కళ - వేదాంతము దళ అది రూఢ విషయములందు form and Content) అసమగ్రతను చూపును. సౌందర్యము, దాని ప్రాచీన (classical) వికాస దశయందు సగుణవాదకక్ష్యకు (anthropomorphic) చెందిన డై యుండెను. కాని, దాని (సౌందర్యము) యొక్క అంత్య క 5493N యందు, 19 దానినే అతిశయించుచున్నది. ఈ విధముగ కళ యొక్క విజయమే దాని యొక్క : రాజయము గూడ నగుచున్నది. శళ ఆత్మజ్ఞమై, తాత్విక సంబంధ మైన నిరుపాధికి 'భావన' గా మారినపుడు ఇది సంభవించును, ఇట్లు రనమీమాంసా విషయక 'మైన వేదాంతము సౌందర్యము యొక్క సహజ స్వభావమును (intrinsic nature), శాశ్వతమైన ప్రయోజనమును వాస్తవికత యొక్క ప్రధానగుణముగా స్థిరపరచునేగాని, దానిని మాయామయమైన (మిథ్య) రూపముగ ప్రతిపాదించదు. కురూపత (ugliness)యే ప్రత్యణానుభవము (empirical experience) అగుచున్నను, ఇంద్రియా శీనస్థితి (trans- cendental state) యందు మాత్రము అట్లు కాకూడదు. ప్లేటో అను శశ్వవేత్త నిరుపాధిక బ్రహ్మమును ఆరోహ కక్ష్యలలో (ascending stages) సౌందర్యముగ భావిం చును. ఇట్లీగని విచారము హిందూ వేదాంత విచారము నకు పూర్తిగ సన్నిహితముగ నున్నది. సౌందర్యము రూ:: రహితమైనది. అయినను బానికొక స్వీయరూపము కలదు. సౌందర్యము యొక్క రూపము దాని పదార్థమునుబట్టి మారుచు, దాని ప్రయోజనమును నిర్ణయించుచుండును. సౌందర్యము యొక్క ఆత్మ స్వీయ ఆదర్శకృతమైన లేక ఆధ్యాత్మిక కృతమైన (spiritualized) సాధనమందు మూర్తిమంతము కానీచో, అట్టి సౌందర్యము అదృశ్య మగును. సౌందర్యము సాధనము యొక్క ఆకారమందును, స్పర్శమందును కలదు. ప్రకృతిశోభలు వా స్తవముగ ఆకర్షకములు. వీటికంటే పతుల యొక్కయు, జంతువుల యొక్కయు రూపములు ఎక్కువ మనోహరముగను, రమ్యముగ నుండును. గహనశా స్టైర్యోపేతమయిన మాన హకృతి యొక్క నిర్మాణము సౌందర్యము యొక్క విజయమగును. నిరుపాధిక సౌందర్యము (absolute charm) ఇంద్రియాతీతమయిన రమణీయతము, శాశ్వత మయిన ప్రయోజనమును కలిగియున్నది. విశిష్టాద్వైత 588 సంగ్రహ ఆంధ్ర వేచాయిము 00*150 యొక్కయు, పదార్థము యొక్కయు సాపేక్షతను గుర్తించును. అది భూమ్యా కాశముల కొక సౌందర్య శ్రేణిని నిర్మించును. దాని నిరుపాధి సౌందర్యదృష్టి శుదరు వ్యామోహకమయిన దృశ్యముగ పరిణమించును. పరిచ్ఛిన్నాళ్ళ భోగాశక్తి చే నులినమగు పరిణాసుదళ యే కురూపత (ugliness) యన బడును. కానీ ఆత్మమాలిన్యమునుండి విముక్తమయినపుడు తాను తనను దివ్యసౌందర్యమూర్తినిగా గ్రహించును. వేదాంతశాస్త్రమందలి బ్రహ్మము, నీతిశాస్త్రమందలి ఈశ్వరుడు, విశిష్టాద్వై వేదాంతమునకు చెందిన భాగన 'భువన సుందరుడు' మారుచున్నాడు. వేదాంతసుందలి నిరుపాధిక బ్రహ్మము రసజ్ఞానవిషయక మతము (aesthetic religion) నందలి సుందరవ ముగ మారుచున్నది. స్వయంప్రకాశమును, నిరతిశయము తను బ్రహ్మము యొక్క సౌందర్యము విశ్వాకృతిని ధరించుచున్నది. కాని అది విశ్వము యొక్క పరిచ్ఛిన్నతను, అసంపూర్ణతను అతిశయించును. బ్రహ్మము అవయవ రహితము. అది సర్వమీమాంసాదృష్టిచే ప్రకృతి యొక్క మానసిక - భౌతిక (psychophysical) పరిణామములను అతిక్రమించును. అది నిర్గుణము. నైతికశాస్త్ర దృష్టిలో బ్రహ్మమునందు కర్మబద్ధుడగు జీవుడు దోషములనుండి విముక్తుడై. అనంతములయిన సుగుణము లే కలిగి " యుండును. అది సత్య సత్యము; విషయాతీతము; అనం తము; సవికల్పకాతీతము; అనంతసుగుణవిరాజితము. కాని ముముడుపును, సంసర్గ పరిచయాన్వేషియునగు అపరోక్ష జ్ఞానవాదికి (mystic) సత్వమీమాంసాదృష్టికి, అతీత మైనట్టి (antological beyond), నైతిక ముగ దోషరహితమైనట్టి బ్రహ్మము రుచింపదు. వేదాంత, నైతిక శాస్త్రముల యెడ మాధ్యస్థ్యము వహించునది, స్వర్గమును భూమికి దింపునది, భూమిని స్వర్గమున కెత్తునది ఒక్క రసమీమాంసయే (Aesthetics). రసజ్ఞానము విషయ తౌల్యమునకును, ఆధ్యాత్మికతకును మధ్యస్థమై యున్నది. అది పరిచ్ఛేద్య. అసరిచ్ఛేద్యములను కలుపు చున్నది. ఈ భావము, బ్రహ్మము స్వరూప రూపగుణము లనుకలిగియున్నదను గుణత్రయాత్మక భావముచే చక్కగ ఆవిష్కృతమైనది. దాని స్వరూపము అద్వితీయమైన
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/637
స్వరూపం