Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/575

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవీరు కనుగొనినాడు. వృత్తిలో ప్రవేశించి 30 వ రెజిమెంటుతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళి 1828 లో ఆ దేశ నైసర్గిక వివరములు తెలిసికొనుటకు ప్రయత్నించి ముందు డార్లింగు నదిని తరువాత అలెగ్జాండ్రినా సరస్సు యొక్క ఉనికిని కనిపెట్టి నాడు. మూడవ పర్యాయము ముర్రే నదీలోయను కని పెట్టుచుండగా (1844-1845) అనేక శారీరక క్లేశముల ననుభవించి, దృష్టి భాగ్యమును పోగొట్టుకొనెను.. చివర వరకు అతనికి కనుచూపు లభించలేదు. ఇతడు దక్షిణ ఆస్ట్రేలియాకు సర్వేయరు - జనరలుగా 1888 లో నియ మింపబడినాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వము వచ్చిన తరు వాత 1850 వరకు ఛీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు. కప్తాన్ ఛార్లెస్ స్ట్రట్ ఇంగ్లాండులో చెల్టన్ హాంలో 1889 జూన్ 16 వ తేదీన మరణించాడు. కప్తాజా జేమ్స్సక్ : పు, హ, రా. కప్తాన్ కుక్ పేరుపొందిన నావికుడు. ఇతని జీవితము సముద్రయానమునకు, కొత్తకొత్త ద్వీపములను, ప్రదేశ ములను కనుగొనుటకు అంకితమైపోయినది. ఇతడు క్రీ.శ. 1728 లో ఇంగ్లండులో జన్మించినాడు. ఇతనికి 'ఎండవర్ ' అనెడు సొంతఓడ ఒకటి యుండెను. అదే అతని ప్రియతమ మైన యానసాధనము. ఆ 'ఎండవర్ ' లో ఎక్కి తన జీవిత కాలములో మూడుసార్లు సముద్రాలమీద పయనించి నాడు. మొట్టమొదటిసారిగా 1788 లో ఇంగ్లండులో బయలుదేరెను. అతని ప్రయాణము దక్షిణ పసిఫిక్ మహా సముద్రముమీద. అక్కడ తిరుగుచు తిరుగుచు పెక్కు ద్వీపములను కనుగొన్నాడు. న్యూజిలాండ్ చుట్టును ప్రయాణముచేసి 'చాటనీ దగ్గర ఆగి గుడ్ హోప్ అగ్రముమీదుగా ఇంటికి చేరుకొన్నాడు. ఇది మొదటి ప్రయాణము. రెండవ ప్రయాణము 1772లో జరిగినది. ఈసారి కొత్తప్రదేశాలను, కనుగొన్న ద్వీపాలను గూర్చి నికరమైన అంచనా వేసుకోవాలనే ఆశయము అతనిది, ఈ ఆశయముతోనే అంటార్కిటిక్ సముద్రము దాక ప్రయాణముచేసి దక్షిణాఫ్రికా మీదుగా మళ్ళీ ఇంటికి తిరిగివచ్చినాడు. మూడవసారి ప్రయాణము 1776 లో జరిగినది. ఇదే అతని జీవితములో చివరి ప్రయాణము. ఈసారి అతని ముఖ్యాళయము ఫసిఫిక్ సముద్రములో లో 526 సంగ్రహ ఆంధ్ర ఉత్తర పశ్చిమాలుగా ఒక దారి కనుగొందామని అట్లా బయలుదేరి బేరింగ్ స్ట్రెయిట్ అంతయు అవలోకనము చేయుచు, కన్ఛాట్టా (Kam Chatka), అలూషియన్ ద్వీపాలు తాకుచు, ఇంటికి వస్తూవస్తూ దారిలో హవాయి ద్వీపములో ఆగినాడు. ఆ ద్వీపవాసులకును, అతనికిని జరిగిన సంఘర్ష ణములో కప్తాన్ జేమ్సుకుక్ వారికి దొరికి పోయినాడు. వారిచేత ఘోరముగా చంపబడినాడు. కబీరు : నా. కృ, కు. ప్రసిద్ధ హిందీకవులలో రబీ రాకడు. ఇతడు హిందీ సాహిత్యమున నిర్గుణ శాఖకు సంబంధించిన భక్తి వాఙ్మయ ప్రవర్తకుడుగ భావింపబడుచున్నాడు. అతడు అసాధారణ శక్తి సంపన్నుడు; సంఘసంస్కర్త; సూఫీ వేదాంతి యని ముస్లి ములును, ఏకేశ్వరోపాసకుడని హిందువులును భావించుచున్నారు. ఇతడు హిందూ-ముస్లిం మత సామ రస్యమును చేకూర్చినవారిలో నగ్రగణ్యుడు. ఇతని జనన మరణ స్థల కాలములను గుఱించి వాద ములు కలవు. ఇతని జన్మస్థానము మగహర్ అని కొందరు, ఆజమ్గఢ్ కు చెందిన బలహరా గ్రామమని కొందరు, కాశీ యని కొందరు భావించుచున్నారు. కానీ ఇప్పుడు లభించుచున్న ఆధారములను బట్టి కబీరు విక్రమశకము 1455 లో కాశీలో జన్మించెనని పెక్కురు నమ్ముచున్నారు. ఇతడు ప్రహ్లాదుని అపరావతార మనియు, వైష్ణవ మత ప్రవక్త యగు శ్రీ రామానందులవారి యాశీర్వాద ముచే హిందూదేవాంగ స్త్రీ యగు ప్రతిచి యను వితంతు గర్భమున జన్మించెననియు ప్రతీతి కలదు. ఆమె తనకు గలిగిన విపత్తునకు వగచి, లోకభీతిచే నా శిశువు నెత్తుకొని పోయి శాశీకి సమీపమున నున్న 'లహర్ తారా' అను చెరువుగట్టుపై నొక తామరాకుపై నుంచి నిశీధమున పారిపోయెను. ఆ మార్గమున పోవుచున్న నూర్ అలీ, నీమా యను మహమ్మదీయ దంపతు లా శిశువును భగవ త్ప్రసాదముగా భావించి, పోష్యపుత్రునిగా పెంచి, ఆ యూరి కాజీచేత 'కబీర్ ' అని నామకరణము చేయించిరి. ఈ వృత్తాంతమును గూర్చిన సత్యాసత్యము లెట్లున్నను కబీరును పెంచినవారు నూర్ అలీ, నీమా దంపతు లనుట నిర్వివాదము.