కాంక్రీటు - సామాన్యము, దృరీకృతము సంగ్రహ ఆంధ్ర మించిన తరువాత సిమెంటు గట్టిపడుటతో ఇంక పట్టి ఏర్పడును. దీనిని స్తంభములకును, చూలములకును, కప్పు మార్పు ఉండదని భావించవచ్చును. సిమెంటును, ఇసుకను వివిధ నిష్పత్తులలో మిశ్రమము చేసి, చిన్న యిటుకలుగా తయారుచేసి వాటిని ప రిశోధ నాగారములలో పరీక్షించి వాటి యందు ఏర్పడిన పసిధి బలములను నిర్ణయించవచ్చును. సెమెంటు ఒక భాగము ఇసుక మూడు భాగములు కలిపి ఇటుకగా తయారుచేసి సరీతించవలెను. సిమెంటు మొక్క బలమును నిర్ణ యించుటకు పనిలో వాడిన సిమెంటు ఎంత సంపీడన (Compressive) బలము, ఎంత బిగువు (Tensive) బలము కలిగి యుండునో పరిశోధనాలయములలో నిర్ల యించవచ్చును. సామాన్యముగా 9 దినములు గడి విన తరువాత ప్రతి అంగుళమునకు 1600 పౌండ్ల సంపీడన బల మునూ, 300 పౌండ్ల బిగువు బలమునూ కలిగియుండవ లెను. 7 దినములు గడిచిన తరువాత ప్రతి చతురపు అంగు ళమునకు 2700 పౌండ్ల సంపీడన బలమునూ, 75 పౌండ్ల బిగువు బలమునూ కలిగియుండవ లేను. ఓరి దినములు గడిచిన తరువాత సంపీడనబలము ప్రతి అంగుళమునకునూ 3000 పౌండ్లవరకు ఉండవలెను. సిమెంటు ఒక్క ఘన అడుగునకు 90 పౌండ్లు ఉండ వలెను. సాధారణముగా అమ్మకమయ్యే సిమెంటు సంచి యొక్క బరువు 112 పౌండ్లు ఉండును. దీనిలో 14 సున అడుగుల సిమెంటు వచ్చును. సిమెంటు కాంక్రీటు యొక్క బలము మిశ్రమములో వాడిన సిమెంటు, ఇసుక, రాతికంకర. వీటి నిష్పత్తి మీదను, మిశ్రమమును పనిలో వాడుటకై కలుపుచున్న పుడు ఉపయోగించిన నీటి పరిమితిమీదను ఆధారపడి యుండును. సాధారణముగా ఒక్క సిమెంటు బస్తా వాడి నప్పుడు 5 లేక 6 గ్యాలన్ల నీటిని వాడవలసియుండును, సిమెంటు కాంక్రీటు ఈ క్రింది నిష్పత్తులలో నుండును. సిమెంటుకు మూడు రెట్లు ఇనుకయు, సిమెంటుకు 6. రెట్లు కంకరయు కలిపినప్పుడు 1:3:6 నిష్పత్తి ఏర్పడును. ఇట్టి నిష్పత్తి కలిగిన సిమెంటు కాంక్రీటును పువాదులలో వాడుదురు. సిమెంటునకు "రెండింతలు ఇసుకయు, సిమెంటుకు నాలుగు రెట్లు నాలుగు రెట్లు కంకరయు ఉపయోగించబడిన 1:2:4 నిష్పత్తి కలిగిన కాంక్రీటు 598 S లకును వాడుదురు. వివిధములైన పనులకు, వివిధ నిష్ప గులలో సిమెంటు, ఇనుక, కాంక్రీటు కలుపవలసియున్నది. పునాయులలో వేయు కాంక్రీటునకు సాధారణ కాంక్రీటు అని అందురు. నిప్పులకు, మాలములకు, స్తంభములకు వాడు కాంక్రీటును ఉక్కు కడ్డీలతో దృణీకృతము చేయ వలెను. దీనిని దృఢీకృతమైన కాంక్రీటు (Reinforced concrete) అని చెప్పుదురు. కాంక్రీటులో వాడబడు ఉక్కు కడ్డీల మొత్తము అది మోయవలసిన బరువుమీద ఆధారపడి యుండును. కాంక్రీటును కలుపుట, స్థానములో ఉంచుట అవసర మైన బలము కాంక్రీటులో ఉత్పన్నమగుటకు కాంక్రీటులో వాడబడు పదార్థముల నిష్పత్తి సక్రమముగా మండ పలెను. అందుకొరకు ఇసుకను, కంకరను, "పెట్టెలతో కొలిచి లెక్కప్రకారము సిమెంటుతో కలుపవలెను. సిమెంటు కాంక్రీటు కలుపుటకు యంత్రములు గూడ ఉన్నవి. సిమెంటు, ఇసుక, కంకర వీటిని పోసి తగిన నీటిని కలిపి యంత్రముతోగాని, మనుష్యులు పారలతో గాని కలుగవలెను. ఇట్లు కలిసినప్పుడు గట్టి ముద్దగా నుండ రాదు. బహు పల్చగాను ఉండరాదు. కప్పులకు, దూలము లకు, స్తంథములకు వేయుసందర్భమున ముందు చెక్కలు "పేర్చవలసియుండును. ఆ చెక్కలను కడ్డీలకు బిగించి 'కాంక్రీటు వేసినప్పుడు అవి కదిలిపోకుండా చూడవలెను. ఈ విధముగా చెక్కలు పేర్చి బిగించిన తదుపరి లెక్క ప్రకారము ఇనప కడ్డిలను వంచి స్థానములో "పేర్చి సన్నని ఉక్కు తీగతో బిగించవలెను. అప్పుడు సరిగా మిశ్రమమైన సిమెంటు కాంక్రీటును తెచ్చి పోయవలెను. నీరు పోసి కలిపిన తర్వాత 45 నిమిషములలో కాంక్రీటును స్థానములో పోయవలెను. పెద్ద పెద్ద కట్టడములు నిర్మించునప్పుడు, లేదా పెద్ద మొత్తములో కాంక్రీటు పోయునప్పుడు యంత్రసహాయముతో దానిని కుదించ (Vibrate) వలెను. ఈవిధముగా చేసినయెడల సందులు ఏవి లేకుండ సిమెంటు కాంక్రీటు కూరుకొనును. కాంక్రీ టును స్వస్థానములో ఉంచిన తరువాత దానిని నీటిలో నాన బెట్టవలెను. అందుకొరకు 15, 20 దినములవరకు దాని మీద నీరు ఉండునట్లు చూడవలెను. కాంక్రీటు స్తంభము
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/647
స్వరూపం