందువులు F, F1, అనునవి ఎక్కువ ఉపయోగకరమైనవి. అందుచే వీటిని గురించి తెలిసికొనవలసిన అవసరము ఉన్నది. 4వ పటములో A B, A1 B1 అను రెండు సముచ్చిత సమతలములు (Conjugate planes) అక్షమునకు లంబముగా చూపబడినవి. ఈ సమతలముల విశిష్టలక్షణమేమన- ఈ రెంటి సమతలములలో వస్తువు, దాని ప్రతిబింబము, తాదాత్మ్యముగా నుండును. అనగా వస్తువు, ప్రతిబింబములు పరిమాణములు ఒకటిగానే ఉండును. అందుచే ఈ సమతలములలో దృగ్యంత్రముయొక్క పార్శ్వపు అధికీకరణ (Lateral magnitication) ఒకటికి (unity) సమానమై యుండును. అట్టి సమతలములు ప్రధాన సమతలములనియు (Principal planes), ఈ సమస్థలములు అక్షమును ఖండించు బిందువులు H, Hశీర్షాక్షర పాఠ్యం ప్రధానబిందువులనియు (Principal points) పిలువబడును. వస్తువు అవకాశములో అక్షమునకు సమాంతరముగా నున్న Q A వంటి కిరణములన్నియు అనంతదూరములో అక్షముపై నున్న వస్తువు నుండి వచ్చినవనియు అనుకొనవచ్చును. అందుచే ఈ కిరణములన్నియు కటకమువద్ద వక్రీభవనము చెంది F అను బిందువువద్ద కలియుటచే, వస్తువు ప్రతిబింబము F వద్ద ఏర్పడును. ఈ F బిందువును రెండవ సంగమ బిందువు (Second focal point) అని అందురు. దూరము f1=Hశీర్షాక్షర పాఠ్యంF1 కటకముల సంపుటి యొక్క రెండవ నాభ్యంతరము (second focal length) అని పిలువబడును.ఇదేవిధముగా కుడివై పునుండి వచ్చు సమాంతరకిరణముల వలన ప్రతిబింబము F వద్ద ఏర్పడును. F ను మొదటి