కళ రసజ్ఞుడైన ఒక యథార్థ కళాకారునకు కళ హాస్యము కాని, కాలయాపన మార్గముకాని కాదు. వస్తువును సృష్టించి యథార్థమైన ఆవశ్యకమును తీర్చు తృప్తిని లిగించుటే అతని వృత్తి. మహోన్నత కళాకారుడు ఎప్పుడును నిపుణత సాధించుటకు ప్రయత్నించును. పొరుగు వారికో, జాతీలో లేక మానవకోటికో ఒక వస్తువును నిర్మించి ఈ నైపుణిని ఉపయోగపరచును. యథార్థమైన కళాకారుడు పై వారి ప్రయోజనముల నన్నిటిని తన సొంతముగా భావించును. ఇక వస్తువును తయారుచేయుట యందు చూపబడు బాహ్యమైన యుక్తినికూడ నైపుణి యనవచ్చును. కాని నైపుణీతత్త్వమును, నిర్మింపబడు వస్తువును ఐక్యము పొందవలెను. అపుడే ఆ వస్తువు సరియైనదిగా నుండి వ్యంజన యోగ్యమగును, ఈవిధముగా నిజమైన కళాకారుడు సహజముగా కళాకారుడే జనను అతడు సృజననైపుణ్యమును ముఖ్యముగా అలవరచు కొనవలయును. గత నాగరికతా కాలములలో జీవిత మున ఐక్యముండెడిది. సంయోగమును, ఉదాత్తతయు సాధించే బడినవి. అప్పుడు ఒక కళాత్మక వస్తూత్పత్తికి యొక్క టే మిక్కిలి నైపుణి ఆవశ్యకముగా నుండెను. ప్రాచీన కళా కారులకు నై పుణిని ప్రయోజనకరమైన వస్తునిర్మాణము నందుప యోగించుటయే కళగా నుండెను. కళాకారులు తప్పనిసరిగా నైపుణ్యమును కలిగియుండవలెను. అజంతా చిత్రములు మొదలుకొని, వేదాంతోపదేశములనుండి బండి చక్రముల నిర్మించుటవరకు ఇదియే పద్ధతి. ప్రయోజన కరమైన ప్రతివస్తువునందును వారు జీవితపు దృష్టినంతను జొప్పించుచుండిరి. వారి తత్త్వము, వస్తువు యొక్క విలువ, మతము, రసము, నీతి మొదలైనవన్నియు అందుండెడివి. ఈ విధముగా వారు నిర్మించిన వస్తువులు కళాత్మకములును మతసంబంధములును, ఘనములును, సాంకేతికములు నైయుండెను. వానిని విభజించినచో ఏ విభాగముననైనను చేర్చవచ్చును. వారికి మాత్రము కళ ముఖ్యముగా వేదాంత సంబంధియే. దానికి వారును వారినై పుణేయు నిమిత్త మాత్రములు. ఆధునిక ప్రపంచమున ప్రతివస్తువు అనంత విభాగ ములు కలదిగ విభజింపబడి, స్వచ్ఛముగా సమవర్గములలో నుండవలె నని మనము చాంధింతుము. మనకు కళ కొని సంగ్రహ ఆంధ్ర G రససంబంధ మైన సమస్య. మన కళాకారునిదృష్టి, ఒక కళా కారునిదిగాక ఒక కళావిమర్శకునిదిగా నున్నది. ఏదో బ్రతుకుబ్రతికి, తల్లభ్యమైన నందమును కొల్లగొట్టుటయే సునదృష్టి కాదు. ప్రాచీన జీవితపు నాచులను పోగొట్టు మనము జీవితపు సంతోషసారమునకై అన్వే షింతుము. కళ నైపుణిలో మన్నదని మనము భావింపము. రహదారులు. యంత్రములు, ఛాయాచిత్రములు, భారీ పరిశ్రమలు, అనేకములైన యాంత్రిక శాస్త్రీయ వస్తు జాలములు మన కున్నవి. వీనియన్నిటిలో అధికమైన నై పుణి కావలయును. కాని వీనిలో నొక్కటియు కళా ఖండముకాడు. వీనిలో నేదియు ప్రాథమిక వాంఛను తీర్పు పేరణచే ఉత్ప త్తిచెందినది కాకపోవుటయే ఇందుకు హేతువు. ఓనియున్నత్తకి ఆవశ్యకములయిన బీజములు మనజీవితములలో" కానిపించవు. ఇవి పరోత. ములు, అప్రధానములు, కావ్యములునైన అవసరము లనే తీర్చుచున్నవి. ఇవి తమతమ స్థానములందును, మానవ చరిత్రయందును అత్యధిక ప్రాముఖ్యమును కలిగియుండ వచ్చును. మానవుడు తన అనంత చైతన్యముచే తన వివాసమును ప్రపంచ విజ్ఞాన కేంద్రముగా మార్చుటకు పూర్వము, తాను నివసించుటకును, నిలుచుటకును, ఈ 580 విశాల భూభాగములందు సంచరించి తన అధికారమును సంపాదించుకొనుటకును తన అవసరములను వినియో గించెను. కాని అప్రధానములైన ఈ అవసరములన్నియు జీవితపు ప్రాథమిక ప్రేరణలో ఫిసముగాకుండ నుండలేవు. ఇవి వానిశీలమును, స్వభావమును అధికముగా పరివర్తన మొందించును. ఒక సంపన్నుడైన మనుష్యుని భౌతిక సౌఖ్యముకొరకు తయారుచేయబడిన కుర్చీకిని, మాన వునిచే సృష్టింపబడి కళావస్తువుగా ఉపయోగింపబడు వేరొక వస్తువునకును చాలా భేదముకలదు. మానవునిచే సృష్టింపబడినవస్తువు ఆత్మ యొక్క సంపన్నత్వమునకు ప్రాతినిధ్యము వహించును. ప్రాథమికావసరముగా రూపొంది ఆత్మయొక్క భాగ ముగా మారుటతో కళావస్తువు జీవితానందమున నొక భాగమగును. ఇది జీవితమూలమున వెలుగు సంతోషజ్వాల. ఇది సమస్త వస్తువులను విలీనముగావించి ఐక్యమును సాధించును. ప్రతివస్తువును ఆత్మీయతా భాగముగా
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/629
స్వరూపం