Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - . యుండును. ప్రజలను ఆనందింపజేయుటయే కళాకారుల యొక్క ఆశయమై యుండవలయును. మనోహర రూపములను సృజించు ప్రయత్నమే కళయగుచున్నది. ఆ మనోహర రూపములు మానవుని సౌందర్యపిపాసకు తృప్తికలిగించును. మనము ఇంద్రియ పరిజ్ఞానముల యొక్క పరస్పర సంబంధముల ఏకత్వమును లేక మైత్రిని గ్రహింపగలిగినపుడు, ఆ సౌందర్యపిపాస తృప్తిచెందును. కాని సౌందర్యమను పదము ప్రధానముగా సాపేక్ష మయినది. (Relative) సౌందర్య పరిజ్ఞానము నిలుకడ దృగ్విషయము (Phenomena). అందలి ఆవి ర్భావములు (manifestations) యుగములనుండి ప్రవర్తిల్లిన చరిత్రమునందు మిక్కిలి సందిగ్ధములును, అస్థిరములునై యున్నవి. ఏప్రత్యేకమైన సౌందర్యమును గూర్చిన విజ్ఞానముతో నిమిత్తము లేకుండగనే, కళ యనునది అన్ని కళావిర్భావములకును అన్వయించును. ప్రాచీనమైన గ్రీకుకళ, లేక చైనాకళ, లేక ఇటాలియన్ కళ మన సౌందర్యాభిరుచికి తృప్తిని కలిగింప లేకున్నను, అవన్నియు నిస్సందేహముగ కళలే యగుచున్నవి. కాబట్టి కళయు, సౌందర్యమును తుల్యములు కావు. కళ విధిగా సౌందర్యము కానక్కరలేదు. నిజమునకు కళ గత యుగములందు సౌందర్యాత్మకమై యుండలేదు. ఏ ఆదర్శమునైనను, కల్పక రూపములో (plastic form) చిత్రించుట కళ యనిపించుకొనదు. కల్పక రూపములో కళాకారుడు సాధింపగల ఏ ఆదర్శ భావప్రకటనయైనను కళగా భాసించును. అవి సౌందర్య చైతన్యము తరచుగ కళయందు ప్రవేశము కల్గించుకొనును. అయితే, ఈ సౌందర్య చైతన్యము ముఖ్యముగ నిరాకారమార్గమున (abstract) ప్రవేశించి, కళావిషయక ప్రవృత్తికి ప్రాధమికాధారముగ నేర్పడు చున్నది. అది ఏ ఉపకరణ సామగ్రియందైనను, లేక గుణముల అవబోధమునందైనను కానగును. రంగులు, శబ్ధములు, చేష్టలు, సంక్లిష్టములు, అనిర్దిష్టములు నగు అనేకములైన భౌతిక నిర్మాణములై యున్నవి. సౌందర్య చైతన్యము అట్టి ఉపలబ్ధులను మనోహరము లైన ఆకృతులు రచించుటయందు కానవచ్చును. కావుననే సౌందర్య రసజ్ఞానము (aesthetics) విశేషముగ కళతో 587 కళ - వేదాంతము సంబంధము కలిగియున్నది. సౌందర్య రసజ్ఞానము అనునది ఇంద్రియగోచరము (perception) నకు సంబంధించిన శాస్త్రమైయున్నది. దానికి పై పేర్కొన్న రెండు విధాన ములతో సంబంధము కలదు. కాని బ్రహ్మానందమును, లేక బ్రహ్మజ్ఞానమును పొందు టకు భాపసంచలనము (emotion) ఆవిష్కృతమైనప్పుడు గాని, లేక కళ ప్రదర్శితమైనప్పుడుగాని, కళ కేవల భావ విషయక ప్రాముఖ్యమును అతిక్రమించును. యథార్థ మునను షెల్లింగ్ (schelling) వంటి వారిచే కళ యొక తాత్విక సాధనముగ పరిగణింపబడెను. వాస్తవముగ, ఆ ఏకై కసాధనముచేతనే, కళావిదుడుగు తాత్వికుడు సర్వ ప్రాణులయందును తాళబద్ధముగ పరిస్పందమానముగు పదార్థముల సమైక్యము (harmony)ను తెలిసికొనగల్గు చున్నాడు. విశ్వదైవైక్యవాదియగు చిదాత్మకత్వవాదికి (pantheistic idealist) ప్రకృతి - ఆత్మల యొక్క [ ఐక్యమే నిరుపాధిక బ్రహ్మమగుచున్నది. ఈ బ్రహ్మాండ మొక కళా శిల్పకృతియై యున్నది. ప్రకృతియే యొక బృహత్కావ్యము. ప్రకృతి చేతనముకాదు; అది అచేత నమే. దానికి మానవునితో సంబంధము కలదు. అది వికాసమునొంది, మానవునియందు ఆత్మచైతన్యము కలది యగును. కళావిషయక సహజజ్ఞానమున (intuition) నిరుపాధిక బ్రహ్మము సంపూర్ణముగ స్వీయ సృజనాత్మక శక్తిని తెలిసికొనును. హెగెల్ (Hegel) అను తత్వ శాస్త్రవేత్త అనుభవ ప్రపంచపు కాల్పనిక పథము (Romantic side) కంటే విలక్షణమైన సహేతుక పక్షము (Rational side) నకు అధికతరమైన ప్రాముఖ్యము నిచ్చెను. అతడు వేదాంతతత్వమును సవికల్పక జ్ఞానముగ (Conceptual Knowledge) భావించునేగాని, కళా విషయక సహజ జ్ఞానముగ గుర్తింపడు. స్వతంత్రమైన బుద్ధి సహేతుకముగను గతితార్ధికముగను (dialectical) కళయందును, మతమందును, తత్వశాస్త్రమందును స్వాత్మ ప్రకటనము గావించుకొనును. కళ అంతిమ శ్రేణికి చెందిన దై యున్నది. కారణమేమన, అది ఆత్మను ప్రతిపాదింపక, ఇంద్రియ గ్రాహ్యజ్ఞానమును వివరించును. కళాదర్శమే సౌందర్యము. ఆదిన విశ్వదైవైక్య వాదమందు దాని వికాసము ప్రార్దేశీయకళకు చిహ్నము.