1 కాంటు ఆగస్టు రాంటు ఆగస్టు (Augusu Comtu) : ఆగస్టు కాంటు ఒక నూతన శక ప్రారంభమున ఉన్న వాడు. ఈశ్వర ప్రతిపాదకములును, ఆధ్యాత్మికములు నయిన ప్రాచీన నాగరకతలనుండి మానవజాతిని మరల్చి యొక నూత్న జీవిత పథమునకు ఆహ్వానించినవా డితడు. ఫ్రెంచి విప్లవము ప్రాచీన నాగరికతను భయంకరముగా ధ్వంసము గావించిన కాలములో ఇతడు జన్మిం చెను. ఇతడు సహజజ్ఞానముగానీ, ఆంతరశ్రవణముగాని కల ప్రవక్త కాడు. మానవజీవితమునందలి లోతును పరీక్షించి నట్టియు, సాంఘికమైన క్రమభంగమునకును, వైఫల్యమును కును గల కారణముల నరసినట్టియు తిరుగుబా టొనర్చి నట్టియు మేధావి ఇతడు. ఇతడు బాల్యమునుండి యే అసామాన్యమైన స్వభావ, ప్రతిభలను ప్రదర్శించినవాడు. అందుచేత ఇతనిని సహాధ్యాయులు తత్త్వజ్ఞుడని పిలుచు చుండిరి. విద్యావివేక క్షేత్రములందు ఇతడు పెద్ద పెద్ద అంగలు వేసి, వాస్తవిక తత్త్వవిద్య (Positive Philo- sophy) ను ప్రజలకు ప్రకటించెను. ఈ దర్శనము మానవ జీవిత రహస్య గ్రహణమునకు నూతనదృష్టిని ప్రసాదించెను. ఇతడు ఈశ్వరవిశ్వాసమును, ఆధ్యాత్మిక శాస్త్ర తత్త్వ మును నిరాకరించి సంఘక్రమసిద్ధికి అవసరమగు మహావిధి భారమునంతయు దుర్బలములు, సద్యోజనితములు అయిన "సంఘశాస్త్రము" యొక్క భుజములపై పడవేసెను. ఈ సంఘశాస్త్రమునే సంఘ భౌతికశాస్త్రము (Social Physics) అనికూడ అందురు. కాంటు “మానవత్వము" అను క్రొత్త మతమును ప్రవేశ పెట్టి, దానికి "సమాజా రాధనము" (Sociolatry) అని నామకరణము చేసెను. అందు ఇతరులవలన ప్రభావితుడు కాక పోలేదు. తమ కాదర్శపురుషులగు వారిని సంపూర్ణ ఉపజ్ఞో పేతులనుగా ప్రశంసించుట యన కొందరకు పరమ సంతోషము. కాని నిజమేమనగా, గొప్ప యోజనాపరులు దృశ్యమానములగు సంఘపరిస్థితులపై తమ లక్ష్యము సంతయు కేంద్రీకరించి వాటినుండి కావలసిన సాధన సంపత్తిని సేకరింతురు. అట్లే కాంటుకూడ కండోర్ సెట్' (Condorcet), సంతుసిమన్ మొదలగువారివలన అనేక •విషయములను గ్రహించియున్నాడు. సంఘవ్యవహారమను ముఖ్య దర్పణమును ఇతడు అవలోకించి మానవసంసర్గ సంగ్రహ ఆంధ్ర ములు, సంఘవ్యవస్థలు, సంఘాభివృద్ధి అను వాటిని అర్థము చేసికొనుటకు క్రొశాస్త్రము అవసరము అని గ్రహించెను. ణాంటు పెక్కు గ్రంథములు వ్రాసినాడు. వీటిలో "వాస్తవిక తత్త్వవిద్య", "ప్రత్యక్ష వాస్తవిక రాజ్య వ్యవస్థ" (Positive Polity) అనునవి స్మరణీయము లయినవి. ఇవి విజ్ఞాన క్షేత్రములో గొప్ప సంచలనమును కలిగించినవి. 602 కాంటు రచనలలోని సర్వతోముఖ దృష్టిని చూప బూనుట వ్యర్థప్రయత్నమే యగును. అయినను, భౌతిక శాస్త్రముల ఆచార్యకవ్వము ఇతనికి బాగుగ గోచరించెను. సంఘాభ్యుదయమునకును, సహృదయకశ్వమునకును సాంఘిక శాస్త్రము అవసరమని ఇతని దృథా భిప్రాయము. ఇతడు మూఢవిశ్వాసముల బారినుండి సాంఘికాభివృద్ధిని రక్షించుటకు ప్రయత్నించెను. ఆధ్యాత్మిక, ధార్మికతత్త్వాం శములను తిరస్కరించెను. సంఘపరిస్థితులను చక్కగ పరీక్షించి, వర్గీకరణముచేసి చూచుట అవసరమని ఇతడు గట్టిగ వాదించెను. “సంఘశాస్త్రము" "సంఘభౌతిక శాస్త్రము" అను వాటిని “సాంఘిక స్థితిస్థాపక శాస్త్రము" (Social Sta- tics), "సాంఘిక గతిశాస్త్రము” (Social dynamics) అని విభజించినాడు. ఇందు మొదటిది సంఘక్రమమునందలి వివిధభాగముల క్రియాధర్మములను, ప్రతిక్రియాధ ర్మము లను పరిశీలించునది. ఇక రెండవది ప్రగతిధర్మములను విచారణ చేయునది. ఈ క్రొత్తశాస్త్రమును సంస్థాపనచేయుటలో కాంటు మానవుల విచారక్రమమును విచారక్రమమును పృథక్కరించి నంతయు మూడు దశలక్రింద నిబంధించి స్పష్టీకరించెను. అవి ధర్మజ్ఞాన విషయకములు (Theological), ఆధ్యాత్మికములు (Metaphysicai) వా స్తవికములు (Positive) అనునవి. మొదటి దశలో మానవుడు అలౌ కికమైన దృశ్యముల యొక్క ఆధిక్యమును అంగీకరిఁ చెను. రెండవదళలో అతడు కోలది సవరణలతో దేవతల వంళ పరంపరను, మతమును విశ్వసింపసాగెను. తుట్టతుదకు మానవుడు అంతిమదశకు చేరెను, దీనినే శాంటు "తాత్విక దళ" అనెను.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/651
స్వరూపం