Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆసియా

సంగ్రహ ఆంధ్ర


ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికి, వర్షపాతము చాల తక్కువగా నుండుటవలన వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కు వగానే ఉండును.

పీడనము - పవనములు  : శీతకాలమున ఉష్ణోగ్రతలు ఉత్త రదిశకు పోవుకొలది తగ్గుచుండుటవలన పీడనముకూడ క్రమముగా ఎక్కువ అగుచున్నది. ఖండాంతర్భాగమున ఉష్ణోగ్రతలు ఇంకను తక్కువగా నుండుటవలన ఈ ప్రాంతమున వాయుపీడనము ఎక్కువయి అత్యధిక పీడన గుండములు ఏర్పడును. వీటిని "యాంటీ సై క్లోనులు" అనికూడ అందురు. ఈ అధిక పీడన ప్రాంతములనుండి అతి శీతలమైన పొడిగాలులు తీరము వైపునకు అతి వేగముతో వీచు చుండును. ఇటువంటి అధిక పీడనము గల ప్రాంతము ఇంచుమించు సై బీరియాను ఆవరించి బైకల్ సరస్సు ప్రాంతమున అత్యధిక పీడనమును కలిగి ఉండును. ఇదేకాలములో అత్యల్పపీడన ప్రాంతములు ఉత్తర పసిఫిక్ మహాసముద్రములో కురైల్ దీవుల దగ్గరను, ఆస్ట్రేలియాలోను ఏర్పడును. గాలి ఎల్లప్పుడు ఎక్కువ పీడన ప్రాంతము నుండి తక్కువ పీడన ప్రాంతమునకు వీచును. కనుక తూర్పు, దక్షిణ, ఆగ్నేయ, ఆసియా ప్రాంతములు శీతల ఋతుపవనములకు గురి అగుచున్నవి.

అత్యధిక పీడన ప్రాంతమునుండి వీచెడి శీతలమైన పొడి గాలులు హిందూ దేశమును చేరనివ్వకుండ హిమాలయ పర్వతములు అడ్డుతగులు చున్నవి. అందువలన హిందూ దేశములోని శీతకాలపు ఉష్ణోగ్రతలు అంత స్వల్పముగా ఉండవు. కాని హిందూ దేశములో వీచెడి చలిగాలులు ఈ దేశపు పశ్చిమోత్తర ప్రాంతములో ఏర్పడ్డాడు మరియొక అధిక పీడనగుండము నుండి వీచుచున్నవి. శీతకాలములో వీచెడి పొడిగాలులను ముఖ్యముగా ఆసియా ఈశాన్య ప్రాంతమునం దుండెడి దేశములలో శీతలఋతుపవనము లందురు. సముద్ర ప్రాంతములందు ఏర్పడిన అత్యధిక పీడన ప్రాంతములనుండి వీచెడి గాలులను వర్షఋతుపవనము లందురు. వర్షపాతము చాల భాగము వీటివలన కలుగు చున్నది. ఇండియాలో ఇవి నైరృతి దిశనుండి వీచుచున్నవి.

వర్షపాతము  : ఆసియాలో వర్షపాతమంతయు ఇంచుమించుగా వేసవి ఋతుపవనములవలననే జులై, ఆగష్టు, సెప్టెంబరు నెలలలో కలుగుచున్నది. ఈ వర్షము ఆసియా ఋతుమండల మనబడు ఆగ్నేయ ఆసియా ప్రాంతమున ఎక్కువగా కురియుచున్నది. సముద్ర తీరములందు వర్షపాతము ఎక్కువగా నున్నది. కేంటన్, బటేవియా, సింగపూరు, కలకత్తా, బొంబాయి -- ఇవన్నియు వర్షఋతు పవనములు వీచెడి మార్గములో ఉండుటచే ఎక్కువ వర్షపాతమును కలిగియున్నవి. హిందూదేశమున అస్సాం రాష్ట్రములోని చిరపుంజీ ప్రపంచములో నెల్ల ఎక్కువ వర్షపాతము కలిగియున్నది. దీని సగటు వర్షపాతము 458". పశ్చిమ సైబీరియాలో 15" - 20" వర్షము మాత్రమే కురియును.

వృక్షజాలము  : ఆసియాలో ఎన్ని విధములైన శీతొష్ణస్థితు లున్నవో ఇంచుమించు అన్ని రములయిన వృక్ష జాతులు కలవు.

(1) ఉష్ణమండలములోని అడవులు భూమధ్య రేఖ 5° ఉత్తర అక్షాంశమునుండి 5° దక్షిణ అక్షాంశమువరకు వ్యాపించి ఉన్నవి. ఈ మండలములోని వృక్షములు చాల దట్టముగ పెరిగి ఎల్లప్పుడు పచ్చని ఆకులను కలిగి ఉండును. కేన్ మొదలగునవి యీ జాతికి చెందినవి. అడవులు దట్టముగా పెరుగును. అందువలన సూర్యరశ్మి చొరబడుట కష్టము. కావున నేలపై గడ్డిమొలవదు. వృక్షములు 200 -- 250 అడుగుల ఎత్తువరకు పెరుగును. ఒకేరకపు చెట్లు గుంపులుగా పెరుగవు.

(2) 5 ఉ. అ, 5° ద, అక్షాంశముల నుండి 20° ఉత్తర, దక్షిణ అక్షాంశములవరకుగల భూమిలో ఉష్ణమండల ఋతు పవనపు అడవులు కలవు. ఋతుపవన దేశములు ఇండియా, ఇండోచైనా, సయాం, జపాన్ మొదలయినవి. ఆగ్నేయ ఆసియా అంతయు ఋతుపవన ప్రాంతముననే ఉన్నదని చెప్పవచ్చును. ఈ దేశములలో మూడు కాలములుండును. ఈ అడవులలోని వృక్షములకు చాల విశాలమైన పత్రములు ఉండును. వేసవిలో ఆకులు రాలును. ఈ అడపులలో ఒకేరకపు వృక్షములు వేలకొలది గుంపులుగా పెరిగి అనేక చదరపు మైళ్ళ ప్రాంతమును ఆక్రమించును. ఈ అడవులలో గల సాల్, బర్మా ఐరన్ వుడ్, టేకువృక్షములు "పేర్కొన దగినవి. వర్షపాతము 40 కంటె తక్కువ ఉన్న ప్రదేశములలో ఈ వృక్షములు కానరావు. ముండ్లు కలిగిన తుమ్మజాతికి చెందిన వృక్షములు కనబడును. వీటికి