కళింగదేశ చరిత్రము ప్రతాపరుద్ర గజపతీ (1407-1530), ఆ తరువాత అతని తనయులు కాలు ఆదేవ, కథారు ఆదేప అను వారిద్దరు వరుసగ కటకమునుండిపరిపాలించిరి. ప్రతాపరుద్రుడు కృష్ణ రాయల సమకాలికుడు. ఈనని కాలమున కృష్ణ రాయలు కళింగముపై దండెత్తి, ప్రతాపరుద్రు నోడించి, అతనితో సంధిచేసికొని, కృష్ణకు దక్షిణభాగ మంతయు తీసికొనెను. గజపతిరాజ్య శ్రీణళకును, నాశనమునకును ఈ క్రింది విషయములు ముఖ్యకారణములు : క్రీ. శ. 18వ శతాబ్ది ప్రారంభమున కృష్ణ దేవరాయలు ప్రతాపరుద్ర గజపతి నోడించి గోదావరినదికి దక్షిణమున నున్న దేశమును తన రాజ్యములో కలుపుకొనెను. క్రీ. శ. 16 వ. శతాబ్ది అంత్యభాగమున బెంగాలు నవాబులు ఒరిస్సా దేశముపై దండెత్తి జాతిపురం, జగ న్నాథం మొదలగు పట్టణములను కొల్లగొనిరి. దక్షిణమున గోల్కొండ నవాబులు శ్రీకాకుళము వరకును దేశమును జయించిరి. గల ఒరిస్సా దేశమున చైతన్యమతము ప్రబలియుండుటచేత రాజులును, మంత్రులును, ముఖ్యాధికారులును భక్తి మార్గ పరాయణులై యుండి రాజకీయవ్యవహారములను సరిగా జరుపలేకుండిరి. వై ష్ణవ మతస్థులగు రాజులకును, శైవమతస్థులగు ప్రజ లకును పరస్పర వైషమ్య మేర్పడెను. ఒరిస్సాలోని కొండజాతులవారును, ఆంధ్రదేశములోని సామంతరాజులును తమ స్వతంత్రతను ప్రకటించుకొనిరి. ప్రతాపరుద్రుని మరణానంతరము (క్రీ.శ.1540) గోవింద విద్యాధరుడు భోయీ వంశమును స్థాపించెను. 'మాదల సంజీ' గ్రంథమునుబట్టి, బెంగాలు నవాబులు ఉత్త రము నుండియు, గోలకొండ నవాబులు దక్షిణము నుండియు గజపతిరాజ్యముపై దండెత్తగా గజపతిరాజు మంత్రి యగు గోవిందుడు వారితో కుట్రజేసి వారి సహా యమున క్రీ. శ. 1541 లో భోయీ వంశమును స్థాపించి 7 సంవత్సరములు రాజ్య మేలెను. ఈ వంశమువారు క్రీ. శ. 1550 లో ముకుందదేవు డను తెలుగురాజుచే ఓడింపబడిరి. ఈతడు క్రీ. శ. 1588 వరకు రాజ్యమేలెను. ఇతని కాలముననే బెంగాలునవాబు ఒరిస్సా దేశ మును పూర్తిగా జయించెను. గోలకొండ నవాబగు కులీకుతుబ్ షా సంగ్రహ ఆంధ్ర శ్రీశ్రీకాకుళము వరకు గల దేశమును జయించెను. ఈ కాలమున ఉత్తర ఒరిస్సా ఖుర్దారాజులు స్వాధీన మున నుండెను. క్రీ. శ. 1578.74 లో అక్బరు చక్రవర్తి బిహారు, భంగాలు, ఒరిస్సా దేశములను జయించుటకై మునీంఖాన్, రాజా తోడర్ మల్లు అను నిద్దరు సేనానుల యాధిపత్య మున ఒక గొప్ప సేనను పంపెను. వారు కొంతవరకు జయమును పొందిరి. క్రీ.శ.1502 లో పఠానులను పూర్తిగా ఓడించి, రాజా మాన్ సింగు మొగలాయిల పక్ష మున ఒరిస్సాదేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనెను. ఉ త్తర ఒరిస్సాదేశమును ఏలుచున్న ఖుర్దా రాజగు రామ చంద్రదేవుడు తుదకు అక్బరునకు వశుడయ్యెను, ఈ రామ చంద్రదేవుని సంతతివారే రమారమి 20 మంది రాజులు క్రీ. శ. 16 వ శతాబ్దాంతము మొదలుకొని ఇప్పటి వరకును వంశ పరంపరగా ఖుర్దారాజులను పేర, మొదట మొగలాయిలకును, తరువాత మహారాష్ట్రులకును ఆ తరు వాత బ్రిటిషువారికిని సామంతులుగా నుండి, ఇప్పటికిని 'గజపతిమహారాజ' బిరుదము నొందుచు, జగన్నాథ దేవా లయ ధర్మకర్తలుగా పాలించుచున్నారు. అక్బరు క్రీ.శ. 1805 లో చనిపోయినప్పటి నుండియు 1752 వరకు ఒరిస్సా ఉత్తరమున తామ్రలిప్త, మిధున పురములు మొదలు దక్షిణమున రాజమహేంద్రవరము వరకును వ్యాపించి లీ జిల్లాలు లేక సర్కార్లు క్రింద విభ జింపబడి యుండెను. శ్రీకాకుళము, రాజమహేంద్రవరము జిల్లాలు గోలకొండ నవాబుల స్వాధీనముననుండి ఔరంగ జేబు కాలమున క్రీ. శ. 1888లో పూర్తిగా మొగలాయిల స్వాధీనమునకు వచ్చెను. ఢిల్లీ మొగలాయిరాజ్యము క్రీ.శ. 1724 లో క్షీణించిన వెంటనే, ఆసఫ్ జా హైదరా " బాదునందు స్వతంత్రుడై శ్రీకాకుళము వరకు గల సర్యా ర్లను పరిపాలించెను. ఇతని తరువాత రెండవ నైజామగు నిజామలీఖాన్ కాలమున ఫ్రెంచివారి నోడించి ఇంగ్లీషు వారు నిజామలీఖాన్ సంధిచేసికొని క్రీ.శ.1785 లో ఉత్తరసర్కార్లు అయిదింటిని కౌలుకు తీసికొనిరి. తరు వాత కొంత పెద్దమొత్తము నైజామునకు చెల్లించగా ఉత్తరసర్కార్లు కంపెనీవారి స్వంత అధికారము క్రిందికి వచ్చెను. అనగా చిలుక సరోవరమువరకు గల ప్రదేశము ఇంగ్లీషు వారి స్వాధీనమయ్యెను. 596
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/645
స్వరూపం