విజ్ఞానకోశము - 7. పనితనమును పరీక్షించు దశలు, 8. సిద్ధము చేసికొనవలసిన ప్రత్యేక పనిముట్లు. ఉత్పత్తికి సంబంధించిన గుణము ఈ క్రింది నాలుగు శీర్షికలలో విభజింపబడును. 1. భౌతిక గుణములు 2. ఉత్పత్తి పరిమాణములు 3. పూర్తి తయారీ (Finish) 4. పని నిర్వహణము. ఈ శీర్షికలలో ఒక్కొక్క దానిక్రింద ఉత్పత్తి సామర్థ్య మును బట్టి ఒక గుణప్రమాణము నిర్ణయింపబడి, తనిఖీ చేయబడి సరిచూడబడును.
పనిని అమలులో పెట్టు పద్ధతి అనగా పురమాయింప బడిన వస్తూత్పత్తిని పూర్తిచేయుటకు వలసిన అన్ని పనులను ఏక కాలమున సమీక్ష చేయుట, అనవసరమయిన కార్య కలాపమును తగ్గించి, సప్రమాణమయిన కార్యక్రమమును నిర్ణయించుటకై, కాలము యొక్కయు, చలనము యొక్కయు పరిశీలనము అపేక్షితమగుచున్నది. ఇట్టి పనిని సాధించు నిమిత్తము కార్యవివరణ పత్రము (process chart), విపుల చిత్రము (fow diagram) తయారు చేయబడును. ఎనుము చర్మముతో చేయబడిన బప్ఫింగ్ చక్రములకు (buffing wheels) కురువిందళిలా చూర్ణ ముతో మరల పూత పూయుటకై ప్రోసెస్ చార్ట్, ఫ్లోయింగ్ డయాగ్రమ్ చూపబడును.
ప్రగతి నియమనము : జాబితా ప్రకారము ఉత్పత్తి వస్తువులను అప్పగించుకొనుట ప్రగతినియమనము యొక్క ఉద్దేశమైయున్నది. ప్రగతియందున్న పనివలన లాభమును సాధ్యమైనంత శీఘ్రముగా పొందుట, యంత్రపు పనివాని కాలము వ్యర్థముకాకుండ చూచుట, సక్రమముగ నిర్వ హింపబడిన ప్రగతినియమనము యొక్క ఫలితములు. ఇందుకొరకు నిర్దిష్ట విధానమున కార్మికుల యొక్కయు, యంత్రముల యొక్క యు ఈక్రింది వివరణపత్రిక (man and machine chart) ఉపయోగింపబడును. ఉత్పత్తి సామర్థ్యము (turnover efficiency) యొక్క మరియొక 'ముఖ్యాంశము ఉత్పత్తియందు సమ తూకమును (balancing) ఏర్పరచుటయైయున్నది. గొప్పగొప్ప ఉత్పత్తి కర్మాగారములయందు 'ఛేజర్స్' 533 కర్మశాల నిర్వహణము (chasers) అను ప్రత్యేకోద్యోగులు నియమింపబడుదురు. నిర్ణయింపబడిన జాబితా ప్రకారము క్రమవిధానములో పని జరుగుచున్నదో లేదో కనిపెట్టుచు, లోపములను సరిదిద్దుచు, పనియందలి ఆలస్యమును పై అధికారులకు తెలియజేయుచుందురు. ప్రోగ్రెస్ ఆఫీసు (అభివృద్ధిని రికార్డుచేయు కార్యాలయము) సందుంచబడిన 'గాంటు' వివరణ పత్రికను (gantt chart) పరిశీలించినతోడనే, వేరువేరు శాఖలలోని పనులన్నియు ఎట్లు నడచుచున్నవో స్పష్టమగును. వస్తు నియమనము కొనుగోలు : ఈ అంశము ఆరు ప్రధాన శీర్షికలక్రింద విభజింపబడినది. (1) ఎన్నుకొనుట (2) వ్యయనిరోధము నిలువసరకును అదుపుచేయుట (4) సరకులను నిలవచేయుట (5) కొనుగోలు (8) రవాణా. ఎన్నుకొనుట సరకులను ఎన్నుకొనుట నిర్వహించి దలచిన పనిపై ఆధారపడియుండును. వ్యయనిరోధము : అవసరమైన ముడిసరకుల పరిమాణ మును ముందుగా అంచనా వేయుటవలన ఈపనిచేయుట సాధ్యమగును. నిలువసరకును ఆదుపుచేయుట: అమ్ముడుపోక నిలువ సరకు రూపములో 'పెట్టుబడి ధనము చిక్కుబడి, ఆ సర కులవిలువ కాలక్రమమున తగ్గుట ఒక్కొక్కప్పుడు తట స్థించును. కావున సరకును నిలువచేయుటలో వివేకముతో తగు సుపాయము వెదకుట మిక్కిలి ముఖ్యమైన విష యము. కాబట్టి ఈ విషయములో నిలువచేసికొనవలసిన కనిష్ఠ, గరిష్ఠ, పరిమాణపు సరకుల జాబితాను అప్పు డప్పుడు తయారు చేసికొనుటచే ఈకార్యము సాధ్య మగును. పరకులను నిలువచేయుట: పదార్థములను సేకరించి భద్రపరచుట ఈ కార్యక్రమములో ప్రధానాంశము. తర చుగానిత్యోపయోగములో నుండుసరకులను ముఖ్యమయిన జనరల్ గిడ్డంగులలోను, నూనె, కలప, బొగ్గు మున్నగు వస్తువులను అప్రధానమైన గిడ్డంగులలోను, తయారైన