Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/611

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కల్హ ణుడు S అది పడిన గ్రంథములలో నీలమతపురాణ మొకటి. ఇప్పుడు ప్రచురింపబడి యున్నది. దానియందు చరిత్రాం శములకంటే, ఆ దేశమునందలి క్షేత్ర తీర్థాదుల వర్ణనమే విశేషముగ నున్నది. కల్హణునికి సామగ్రిగా నుపయోగ పడిన గ్రంథములలో నీ క్రింది వానిని పేర్కొనదగును. 1. శేజేమేంద్రుని నృపావళి. 3. పాశుపత హేలరాజ కృతగ్రంథముపై నాధారపడి రచియించిన పద్మమిహిరుని గ్రంథము. 8. చావిల్లి కరుని గ్రంథము. ఇవియేకాక కల్హణుడు శాసనములను, దేవాలయ ములు, ఇతర కట్టడములు నిర్మింపబడిన కాలములను, భూదాన పత్రములను, ప్రశస్తులను, ఇతర లిఖిత గ్రంథ ములను తాను పరీక్షించితినని తెల్పుకొనినాడు. ఇట్టి వాటి ప్రశంస ఈతని గ్రంథములో అనేక స్థలములందు కలదు. ఆతడు నాణెములను పరీక్షించి, కట్టడముల దగ్గరకు స్వయముగా పోయి పరిశీలించి, వాని నిర్మాణ కాలమును తెలిసికొనినట్లు దృష్టాంతములు కలవు. ఈ విషయము అన్నియు ఆతని చారిత్రకదృష్టికి తార్కాణ ములు, నిర్దుష్టమైన చరిత్రను వ్రాయుట అతని యుద్దేశ మైనట్లు స్పష్టము. శృంగార వీరరసములు రెండును ఈ ఈ గ్రంథమున కవి పోషించినాడు. వర్ణనలు కావలసిన పట్టున నాతడు దీర్ఘవర్ణనలు కావించినాడు. అనవసరమగు స్థల మున వర్ణనలు చేయలేదు. తనను రచనకు ప్రోత్సహించిన జయసింహునిపై "జయసింహభ్యుదయము" అను పేర నొక కావ్యమును కల్హణుడు రచించినట్లు రత్నాక రుడు తన “సారసముచ్చయము" లో ముల్లేఖించినాడు. ఈ రాజు తరంగిణిని వ్రాయుటకు రెండు సంవత్సరములు పట్టెను. కల్హణు డీ గ్రంథమును క్రీ. శ. 1148 లో ప్రారంభించి 1149 లో పూర్తి చేసెను. ఇక కల్హణుని రచనా విశేషములను పరికింతము. అతడు తన చరిత్రమును గోనందుడను రాజుతో నారం భించెను. అతడు కలిళకము 658 వ సంవత్సరమున సింహాసన మధిష్ఠించినట్లు తెలుపబడినది. అదియే యుధి ష్ఠిరుని పట్టాభిషేక సంవత్సరమని చారిత్రకులు తెల్పు దురు. ఇచ్చట కల్హణుడు చరిత్రకును, పురాణము నకును సంబంధము కలిపినాడు. గోనందుడు మధురా సంగ్రహ ఆంధ్ర నగరముపై దండి తెననియు, బలరాము డాతని చంపె ననియు ప్రతీతి కలదు. కృష్ణుడు, హతుడైన గోనందుని భార్యను రాణిగా చేసెననియు, అప్పటికి గర్భిణిగా నున్న గోనందుని భార్య యొక పుత్రుని కనెననియు, ఆ పుత్రుడే తరువాత రాజయ్యేననియు తెలుపబడినది. ఇది పుక్కిటి పురాణముగా కన్పట్టక మానదు. గోనందుని తరువాత ఏబదియిద్దరు రాజుల చరిత్ర నీవాడు తనకు పూర్వ గ్రంథ ములనుండి గ్రహించినాడు. నీలమన పురాణమునుండి మొదటి నల్వురి గాథను గ్రహించెను. తరువాత ముప్పది యైదుగురు రాజు లుండిరనితెల్పి, పదపడి ఎనమండుగురు రాజులను `హేలరాజు గ్రంథమునుండియు, తదుపరి ఐదు గురు రాజుల చరిత్రమును చావిల్లికరుని గ్రంథము నుండియు ఈ కవి గ్రహించెను. భారతీయ చరిత్రతో కాశ్మీర చరిత్రను కలుపుటకై, గోనంద యుధిష్ఠిరులు సమకాలికత్వము కల్పింపబడినది. రాజతరంగిణిలోని ప్రథమభాగమున (తరంగమున) అశోకుని ప్రశంస కలదు. అతనికి జలౌకుడను పుత్రుడున్నట్లు తెలుపబడినది. ఇది చారిత్రకముగ ధ్రువపడ లేదు. కుషాన్ రాజులైన హుష్క, జుష్క, కనిష్కుల ప్రశంస ఈ గ్రంథమున గలదు. వారు బౌద్ధులని తెలుపబడినది. వీరి వరుస తలక్రిందుగా నున్నది. ఈ భాగమున కొన్ని కథలు ఆకాలపు సంప్రదాయము ననుసరించి యున్నవి. బ్రాహ్మణుడగు అభిమన్యుడను రాజు కాలములో, బౌద్ధ స్పర్శచే అపవిత్రములైన తీర్థ ములు పవిత్రములు చేయబడినట్లు తెలుపబడినది. ఈ గ్రంథమున తెలుపబడిన రాజులు భిన్న వంశములకు చెందిన వారుగా కన్పింతురు. మొదటి ఏబది యిద్దరు రాజుల చరిత్రములోని సత్యాసత్యములను పరీక్షించుటకు కల్హ ణుని కవకాశములేకపోయెను. అందులకు సామగ్రియు మృగ్యము. కేవలము సంప్రదాయబద్ధముగా వచ్చు కథలను, అప్పటికి ప్రచారములోనున్న అసంపూర్ణ గ్రంథ ములను సామగ్రిగా నీ కవి గ్రహించెను. అశోకుడు క్రీ. పూ. 1200 వ సంవత్సరమున నుండెననియు, గోనంద వంశమునకు చెందిన రణాదిత్యుడను రాజు మున్నూరు సంవత్సరములు పాలించెననియు, మున్నగు నమ్మదగని యంశ ములిందు పొందుపరచబడినవి. ఇందులకై, కల్హణుని నిందింపరాదు. ఆకాలమున నట్టి నమ్మకములుండెననియు, 562. .