Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కసరత్తులు ఒక ప్పుడు దస్తావేజుల నకలు ప్రతులు అచ్చు వేయబడ వచ్చును. కాని నకలు వ్రాయుటలో వ్రాయసగాని ఆత్మీ యత సాధ్యమైనంత తక్కువగా ప్రత్యక్షము కావలెను. కాని మూల ప్రతుల వ్రాత పోల్చుకొన రానిస్థితిలో నున్న చో వ్రాయసగాని కౌశలము తప్పక అపేక్షితమగును. ఛాయా గ్రహణ ప్రతులను తయారు చేయవచ్చును. కాని అవి అధిక వ్యయ సాధ్యములు. పత్రములకు నకళ్ళు వ్రాయించు పద్ధతివలన దూరప్రాంతములనుండి కవిలె భాండారము లకు చదువరులు రావలసిన ఆవశ్యకము తొలగును. వర్తమాన, భౌతిక శాస్త్రయుగమున కాగితపు ఉత్పత్తి, వ్రాతసాధనములు అతి సులభములై పోయినవి. అనే కాంగములతో సంకీర్ణమైన ప్రభుత్వ విధానము యొక్క సూఙ్మతిసూక్ష్మ చర్యలన్నియు కాగితముపై వ్రాసిపెట్ట బడవలెను. కావుననే నవీన పరిపాలనము పత్రముఖమున జరుగునని జనులు వాకొనుచుందురు. అనంతముగా పత్ర ములు జమ అగుచుండును. అందువలన దస్తావేజుల నాళములేక ఏరివేతలను సమస్యను మనము ఎదుర్కొన వలసి యున్నాము. ప్రభుత్వ యంత్రమునుండి బయలు వెడలు ప్రతి కాగితపుముక్కయు ప్రత్యేక ప్రాముఖ్య మును కలిగియుండజాలదు అని చెప్పుటలో వివేకము లేకపోలేదు. పత్రముల యొక్క అట్టినాశము ప్రతిదినము పరిపాలనలో ఎట్టిసంప్రతింపులు లేక యే జరుగుచుండును. భాండాగారికుడు తన వళములోనికి పత్రములు వచ్చిన తర్వాత వానిని నాశముచేయుతలంపు మానుకొనవలెను. అధికారియైనవాడు పత్రములను తాత్కాలిక వ్యవహార దృష్టితో మాత్రమే పరిగణించును. భాండాగారికుడు పరి శోధకుల భవిష్య దవసరములపై దృష్టినుంచవలెను. నకళ్ళు తొలగింపబడవచ్చునని యొక వాదము కలదు. కాని వ్రాత దస్తావేజులలో మాటకుమాట వ్రాయబడిన నకళ్ళు మిక్కిలి అరుదు. అప్పుడు భావానుగుణమైన నకళ్ళసమస్య ప్రాధాన్యమును గైకొనును. మాటకు మాటగా ప్రతి వ్రాయబడినప్పుడు తప్ప ఒక దస్తావేజునకు మరియొకటి దగ్గర నకలు అని భావించుట ప్రమాద బహుళ మే అగును, కొన్ని దస్తావేజులు శాశ్వతముగా భద్ర పరచదగినంత విలువను కలిగియున్నట్లు తాత్కాలిక 'ముగా తోచకపోవచ్చును.. సంగ్రహ ఆంధ్ర కాని ఏ వ్యక్తియైనను శాశ్వతముగా కవిలెలను ధ్వంసముచేయు జవాబుదారీని తీసికొనునప్పుడు, తన ఆలోచనలనుగాని; అభిరుచులనుగాని తన సమకాలికుల అక్కరలకు మాత్రమే పరిమితము చేయకూడదు. ఇక నేమంటే రానున్న తరములకుచెందిన వ్యక్తుల అక్కరల యెడ తనకుగల బాధ్యతనుకూడ అగడు గుర్తింపవల యును. భవిష్యత్తు నెవరు సులభముగా ప్రత్యక్షము చేసి కొనగలరు? భవిష్యత్తు యొక్క అక్కరలను ఊహింప 576 ఎవరికి తరము ? الشهير పాత ధస్తావేజుల శోధనమునకు కడగినపుడు చస్తా వేజులన్నియు చక్కగా భద్రపరచబడి యుండ లేదను భావము బాధాకరముగా నుండును. పత్రముల ధ్వంస మునకు పూనుకొన్న భాండాగారికుడు కూడా బాధా కరుడే అనదగును. దస్తావేజుల అస్తిత్వము నిరుపయోగ కరమని తాను భావించినందున వాటిని ధ్వంసముచేయు భాండాగారికుడు తన వ్యక్తిత్వమును ఆ సేకరణ విష యములోనికి చొప్పించుచున్నాడు. అట్లు చొప్పించుట అన్యాయము. గత పరిపాలనము యొక్క కృత్రిమస్మృతిని నిలిపి యుంచుటకు వీలగునట్లు దస్తావేజులు భద్రపరచబడు చున్నవి. భవిష్యత్తునకు ఎట్టి సందేశమును అందించు ప్రత్యేకమైన తలపులేకుండగనే అవి దస్తావేజుల రూపము నందుచున్నవి. దస్తావేజులు స్వకృత్యమును నెర వేర్చిన పిదప కూడ వాటి మనుగడకును, వాటి కృత్యనిర్వహణ మునకును మతిలేకుండ వాటికొక నూతన ప్రయోజన మును కల్పింపబూనినవాడు భాండాగారికుడు. అతడు వాటి వర్తమాన నిత్యత్వమును గమనించును. వాటి ధ్వంసమునకును, ఉపేక్షకును కారణములై నవాటిని నివా రించును; సులభముగా పారదర్శకమైన వర్గీకరణ విభా నము నవలంబించును; తమ్మాలమున గత పరిపాలనమునకు సంబంధించిన గుప్తజ్ఞానమును అతడు పాఠకులకు కర తలామలకము కావించును. కసరత్తులు : ఆర్. ఎమ్. జో

మానవజాతికో, మృగజాతికో సంబంధించిన శత్రువును తట్టుముట్టాడకుండ (కదలకుండ) పట్టుకొను విద్య ప్రాచీన