కపోతేశ్వర క్షేత్రము సహస్రలింగ శిలావిగ్రహమును, నైరృతీభాగమున సప్త మాతృకల శిలావిగ్రహములను కలిగియున్నది. దీనికి దక్షిణమున నున్న 'మల్లి కాగుంట' మను పుష్కరిణి, పశ్చిమముననున్న తటాకమును పేర్కొనదగినవి. ఈ గుడి ప్రక్కన నొక వాగు కలదు. దానిని 'ఓగౌరని పిల చెదరు. దీని అసలు పేరు ఓంకారనది యనియు, పూర్వ మిచట మునులాచరించిన యభిషేకజలము నదీరూపమున ప్రవహించెననియు దీని పూర్వగాథ. ఇచ్చట శివరాత్రి, ముక్కోటి ఏకాదశి పుణ్యపర్వములం దుత్సవములు జరుగుచున్నవి. పూర్వమునుండి ఇది నరసరావు పేట జమీందారులగు శ్రీ శ్రీ మల్రాజువారి యాధిపత్యమున నుండెను. క్రీ. శ. 1950 ప్రాంతమున ప్రభుత్వ దేవాదాయ శాఖ క్రిందికి వచ్చినది. కపోతేశ్వరాలయమునకు ముందు భాగమున 1988 వరకు నొక గొప్ప వృక్షముండెను. దాని యాకులు బిల్వ దళములవలె 3 చీలికలు మొదలు 11 చీలికలవరకు బేసి సంఖ్యలో చీలి యుండెడివి. ఆ చెట్టున అనేక విధములగు పూవులు పూచెడివి. కాయలు, పిందెలు ఎన్నడును కన పడవు. 12 సం. ల కొకసారి ఒక ఫలము కాయు ననియు అది దేవతలచే నీశ్వరునకు సమర్పింపబడుచుం డెననియు వాడుక. ఈ వృక్షమును 'పేరులేని పెద్దమాను' అని జనసామాన్యము వ్యవహరించుచుండెను. మొదలునం చొక యుండెను. అందుండి భూమిలో సొరంగము లుండెననియు, అం చొకత్రోవ గుత్తి కొండకు, మరియొ కటిశ్రీశైలమునకు, వేరొకటి శాశీ క్షేత్ర మునకు గొంపోవు ననియు ప్రసిద్ధి. 1881 So. వరకు ఈ మ్రాని సంగ్రహ ఆంధ్ర య్యగారు అనునొక సిద్ధపురుషు డీ క్షేత్రముస నే విశేష ముగ నివసించుచుండెను. ఆ మహనీయుడు జనులు చూచుచుండగనే ఈ చెట్టుతొర్రలోనికిపోయి అదృశ్యు డగుచుండెను. తిరిగి 6 నెలలకో, సంవత్సరము నకోఅందుండి వెలుపల వచ్చువాడట. ఆ మధ్య కామ కొందరు కాశి యందును, కొందరకు శ్రీశైలముందును, మరికొందరకు గుత్తికొండ యందును శ్రీ బుచ్చయ్యగారు దర్శన మిచ్చుచుండిరట. పైని చెప్పిన పేరు లేని పెద్ద మ్రాను గత రాక్షసనామ సంవత్సరమున ప్రజానీకమునకు వింతకొల్పుచు భస్మమయ్యెను. ఎట్లన : మొదట సన్నకొమ్మలు పెద్దకొమ్మలలోనికి ప్రవేశించెను. పెద్దకోమ్మలు మ్రానిలోనికి ముడుచుకొని ఒక పెద్ద మొండెమువలె తయారయ్యెను. అంతట దిక్కులు పిక్కటిల్ల ఫెళ ఫెళ ధ్వనితో ఆ మ్రాను ఉత్తర దక్షిణ ములుగ క్రిందపడెను. సుమారు మూడుమానికల నెత్తురు క్రిందపడెను. అందుండి స్వయముగనే అగ్ని రగుల్కొని మ్రాను తగులబడజొచ్చెను. అది తగులబడినంత సేపు శవ దహనమువలె దుర్వాసన నలుగడల వ్యాపించెను. ఈ యద్భుతస్థితిని జూచుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చి ఆశ్చర్య విషాదములను చెందిరి. సుమా రది పది పదునై చుదినములు తగులబడి బూదియయ్యెను. ఈ లక్షణ ములను బట్టి ఆ వృక్ష రాజము శాపగ్రస్తుడగు మానవుడో, దానవుడో యుండునని తోచె డిది. ఇప్పుడా చెట్టుం డిన ప్రదేశముతక్క తక్కిన చెవ్వియు న రావు. చేజెర్ల యొక పురాతన దుర్గము. పల్లవు లిప్రాంతము బాలించినట్లు శాస నాధారములు కలవు. ఆనందఋషి తి గోత్రజుడును, అత్తి జీవించియున్న శ్రీ తుంగదుర్తి బుచ్చ కపోతేశ్వర క్షేత్రము వర్మ తండ్రియు 524
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/573
స్వరూపం