Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిలె భాండాగారములు లలో ఒక భాగమైనది. కవిలెలకు ప్రాచీనపత్ర గౌరవము లభించినది. కవిశెలు కార్యాలయములలో పూర్వవిషయ పరామర్శనమునకై భద్రపరచ బడుచున్నవి. ఒక వర్తమాన రాజ్యము మరియొక రాజ్యముపై యుద్ధ ప్రకటనమును చేసినచో దానికి సంబంధించిన లిఖిత సమాచారము వివిధ ప్రభుత్వ శాఖలలో భద్రపరచబడినదై దొరకును. రాష్ట్ర, కార్యదర్శులకును, రాయబారులకును జరిగిన ఉత్తరప్రత్యు త్తరములు మనకు లభించును. యుద్ధ కార్యాలయము దానికి సంబంధించిన జమాఖర్చులను, నివేదిక లను నిర్వహణ మునకును, పరిపాలనమునకును సంబంధించిన వ్యవహార ముల వివరములను సమకూర్చియుంచును. పైని చెప్పబడిన విషయమును దానికి సంబంధించిన ఇతర సామగ్రియు ఏ అభిప్రాయమును గాని ధ్వనినిగాని, ఊహనుగాని, ప్రతిపాదించవు. ఏ సంఘటనలైతే వా స్తవ ముగా జరిగినవో, వేనివలన అవి స్వయముగా కవిలె కొండాగారములలో ఒక భాగముగా పరిణమించినవో అట్టివానికి అవి సామాన్య లిఖిత ఆధికారిక భద్రతాచిహ్న ములు మాత్రమే. అవి కార్యాలయములలో భద్రపరచ బడుటచే సాధికారము లగుచున్నవి. ఆ కార్యాలయ ములుకూడ అట్టి సంఘటనలయందు భాగస్వాములు. తరువాత వచ్చు చరిత్ర రచయిత తన గ్రంథనిర్మాణము కొరకు ఈ పత్రములను పరిశీలించుట. అర్థకల్పనము చేయుట, విభజించుట, క్రమపరచుట మున్నగు పనులు చేయవచ్చును. కావున కవిలె ఛాండారములకు సంబం ధించిన పత్రములకు వలసిన ముఖ్యాతిముఖ్య లక్షణము నిష్పక్షపాత దృష్టియై యున్నది. J కవిలే ఖాండారములు సాధారణముగా లిఖిత పత్ర మయములు, కానీ ఇవి మనకు దస్తావేజులు అను మరి యొక ముఖ్యపదమును మ్ఫరణమునకు తెచ్చుచున్నవి. ముద్రిత సామగ్రి కూడ ఇందు చేరవచ్చునా అను ప్రశ్న యొకటి జనించుచున్నది. యుద్ధవ్యవహారములకు సంబంధించియుండి జాబితాలో చేర్చబడిన "హిందూ" పత్రిక వంటి పత్రిక కూడ దస్తావేజుగా పరిగణింపదగునా? అను ప్రశ్న మరి యొకటి ఉదయించుచున్నది. ఆ పత్రిక సంధి నిబంధన ములతో కూడి యుండవచ్చును. ఏ శాఖ కార్యదర్శి యైనను దానిని కోరవచ్చును. అట్టి సందర్భములలో 572 సంగ్రహ ఆంధ్ర ముద్రిత సామగ్రికూడ అధికారిక పత్రము కాదగును. ఏవిధమైన సాధన సామగ్రితో నిర్మితములై నప్పటికిని లేఖనములన్నియు దస్తావేజులుగానే పరిణమించుచున్నవి. వ్రాతయంత్రములతో అచ్చొత్తబడిన లేఖనములు, టైపు యంత్రములచే యాంత్రికముగా పునర్ముద్రితములై నవి, టైపు బ్లాకులు, చెక్కడపు ఫలకములు, లేక వీటికి చేరువ యైన కాకులు, తదితర సాక్షి సామగ్రులన్నియు దస్తా వేజుల పరిగణనములోనికి వచ్చును. పైన చెప్పబడినవి. అక్షర సంబంధమైన గుర్తులు, లేక సంఖ్యాసంబంధమైన గుర్తులు కలవి. అట్టివి కాకున్నను పై నిర్వచింపబడిన రూపముగల దస్తావేజులలో భాగ ములుగా నున్నవి. వాటితో అనుబంధించి యున్నవి, లేక వాటి అనుబంధములనిగాని, భాగములనిగాని ఊహిం చుటకు వీలుకల్గించునవి ఇవన్నియు దస్తావేజులక్రింద నే లెక్కింపబడుచున్నవి. సాధారణముగా కవిలె భాండాగారములలో మూడు రకముల దస్తావేజులు జమ అగుచుండును. (1) ఆఫీసు లోనికి వచ్చునవి. (2) ఆఫీసునుండి బయలు వెడలిన వాని ప్రతులు. (8) ఇతర కార్యాలయములతో రాకపోకల సంబంధము కలవి కాకున్నను, సదరు ఆఫీసులోమాత్రమే ప్రచారము కలవి. కవిలె భాండాగారికుని మొట్టమొదటి ధర్మము కవిలె భాండారములను భద్రపరచుటకును, తన అధీనములో నుంచుకొనుటకును వలసిన అన్ని విధములైన అధికార చర్యలను అనుష్ఠించుట. అనగా వాటి ముఖ్యలక్షణములను గూర్చి జాగ్రత్త వహించుటయై యున్నది. ఆతని రెండవ ధర్మముకూడ తుల్యప్రాధాన్యము కలదియే. తన శక్తి వంచన లేకుండ చరిత్రకారులకును, పరిశోధకులకును, అవసరమైన తోడ్పాటును కల్పించుట అతని రెండవ ధర్మము. కవిలె ఢాండాగారికుడు తన కవిలె భాండారముల యొక్క భౌతికము, నైతికమునైన రక్షణమునకు తగు శ్రద్ధను వినియోగించవలసి యుండును. కవిలె థాండా రములను వదిలవరచు గృహములు అగ్నిప్రమాదము నుండియు తేమనుండియు సురక్షితములుగా నుండవలెను. వీటిని పదిలపరచు భవనములు ప్రమాదములకు గురియగు