Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కల్పము కల్పము : "ళి, వ్యాకరణం, ఛన్ది, నిరుక్తం, జ్యోతిషం కథా కల్పశ్చేతి నడంగాని వేదస్యావ ర్మనీ ణం." అనునటుల వేదాంగములుగా కీర్తింపబడుచున్న షడంగ ములలో ఆరవయంగము కల్పము. పై గణనాక్రమమున . కడపటిదైనను, పురుషునకు హ స్తిమువలె, వేద పురుషు సకు హ స్తస్థానీయమై, పరమోపకారకమై యుండుటచే ఇది వేదాంగములలో ప్రధానమై అలరారుచున్నది. వేదపురుషునకు ఛందస్సు పాదములనియు, కల్పము హ స్తములనియు, జ్యోతిషము నేత్రములనియు, వ్యాకర ణము ముఖమనియు, "ఛన్దః పాదౌలు వేదస్య హ స్తః కల్పోఒథపఠ్యతే జ్యోతిషామయనం చదుఁ, ముఖం వ్యాకరణం స్మృతమ్.” అనుదానిచే తెలియుచున్నది. కనుక ఈ కల్ప విజ్ఞానము వైదిక విజ్ఞానమునకు కల్యాణకల్పకమై వెలుగొందు చున్నది. మరియు ఈ కల్పసూత్ర వాఙ్మయము వైదిక వాఙ్మ యమున విశేషస్థలము నాక్రమించుకొని యాజ్ఞి కాదు లకు అత్యంతోపకారియై వెలయుచున్నది. జ్ఞానమార్గ మెటుల ఆరణ్యకముల అంతిమ భాగమున అభివృద్ధమై, ఉపనిషత్తులుగా పరిణతిని చెందెనో, అటులనే కర్మమార్గము గూడ బ్రాహ్మణములయం దభివృద్ధమై, ఈ కల్పమున ప్రధాన విభాగమైన శ్రోతసూత్రములుగా పరిణతిని చెందెను. కానీ ఉపనిషత్తులకు సిద్ధించిన అపౌరుషే యత్వము గాని, వేదత్వము గాని వీటికి సిద్ధింపలేదు. కల్పము, సూత్రమయ గ్రంథనిబద్ద మగుటచే "కల్ప సూత్రములు" అను ప్రసిద్ధి గలిగియున్నది. ఈ కల్ప సూత్రములు — శ్రోత, గృహ్య, ధర్మ ప్రభేదముచే ముత్తె రగులుగ నున్నవి. అయినను, లోకమున శ్రోత సూత్రము లకే "కల్ప" మను ప్రసిద్ధి అధికముగా నున్నది. మెక్డొనిల్ (Mecdonell) మొదలగు పాశ్చాన్య విమర్శకులు నా స్త్రీకనతము లావిర్భ వించిన కాలమున బ్రాహ్మణులు స్వమత సిద్ధములైన ఆచార వ్యవహారములను సంరక్షించుటకై, యజ్ఞ సంగ్రహ ఆంధ్ర కర్మప్రయోగ వైశద్య సంపాదకములును, నిరవద్య హృద్య రచనాసమన్వితములును అగు ఈ కల్పసూత్ర ములను విరచించియుందురు. ఆ విశిష్టమైన | విశిష్టమైన సూత్రశైలీ నిథాగ్యమును నరికించి, ముగ్ధులై, బౌద్ధాదులను పార్టీ ప్రముఖములగు భాషలలో గనుకమ మక విషయముల ఏపుల ప్రచారమునకై ఆ సూత్ర శైలి సనుసరించుచు సూత్రగ్రంథములను నిరచించియుందురు" అని వక్షాణించు చున్నారు. యాగాది వైదిక కర్మాచరణము బౌద్ధాది మతా విర్భావకాలముననే తలయెత్తినదని నిరూపింపగలిగినచో వారి యూప సముచితమై యుండెడి దేమోగాని, అట్లు నిరూపించుటకు వలనుకుడదు. ఏలనన -ఋ గ్వేద సంహితా కాలమునకు మున్నే యాగాది కర్మము లాచరింపబడు చుండినటుల ఋక్ సంహితాదులవలననే స్పష్టముగా తెలియుచున్నది. సామ, యజుస్సంహితలును యజ్ఞాది కర్మాచరణ ప్రబోధకములై యుండుట సువ్యక్తమైన విషయమే, మరియును వైదిక మతమునకు ప్రతిపక్షిగా బౌద్ధాదిసుతములు బయలు దేరినవిగాని, బౌద్ధాదిమతము లకు ప్రతిద్వంద్విగా వైదిక మార్గ మావిర్భవింపలేదు. మంత్రములందు చెల్లాచెదరుగా నుండిన యాగాది కర్మములను బ్రాహ్మణములు కొంతవరకు విశద పరుపగా, కల్పసూత్రము లింకను విశదతరముగా ఎల్లయంశములను నిరూపించుచున్నవి. కల్పసూత్రము లన్నియును ఆయా శాఖల బ్రాహ్మణములను అనుసరించి వచ్చినవి. ఇవి యజ్ఞములంచు హోత, ఉద్గాత మొదలగు ఋత్విక్కులు చేయు కార్యములను బోధించుచున్నవి. 552 శ్రోతసూత్రములు పౌర్వాపర్యము : శ్రోతసూత్రముల పౌర్వాపర్య నిర్ణయమంత సులభసాధ్యమగు పనికాదు. ఋగ్వేదమునకు సర్వానుక్రమణీవృత్తిని విరచించిన షడ్గురుశిష్యుడు దాని అవతరణికలో "శౌనకస్యతు శిష్యోభూత్, భగవాన్ అశ్వలాయనః" అని కీ ర్తించి యున్నాడు. దానినాధారముగ జేసికొని ఆశ్వలాయనుడు శౌనక శిష్యుడను సౌక ప్రతీతియు, ఐతరేయారణ్యక మున పడునేను వాక్యముల నాల్గవ అధ్యాయమును ఆశ్వలాయ నుడు విరచించెనని మరియొక ప్రతీతియును బయలు దేరినవి. కాత్యాయనముని ప్రశంసకై అవతరించిన షగ్గురు