విజ్ఞానకోశము -- ఇతర గృహములనుండి ప్రత్యేకింపబడి యుండవలెను. నీళ్ళు చిమ్ము రబ్బరుగొట్టములు ఇసుకను చల్లు ఉపకరణ ములు, అగ్నిప్రమాదమును తెలియజేయు సైరనులు అగ్నిమాపకదళములతో నేరుగా టెలిఫోను సంబంధము కలిసియుండుట, భాండాగారిక దళమునకు భాండాగారిక దళమునకు క్రమమైన అగ్నిమాపక శిక్షణ మిప్పించుటయు మున్నగు ప్రమాద నిరోధక చర్యలు ఆవశ్యకములు. కవిలె భాండారముల నిలయములో వాతావరణము యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ద మొనరించుటకు తగిన ఏర్పాటు ఉండుటకూడ అవసరమే. కొన్ని శీతల దేశము లలో వేడినీటి గొట్టముల ద్వారమున భవన వాతావరణ మును వెచ్చచేయుటకు వలసిన ఏర్పాటులు కలవు. దీనికి సంబంధించిన కొలిమి గృహ బహిర్భాగమున ఉంచబడును. శీతోష్ణ వాయు నియంత్రణయుత భవనములు (Air-condi- tioned houses) కవిలె భాండారము లుంచబడుటకు ఆదర్శప్రాయములు. విద్యుద్దీపములు ఉపయోగింపబడ వలెను. విద్యుతంత్రులన్నియు బాహ్య లోహనాళము లందు గుప్తములై యుండవలెను. చర్మమునకును, కాగి తమునకును ఉత్తమ రక్షకము ధారాళమైన వాయు సంచారమని కనుగొనబడినది. దస్తావేజులు లేక పత్రములు ఉంచదలచిన గదిలోనికిగాని, ప్రదేశములోనికి గాని వాయు ప్రవాహము ఉరవడితో వీచుటకు వలసిన ఆనుకూల్య మును కల్పించుట అవసరము. దీనిని వీలైనంత తరచుగా ఉపయోగించుటకు తగిన ఏర్పాట్లు చేయబడవలెను. ఇట్టి వాయుతరంగములు దుమ్మునుగాని, మురికిని గాని రికార్డుల లోనికి ప్రవేశింప జేయును అను అనుమాన మున్న యెడల గాలిని రద్దుదూది ద్వారమునగాని, మరి యే ఇతర పదా ర్థము ద్వారమునగాని వడపోయు పద్దతి అవలంబింపబడ వలయును. తెరలు ప్రవేశ పెట్టబడునేడల వాటిని తర చుగా పరిశుభ్ర పరచుచు మార్చుచు ఉండుట అవసరము. వెలుతురుకూడ ఈ సందర్భమున విలువ కలదేకాని ప్రాత ప్రతులను నేరుగా సూర్య కిరణముల కంతగా గురిచేయుట ఉచితమైన పనికాదు. చర్మమునుగాని కాగితమునుగాని చుట్టచుట్టి యుంచుటయు తగదు. రికార్డులుకల గదులు ఏ సందర్భమునను క్రిక్కిరిసి యుండకూడదు. గదులను శుభ్రపరచునప్పుడు రికార్డులను 573 కవిలె ఛాండాగారములు పత్రములను బీరువాలలోనికిని నేలమీదకును చేరవేయు టకు అనువుగా అవకాశములు కల్పింపవలెను. అట్లు కానిచో పత్రముల మనికి వాటి జీవితము తగ్గిపోవును. ప్రతి నిలయమునకును ఒక వాక్యూమ్ క్లీనరు (ఖాళీ స్థలములను శుభ్రపరచు యంత్రము) ఆవశ్యకము. కవిలె ఛాండాగార మందిరములు జనులు పనిచేయుటకును, మెసలుటకును అనుకూలములై యుండవలెను. భవనము యొక్క అన్ని భాగములనుండియు రాకపోకలకు సుల భావకాళములు కల్పింపబడవలెను. స్థలమును పొదుపుగా ఉపయోగించుట అత్యవసరమే. అయినను అది దస్తావేజుల యొక్క సంరక్షణమునకును భద్రతకును వ్యతిరిక్తమై యుండకూడదు. సులభముగా అందుబాటులో బీరువాలు ఉండుట వాంఛనీయము. బీరువాల ప్రక్క భాగములు ఉక్కుతోగాని, ఇనుముతోగాని చేయబడినవిగా నుండ వచ్చును. కాని అడ్డచెక్కలు ఇనుముకంటెను, ఉక్కు కంటెను మృదువైన ద్రవ్యముతో చేయబడి యుండ వలెను. వేక్సువంటి చర్మము కప్పబడిన పలకలు కొన్ని దేశములలో ఉపయోగించబడుచున్నవి. కొన్ని చోట్ల చెక్కలవంటి దళసరి అద్దములుకూడ వాడబడుచున్నవి. ఈ సమస్య పరిశీలించబడినది. కాగితములను కట్టలుగా బట్టలలో మూట కట్టుటవలనను, వాటిని వస్త్రముల అట్టల మీద వేసి కట్టుటవలనను, పెట్టెలలో పెట్టుటవలనను కలుగు లాభనష్టముల తారతమ్యము గుర్తింపబడినది. పత్రముల పరిమాణము పరిగణనకు తీసికొనినప్పుడు ఈ చెప్పిన దంతయు ఆవశ్యకమే. సులభముగా తీసి చదువుకొనుటకు అవి మనకు అందుబాటులో ఉండవలె నను విషయము జ్ఞాపక ముంచుకొనవలెను. విద్యార్థులు పరామర్శ చేయుటకును. పఠనము చేయు టకును పత్రములను చేత పట్టుటకూడ చెరువును కలిగిం చును. కొన్ని కవిలె భాండాగారములలో పొగ త్రాగు టయు, నీరా వాడుటయు నిషేధింపబడినవి. పత్రములపై పెక్కు రకముల వ్రాతలు వ్రాయుటయు, గుర్తులుంచు టయు కచ్చితముగా నిషేధింపబడుచున్నవి. విద్యార్థులు అట్టి అవివేకమునకు పాల్పడినచో తత్క్షణమే అది రసాయన శాస్త్రజ్ఞుని ఎరుకకు తేబడవలెను. పత్రములను మోటుగా త్రిప్పుట మొదలగు పనుల వలన కలుగు నష్ట
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/622
స్వరూపం