విజ్ఞానకోశము - అభిప్రాయము. క్రీ. శ. 350 నుండి 460 వరకు వీరు పరి పాలనము సాగించిరి. వీరు వేదాధ్యయనపరులగు బ్రాహ్మ ణులకు దాన మిచ్చియుండుటచేత వైదిక మతావలంబకు అని నిశ్చయింపవచ్చును. వీరు గంజాం జిల్లాలోని దక్షిణ భాగమును మాత్రమే ఏలిరి. (అనగా శ్రీకాకుళం, పర్లా కిమిడి తాలూకాలు). దానము పొందిన బ్రాహ్మణులు తెలుగువారు. వీరి రాజ్యానంతరము కళింగము గాండ వంశపు రాజుల పాలబడెను. 5. కళింగ గాంగవంశపు రాజులు: వీరు ఉత్తరమున గాంగవాడి విషయమున కోలాహలపురమును పాలించి, ఆ తరువాత ఆ దేశమునువదలి, తూర్పుగాపోయి మహేంద్ర గిరిని సమీపించి, అందుండు గోకర్ణస్వామి నారాధించి వారి వలన సకల రాజ్యలాంఛనములను సంపాదించి, కళింగము నేలు బలాదిత్యు నోడించి, కళింగమును స్వాధీన పరచుకొని, దంతపురము రాజధానిగా చేసికొని కళింగ దేశమును పాలించిరి. కళింగ గాంగులును, మైసూరులోని పశ్చిమ గాంగులును, వారి వారి తామ్రశాసనములనుబట్టి ఆదియందు ఒకే దేశమువారనియు, ఒకే జాతివారనియు, ఒకే కుటుంబము వారనియు, మైసూరు గాంగులు మూల వంశమువారనియు, కళింగగాంగులు వారినుండి వీడి పోయిన ఒక శాఖవారనియు తెలియును. తూర్పు గాంగుల శాసనములనుబట్టి వారు వైదిక మతోద్ధారకులుగ నుండుట తెలియుచున్నది. పశ్చిమగాంగులు, జైనుల సహాయమున రాజ్యము సంపాదించుటచేత జైనమతస్థు లైరి. వారు సూర్యవంశపు రాజులు. తూర్పు గాంగులు చంద్రవంశపు రాజులు. వారు మహేంద్రగిరిపై నున్న గోకర్ణేశ్వరుని పాద భ క్తులు. Q ఈ గాంగరాజులు గాంగేయ శకమును స్థాపించిరి. గాంగళకము క్రీస్తుళకము 5 వ శతాబ్దాంతమున అనగా, క్రీస్తుశకము 498వ సంవత్సరమున స్థాపింపబడెనని నిశ్చయింపబడినది. వీరి రాజధానియైన కళింగనగరము ముఖలింగ మేయని స్థిరపడినది. ఈ రాజులలో జిర్జింగి దాన కర్తయగు త్రికళింగాధిపతి ఇంద్రవర్మ క్రీ.శ.585-98 ప్రాంతమున నొక దానశాసనము వేయించెను. అంతటి నుండి వరుసగ 24 గురు రాజులు క్రీస్తుశకము 900 సం॥ వరకు పూర్వ గాంగరాజులను పేర రాజ్యమేలిరి. వీరి 75 కళింగదేశ చరిత్రము వంశక్రమము రెండు మూడు పురుకాంతరములు మాత్రమే వారి దానపట్టాలలో పేర్కొనబడెను. తరు వాతి గాంగరాజులు, మొదటి వజ్రహస్తుడు (క్రీ.శ. 85 మొదలు 884 వరకు) మొదలు 24 గురు రాజులు క్రీస్తు శకము 1435 వరకు కళింగ, ఉత్కళ దేశములపై రాజ్య మేరి. వీరి శాసనములన్నియు “దక్షిణ హిందూదేశ శాసనములు" 4, 5, 6 సంపుటములందు చూడదగును. ఇదిగాక, రమారమి 35 తామ్రశాసనములు ఈవంశము నకు చెందినట్లు ప్రకటింపబడినవి. ఈ రాజులందరును శైవ మతస్థులు; చంద్రవంశమునకు చెందిన క్షత్రియులు. తత్పూ ర్వము జైన బౌద్ధమతముల కాటపటైన కళింగమున శైవమతమును స్థాపించి శైవాలయముల నెక్కువగా నిర్మించి, శివదీక్షాపరులును, వేదాధ్యయన సంపన్నులును అగు బ్రాహ్మణులను ఆహ్వానించి, దేశమున వారిక నేక అగ్రహారములు దానమిచ్చి, దేశమున నాగరకత, జ్ఞానము వృద్ధిచేయుటకై ఈ ప్రభువులు పాటుపడిరి. ఈ పూర్వ గాంగరాజుల శాసన ముద్రికలపై చెక్కబడిన శంఖ, నంది, అర్ధ చంద్రిక మొదలగు వానిని బట్టియు, శాసనమున గల పరమనూ హేశ్వర బిరుదములను బట్టియు ఈ రాజులు శైవమతస్థు లని రూఢి యగుచున్నది. వీరి శాసనములు ప్రాచీన దేవనాగర లిపిలో చెక్కబడినవి. సాధారణముగ వారి భాష సంస్కృతము. దానగ్రామ నామములు తెలుగున వ్రాయబడినవి. ఈ రాజులకు సుహారాజాధిరాజ పర మేశ్వర బిరుదము లుండుటచేత కళింగ రాజ్యము అన్ని దిశలకు వ్యాపించె నని తెలియును. నీరికాలమున వేంగి తూర్పుచాళుక్య వంశమున అంతఃకలహములు హెచ్చగుట చేత కొందరురాజులు కళింగమున సామంత రాజ్యము లేర్పరచుకొనిరి. దేవేంద్రవర్మ యను రాజు తరువాత కళింగము నేలిన మధుకామార్ణవుని తామ్రశాసనములో 528 గాంగళకము అని వాడుటచేతను, ఈతనికి పూర్వము రాజ్యముచేసిన అనంతవర్మ వజ్రహస్తుని శాసనము లో శకవర్షము వాడుటచేతను, వాటిని క్రీస్తుశక వర్షములుగ మార్చుటకు వీలుకల్గినది. ఇంతటినుండి గంజాం, విశాఖ జిల్లాల నేలిన ఈ రాజుల శాసనములు రాగి రేకులపైననే గాక, రాళ్ళపై గూడ చెక్కబడుటచే వీరి చరిత్ర ఎక్కువ బాగుగ తెలియుచున్నది. ఇంతటినుండి ఈ రాజుల శిలా 593
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/642
స్వరూపం