Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/579

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కమీనియస్ జాన్ అమస్ దీనియందు ఒక్కొక్క చిత్రమునందు వివిధ వస్తువులను, నానిపై కొన్ని సంఖ్యలను వ్రాసి, వాని సహాయమున వస్తువులకు సంబంధించిన పదములను తెలియజేసెను. ఇట్లు పటముల సహాయమున బాలురకు భాషాబోధనము చేయుటలో నీ గ్రంథమే మొట్టమొదటిది. నేటికాలమున చిన్నపిల్లలకు బొమ్మలు లేని పుస్తకము అరుదైనవి. ఈ పద్ధతికి మూలపురుషు డీ మహానుభావుడే. కా 2 ఇట్లితడు భాషాబోధన పద్దతులపై పరిశోధనలను సల్పుచు గ్రంథరచన జేయుచు, సమగ్ర విద్యావిధానమును గురించి యోచించుచునే యుండెను. ఈశని విద్యావిషయ కాభిప్రాయముల నన్నిటిని “మహాబోధనము” (Great- Didactic) అను గ్రంథమున వెల్లడిచేసెను. దీనియందు కమీనియస్ తన స్వంత యభిప్రాయములనేగాక, ఇతని పూర్వపు “ఇంద్రియ వాస్తవికాదుల" (Sense Realists) సూత్రములనుగూడ గ్రహించి, సక్రమబోధన విధానమందు అన్నిటిని పొందుపరచెను. ఈ గ్రంథము నీతడు మొదట మొరేవియా భాషయందే వ్రాసి, 1657 లో లాటిన్ లో నికి భాషాంతరీకరించి ప్రకటించెను. విద్యాబోధనమును గురిం చిన ఈతని సర్వసూత్రములును, అభిప్రాయములును దీనిలో మనకు తెలియుచున్నవి. ఈతడు ఈ గ్రంథము నందలి శిశుశిక్షణ సంబంధమగు సూత్రములను విపులీక రించి యొక ప్రత్యేక “సహాయ గ్రంథము” (Hand book) ను, "జాన్యువా" పద్ధతిపై మాతృభాషా వాచక ములను గూడ రచించెను. (1) ఈతని విద్యావిధానము : ప్రతి వ్యక్తికిని సకల విషయములను గురించిన ప్రాధమిక జ్ఞాన మావశ్యకమని ఈతని మతము. ఈ"సక లవస్తుజ్ఞానము" (Pausophie) ను గురించి కృషి చేసి రచించిన గ్రంథమంతయు “లెజ్నో” పట్టణమును పోలెండుదేశీయులు తగులబెట్టినపుడు నాళన మయ్యెను. వృద్ధాప్యమున దాని నంతటిని తిరుగ వ్రాయ జాలడయ్యెను. (2) త్రివిధ విద్యోద్దేశములు : విద్యకును, మతమున కును సన్నిహిత సంబంధము కల్గించి మానవసంస్కారము గావింపవలెనని సూచించెను. “మహాబోధన" మను గ్రంథ మున అనేక అధ్యాయములలో ఈ విషయము ' నిట్లు తెల్పెను. (2) సృష్టిలో మానవుడే ఉత్కృష్టుడు. 530 సంగ్రహ ఆంధ్ర (b) మానవ జీవిత పరమార్థము జీవితానంతరముతో సంబంధించినది. (e) ఐహిక జీవితము అముష్మిక జీవితము నకు సిద్ధపరచును. (d) ఇందులకు మానవ పురోగమనము మూడు దశలలో జరుగును. ఆత్మజ్ఞానము, ఆత్మవిజయము, డై వోపగమనము. (e) ఇందులకు విద్య, శీలము, మతము సాధనములు. ఇట్లు విద్య యొక్క త్రివిధోద్దేశములను జ్ఞానము, శీలము, భక్తి యని నుడివెను. దేహళోషణము వలన గాక, మనో విజయమువలన నీ లక్షణములను సాధింప వలెనని యీతనియభిప్రాయము. దీనికై బాల బాలిక లంద రికిని "సార్వజనీన విద్య" యావశ్యకము. 3. పాఠశాలలందు నాలుగు దశలు: ఈతడు విద్యా భ్యాస కాలమును ఆరేసి సంవత్సరముల చొప్పున ఉ దళ లుగా విభజించెను. (a) పుట్టినప్పటి నుండి 6 సంవత్సరములు వరకు తల్లి యొడిలోని పాఠశాల. (b) 6 నుండి 12 సంవ త్సరముల వరకు ప్రాథమిక పాఠశాల, (C) 12 నుండి 18 సంవత్సరముల వరకు ఉన్నత పాఠశాల. (d) 18 నుండి 24 సంవత్సరముల వరకు కళాశాల. మొదటి దగు "తల్లి యెడి పాఠశాల" ప్రతి యింటను ఉండవలెను. దీని యందు శిశు మానసికళ కి కి తగినంత గణితము, భూగో ళము, చరిత్ర, వ్యాకరణము, జ్యోతిషము, అర్థశాస్త్రము బోధింపదగును. ఆటపాటలు, నిర్మాణ కార్యక్రమము మూలమున బాలురు విషయములు కార్యకారణ సంబంధ ములను తెలిసికొని అభిప్రాయ ప్రకటన గావింపగల్గుట, సదభ్యాసములను అలవరచుకొనుట ఈ దళ యందలి లక్ష్య ములు. రెండవదగు ప్రాథమిక పాఠశాల ప్రతి పల్లె యందును ఉండవలెను. దీనియందు మాతృభాషలో విద్యాబోధనము జరుగవలెను. ఇంతటితో సమాప్తి చేయు బాలురకు ప్రణాళికలోని విషయములే గాక, వాఙ్మ యము, మతవిద్య, నీతివర్తనము బోధింపవలెను. తమ దేశము వరకు భూగోళము, చరిత్ర అతి సామాన్య యంత్ర సంబంధ మగు జ్ఞానమునుగూడ బోధింపవలెను. ఉన్నత పాఠశాలలో లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను, వృత్తివిద్యను బోధింపవలెను. ఈ పాఠశాలలు పట్టణమందును ఉండవలెను. కళాశాలలు ప్రతి రాష్ట్రము నందును ఉండవలెను. విపులమగు ప్రణాళిక గల్గి ప్రజ్ఞా వంతులగు విద్యార్థులు కళలను, శాస్త్రములను సభ్య ప్రతి