విజ్ఞానకోశము - - హైదరు కర్నూలు జిల్లాను వశపరచుకొనెను. అప్పటికే నైజాం స్వతంత్రుడై తన రాజ్యమును వశపరచుకొనుట జరిగినది. నేటి కర్నూలుజిల్లా దండకారణ్యములో నొక భాగ ముగ నుండెననియు, రాక్షసుల సామ్రాజ్యమున కొంత కాలముండెననియు, ఆర్య నాగరికతా ప్రభావము ఇచట 'మెలమెల్లగ వ్యాపించెననియు ఒక ఒక ప్రతీతి కలదు. సీతాదేవిని వెదకుటకై పంచవటినుండి కిష్కింధకు వెళ్లుచు శ్రీరాముడు ఈ ప్రాంతమందు అడుగిడెనని చెప్పుకొందురు. కంచిని దర్శించుటకై హ్యుయాన్ త్సాంగ్ కర్నూలు మీదు గనే ప్రయాణించెనట! మార్కాపురంజిల్లా త్రిపురాంతక గ్రామములోని శాసనమొకటి విక్రముని పేరిట కనిపించు చున్నది. ఈ భాగము క్రీ. శ. 5వ శతాబ్దమునుండి 10వ శతాబ్దమువరకు చాళుక్యుల స్వాధీనమందున్నట్లు తెలియు చున్నది. కుంతలదేశమందున్న (Modern Deccan) ఒక శిలాశాసనము వలన ఈ కర్నూలుజిల్లా క్రీ. శ. 1059 పొంతమందు కంచి చోళ రాజు యొక్క స్వాధీనమం దున్నట్లు అధికారపూర్వకమైన ఆధారమొకటి కలదు. గో రెంట్ల దేవాలయమునందలి శాసనమువలన స్థానికులైన యాదవులు చాళుక్య విక్రమునకు కొన్ని బాధలు కలిగించి నట్లు తెలియుచున్నది. తరువాత కాకతి గణపతిదేవుడును, రెండవ ప్రతాపరుద్రుడును తమ అధికారమును జిల్లా యంతటను సాగించిరి. క్రీ.శ. 1686 వ సం. బీజాపూరు సుల్తానులనుండి ఈ ప్రాంతమంతయు ఢిల్లీ చక్రవర్తికి స్వాధీనమయ్యెను. ఆతరువాత కర్నూలుజిల్లా స్థానిక రాజులచేతను, పాలెగాండ్ర చేతను, ఖండ్రిక లుగా పరిపా లింపబడి కొంతకాలము హైద్రాబాద్ నవాబు స్వాధీన మందుండి చివరకు ఈస్టిండియా కంపెనీవారికి దత్త మయ్యెను. 1800-01 నాటికి అది బ్రిటిషువారి సామ్రాజ్య ములో నొక భాగముగా నేర్పడెను. L క్రీ. శ. 11 వ శతాబ్దమునుండి సాంస్కృతిక రంగమందు ఈ జిల్లాకొక ప్రత్యేకత కనిపించుచున్నది. మల్లి కార్జున పండితుని గ్రంథములు మొదలుకొని అనేక ప్రసిద్ధాంధ్ర రచనలు ఇచ్చట సాగింపబడెననియు, పింగళి సూరన్న వంటి కవిముఖ్యులకు కొంతకాలము ఈ జిల్లా నివాసస్థానమయ్యే ననియు చరిత్ర చాటుచున్నది. 547 కర్నూలు జిల్లా కర్నూలుపట్టణము : ఈజిల్లాకు కేంద్రస్థానము కర్నూలు పట్టణము. కేంద్రప్రభుత్వము యొక్క శాసనము ననుస రించి 1953 అక్టోబరు ఒకటవ తేదీ మొదలు 1956 నవంబరు ఒకటవ తారీఖుపరకు (హైద్రాబాదు రాజధానిగా ఆంధ్ర ప్రదేశ రాష్ట్రము ఏర్పడువరకు) ఆంధ్రరాష్ట్రమునకు కర్నూలు రాజధానిగ నుండెను. కర్నూలుపట్టణము సముద్రమట్టమునకు 900 అడుగుల ఎత్తుననుండి ప్రాగుత్తర దికలయందు తుంగభద్రానదిచేతను, దక్షిణమందు హంద్రి నది చేతను, పశ్చిమమందు కడప కర్నూలు కాలువ చేతను కూడుకొనియుండి సహజ ప్రకృతిసౌందర్యముచే కళకళలాడుచు నొక ద్వీపమువలె విలసిల్లుచున్నది. ఈ పట్టణపు వైశాల్యము 3.75 చ॥ మైళ్ళు. జనసంఖ్య 60,222. ఇందు పురుషులు 30,839 మంది, స్త్రీలు 29,588 మంది (1951). ఈ . చాళుక్యరాజులు 11 వ శతాబ్దమందు ఇచ్చటికి 7 మైళ్ల దూరమందున్న అలంపూరు (ఇది దక్షి. కాశియని ప్రసిద్ధి) లో దేవాలయనిర్మాణము చేయునపుడు రాళ్ళకొరకు బండ్లు ఇపుడున్న కర్నూలు ప్రదేశమునకు తుంగభద్రను దాటి వచ్చెడివనియు, కొంత విశ్రాంతి తీసికొన్నతరువాత బండ్లను తోలువారు తమ బండ్లకు కందెనవేసికొని పోవుచుండి రనియు అందుచేత ఆప్రదేశము “కంచెనమెట్ట" అని వ్యవహరింప బడినదనియు ఒకటి రెండు కుటుంబములు ఏర్పడుటచేత అది "కందెనపల్లి” గా మారినదనియు తెలియుచున్నది. ఆ తర్వాత "కందెనోలు, కందెనవోలు" గాను బ్రిటిషు వారిమూలమున "కర్నూలు”గాను మార్పు చెందినది. కొన్ని శాసనములలో "కన్నాడు" అని కూడ వ్యవహరింపబడినది. కొందరు కల్లు = రాయి, నాడు= భూమి అను రెండు పదముల కలయికచే నేటి కర్నూలు అనుపద మేర్పడె ననుచున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలమువరకు కర్నూలునకు ఒక ప్రత్యేకత లేదు. ఆయన అనంతరము వచ్చిన అచ్యుత రాయలు కర్నూలుకోటను కట్టించినాడు. 1590 లో రామ రాజు మనునుడైన గోపాలరాజునుండి కర్నూలును స్వాధీన పరచుకొనుటకై బిజాపూర్ నవాబు అబ్దుల్ వాహబ్ అను అబిసీనియాదేశస్థుని పంపెను. ఆయన కర్నూలు పట్టణమును అభివృద్ధిపరచెను. రాజవీథిలో కమానులతో
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/596
స్వరూపం