విజ్ఞానకోశము - చెరువులు, బ్రాహ్మణులకు అన్నసత్రములు, మఠములు, చలి పందిళ్ళు నెలకొల్పబడెను. ఇంకను ప్రజాక్షేమము కొరకై ప్రభువు దానధర్మములను విరివిగా చేయుచుండెను. ఈతని కాలమున సింహళముతోను, తూర్పు దీవులతోను, విరివిగ వర్తక, రాజకీయ సంబంధములుండెను. కనుకనే తూర్పు దీవులయందును, సింహళమునందును, కళింగ నాగరికత ప్రబలెను. ఈతని తరువాత, ఈతని కుమారుడు కామార్ణవ (1147-1156), ఆగనితరువాత అతని తమ్ముడు రాఘవ (1158-1170), ఆతని తరువాత అతని తమ్ముడు 2 వ రాజరాజు (1170.1194) క్రమముగ రాజ్యమేలిరి. ఈతని కాలమునను, ఈతనితమ్ముడు అనంగ భీమ దేవు (1194-1198) కాలమునను ప్రజానురంజకముగ దేశమంతయు పరిపా లింపబడె రాజులు రాజకీయ వ్యవహార వేత్తలనియు, కావ్యములు చదువుట, వినుటయం దతికుతూహలము కలవారనియు, యుద్ధమున కడు కూరులనియు, ధర్మ పరిపాలనా నిరతు లనియు, ఉత్కలమున ముఖ్యముగ పూరి, భువనేశ్వరము, కోణార్కాది ఆలయ నిర్మాత లనియు శాసనములనుబట్టి తెలియుచున్నది. ఈతనికి గోవిందుడను బ్రాహ్మణమంత్రి సమస్త రాజకీయ వ్యవ హారములందు తోడ్పడుచుండెను. ఈతనితరువాత ఇతని కుమారుడు 8వ రాజరాజు (1198-1211) రాజ్యమేలెను. ఈతని కాలముననే మహమ్మదీయులు ప్రప్రథమముగ ఉత్కలముపై దండెత్తిరిగాని, ఓడింపబడి తరుమగొట్ట బడిరి. ఈతని తరువాత ఈతని తనయుడు 3వ అనంగ భీముడు (1211-1288) రాజ్యమునకు వచ్చెను. ఈతడు బీదల పాలిటి కామ ధేనువనియు, కలిబాధలను తొలగించి, బ్రాహ్మణులకు తులాపురుష దానమును, భూదానములను చేసెననియు తెలియుచున్నది. ఈతడు త్రికళింగేశ్వర బిరు దముతో గంగానది మొదలు గోదావరివరకు రాజ్య మేలెను. ఈతని ప్రధాని విష్ణువు. అతడు తుమ్మాణ వృథ్వీ పతిని, వంగదేశము నేలు మహమ్మదీయులను ఓడించి తరిమి వేసెను. తుమ్మాణదేశము చేది రాజుల యధీనములో నున్న కోసలరాజ్యములోనిది. ఈతడు తన రాజ్యమునందలి భూములవన్నిటిని కొలిపించెననియు, నీటి వసతులను కల్పించే ననీయు, భూమి, నీటి వగైరా పన్నులవల్ల చాల ధనమును సేకరించెననియు, అనేక పెద్ద పెద్ద తటాకములను త్రవ్వించి 595 చుండెను. కళింగదేశ చరిత్రము వాటి తీరములందు వైష్ణవాలయములను కట్టించెననియు తెలియుచున్నది. టంకసాలల వృద్ధిచేసి వెండి, బంగారు, సీసము, రాగి నాణెములను పలురకములు ఓరకలు, మాడలు, గద్యలు మొదలగునవి ముద్రింపించెను. క్రీ.శ. 1238.1434 వరకు అనగా 200 సం. లు తుదిగాంగ రాజులు ఎనిమిదిమంది నరసింహభానుదేవ నామకులు పాలించిరి. ఈ రాజులు ఒరియా భాషను, సంస్కృత భాషను, ఆయా పండితులను ఎక్కువగా ఆదరించి, ఆ భాషలలోనే శాసన ములు చెక్కించుటయు ఈ కాలమున ఒరియా, సంస్కృత తెలుగు వాఙ్మయములు అభివృద్ధిగాంచుటయు జరుగు అప్పటి మహమ్మదీయరాజులు మాల్వా, బెంగాల్ దేశములనుండి ఉత్కళముపైకి పలుమార్లు దండెత్తిరిగాని ఓడింపబడిరి. దీనికి ప్రతీకారముగా గాంగ రాజులే రాధ, నరేంద్ర అను దేశములను జయించిరి. ఈ రాజులలో మొదటిరాజగు నరసింహ తన ఆస్థానకవివిద్యా ధరుడు 'ఏకావళి' యను అలంకారశాస్త్రము రచింపగా దానిని కృతినందెను. వ్యాకరణములు, కావ్యములు, ఇతర శాస్త్రములు, సంస్కృత, ఓడ్ర భాషలందు వ్రాసిన కవులకు బహుమానము లియబడుచుండెను. ఇట్లే మన ధర్మమును బోధించు కబీర్, చైతన్య, రామానంద. నరహరతీర్థ మొదలగు మతగురువులు గంగరాజులవలన అనేక సన్మానములను పొందిరి. ఇట్లే మొదటి థానుదేవు (1284-1278) విఖ్యాతుడగు దాతయనియు రాజకీయ వేత్తలగు మంత్రు లనేకులు గలవాడనియు, కనకాచల,, కామధేను, కల్పద్రుమాది బహుమానములను, శత సహస్ర గృహ భూదానములను చేసినవాడనియు తెలి యును. ఈ రాజులు శ్రీకూర్మ, సింహాచల, దాణా రామ దేవాలయములను సందర్శించి, వానికి భూదానము లిచ్చుట, ఆలయములు వృద్ధిపరచుట, వేదాధ్యయన సంపన్నులగు బ్రాహ్మణులకు దానములిచ్చుట జరుపు చుండిరి. ఈ ప్రభువులలో తుదివాడగు నాల్గవఖానుడు (1414-1484) దక్షిణ దేశ దండయాత్రకై వెడలినపుడు అతని మంత్రులు, సేనాధిపతులు కుట్రపన్ని, కపిలేశ్వర గజపతిని సింహాసన మెక్కించిరి. ఈతడు 1495-1469 వరకు రాజ్యము చేసెను. ఈతని తరువాత ఈతని కుమారుడు పురుషో త్తముడు (1489–97) ఆ తరువాత అతని పుత్రుడు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/644
స్వరూపం