Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళింగదేశ చరిత్రము

సంగ్రహ ఆంధ్ర


శాసనములు "దక్షిణ హిందూ దేశ శాసనముల” (సంపుటములు 4, 5, 6) యందు వందలుగ ప్రకటింపబడుటచేత, వీరి కాలపు ఆర్థిక, సాంఘిక, రాజకీయ విషయములు బాగుగ తెలియుచున్నవి. మూడవ (ణద్వ) వజ్రహస్తుని నడగాం, నరసీపట్నం మొదలగు తామ్రశాసనములను బట్టి, ఈ రాజుల మత, గోత్ర, రాజ్య చిహ్నములు బాగుగా తెలియుచున్నవి. ఈతడుసార్వభౌమ బిరుదములను వహించి క్రీ. శ. 1037 మొదలు 1070 వరకు రాజ్యము చేసెను. ఈతని తామ్రశిలా శాసనములు చాలభాగము తెలుగు భాషయం దున్నవి. ఈతని తరువాత ఇతని కుమారుడు రాజరాజు (1070-77) కళింగము నేలేను. ఆతడు మొదట ద్రమిళాహనోత్స వమందుయ జలక్ష్మికి భర్తయై, పిమ్మట రాజేంద్రచోళుని కుమార్తెను రాజసుందరినీ పెండ్లి యాడెను. చోడసముద్రమున మునుగుటకు సిద్ధముగ నున్న వేంగిరాజగు విజయాదిత్యుని (ఇతడు రాజరాజ నరేంద్రుని సవతి తమ్ముడు) రాజరాజు రక్షించెను. రాజరాజు యొక్కయు, అతని తండ్రి వజ్రహస్తుని యొక్కయు రాజ్యకాలమున కళింగదేశమును కదంబ వంశమువారు సామంతరాజులుగ పరిపాలించిరి. ఈ కదంబులుకూడ కదంబవంశశక మొకదానిని స్థాపించిరి. వీరు మహేంద్రాచల ప్రాంతమున పంచవిషయ మండలాధిపతులుగా నుండి అనేక యుద్ధములందు శత్రువులను జయించి, దేశమును సంరక్షించి, అనేక వందలమంది బ్రాహ్మణులకును, అనేక దేవాలయములకును అగ్రహారముల నొసంగిరి. ఇట్లే కళింగమున మత్స్యవంశీయులు, మన్నె రాజులు, కదంబ, నల, వై దుంబ, పల్లవ, చాళుక్య వంశములు సామంతరాజ్యముల "నేలుచు, గాంగులతో సంబంధములు చేయుచుండిరి. రాజ్యము పలువిషయములుగను (జిల్లాలు), ప్రతి విషయము అనేక భోగములుగాను (నాడులు), ప్రతిభోగము. అనేక గ్రామములుగాను విభజింపబడి యుండెను. ఆకాలమున మహాసామంత, శ్రీ సామంత, రాజానక, రాజపుత్ర, కుమార, అమాత్య, ఉపరిక, దండనాయక, విషయపతి, గ్రామపతి, పురోహిత, దండపాశి, అక్షశాలి మొదలుగాగల రాజకీయ ఉద్యోగీయులుండినట్లు శాసనములను బట్టి తెలియుచున్నది. రాజునకు భూమి, నీటి, వృత్తి, యుద్ధ పన్నులును, కప్పములు, సుంకములు, అపరాధములును చెల్లింపబడుచుండెడివి. కళింగులుసు తెలుగువారి వలె, ఆ భాషనే మాట్లాడుచుండిరి. కొన్ని శాసనములు సంస్కృత భాషయందే వ్రాయబడుచుండెను.

అనంతపర్మ చోడగంగదేవి : (క్రీస్తు. 1078 మొదలు 1147 వరకు.)

అతని పరిపాలనా విధానము: ఇతడు గాంగవంశపు రాజులలో కెల్ల గొప్పవాడు. రాజాధిరాజ, రాజవరమేశ్వర పరమమాహేశ్వర, పరమవైష్ణవ, పరమబ్రహ్మణ్య మొదలగు బిరుదములు గల శ్రీ చోడగంగ దేవు రాజరాజు కుమారుడు. 72 సం.లు రాజ్యముచేసెను. 1134 లో కేసరి వంశపు కడపటి రాజగు సువర్ణ కేసరి నోడించి అతని రాజధాని కటకమును స్వాధీనపరచుకొని ఉత్కలాధిపతి యయ్యెను. వంగ దేశములోని కొంత భాగమును జయించెను. ఈతడును, ఈతని వంశమువారును, పదునేను గురు రాజులు పరుసగా 300 సం.లు (క్రీస్తుశకము 1132-1434) రాజ్యముచేసిరి. ఈతని శాసనములు ముఖ లింగ, దాక్షారామ, సింహాచల, నీలేశ్వర ఆలయములందు ఎక్కువగా దొరకినవి. ఇవిగాక చాల తామ్ర శాసనములును దొరకినవి. ఈతని సేనాధిపతి బణపతి చాల విజయములను సాధించి రాజ్యాభివృద్ధి చేసెను. చోడగంగ చిన్ననాడే విద్యల నేర్చి వేదశాస్త్రములందును, సమస్తకళలందును ఉత్తీర్ణుడయ్యెను. గంగా గోదావరి నదులమధ్య నున్న భూములనుండి అనేకరకముల పన్నులను తీసికొనెను. భువనేశ్వరమునను, జగన్నాథమునను, అనేక దేవాలయములను కట్టించెను. మహానదీ తీరముననున్న కటకమును జయించిన తరువాత తన రాజధానిని ముఖలింగమునుండి అచ్చటికి మార్చివేసెను. రాజ్యమునంతను కొన్ని మహామండలములక్రిందను, ఒక మహామండల మనేక మండలముల క్రిందను, ఒకమండలు మనేక నాడులక్రిందను, ఒకనాడు అనేక గ్రామములక్రిందను విభజింపబడెను. ఆయా ప్రదేశములలో అనేకులు ఉద్యోగులుగ నియమింపబడిరి. అనేక దేవాలయములు నిర్మాణమయ్యెను. వాని పోషణ కొరకును, దేశమున విద్య, జ్ఞానము, నాగరకత, వృత్తులు అభివృద్ధిచెందుటకై వారివారికి భూములను, ధనమును ఇచ్చుట జరుగుచుండెను. అనేకరకముల బంగారు, వెండి, రాగి నాణెములు ముద్రింపబడుచుండెను. పూలతోటలు,