కన్ఫ్యూషియస్ ముద్దణు డనునది కావ్యనామము. ఈ కవి హళగన్నడ మున రెండు గద్యకావ్యములను రచించి, కన్నడ గద్య రచనా పద్ధతిలో క్రాంతి చేకూర్చెను. ఇతడు రచించినది ప్రాచీనమైన రామాయణ విషయము. ఉపయోగించినది "హళగన్నడ" భాష. ఐనను ఇతని శైలియందు నవీన సంప్రదాయము గోచరించుచున్నది. భరతవర్షమునందు అన్ని ప్రాంతములలోను ఇంగ్లీషు సాహిత్య వ్యాసంగమువలన, నవసంప్రదాయములు సాహిత్యములో అడుగు పెట్టినవి. పాశ్చాత్య సంస్కృతి నాగరకతా ప్రభావము మన దేశమునందలి అన్ని ప్రాంత ములపై సహజముగ ముద్రిత మయ్యెను. దీని పరిణాము ముగ నవీన సంస్కారములు, నవీన భావములు, జనిం చెను. ప్రాచీన సంప్రదాయములు, పద్ధతులు, ప్రాత నడ వడికలు మనదేశము వారికి రుచించవయ్యెను. జీవన విధాన ములో, ఆచార వ్యవహారములో, విచారసరణిలో మార్పులు కలిగెను. వాటి యొక్క పరిణామము సాహిత్య మునందును కలుగుట సహజము. ఇంగ్లీషు సాహిత్య వ్యాసంగ ప్రభావముతో ఆ సాహిత్యమునందుగల స్వాతం త్ర్యము, వై విధ్యము, సౌందర్యములను సాహిత్యములో ప్రవేశ పెట్టుటకై కొన్ని ప్రాంతములలో ప్రయత్నములు జరిగెను. యువకులు, వయస్కులు అందరు నవీన మార్గా న్వేషణముకొరకు ప్రయత్నించిరి. ప్రొ. బి. యమ్. శ్రీకంఠయ్యగారు ఇంగ్లీషు "గితెగుళు” అను ఇంగ్లీషు భావగీతములను కన్నడములోనికి అనువదించిరి. కన్నడ కావ్యప్రపంచమున విశేష క్రాంతికి కారణమైనది. ప్రాచీన ఛందస్సు నాధారముగ గొని నవీన ఛందోవిధాన ములను కనిపెట్టి ఈ కృతిలో ధైర్యముగ ప్రకటించిరి. ఆ మార్గము వనుసరించి కన్నడభాషయందు అనేకకవులు కవిత్వమును సాగించిరి. కె. వి. పుట్టప్ప, వి. సీతా రామయ్య, గోవిందపాయ్, శంకరథట్టు, డి. వి. గుండప్ప' మాస్తి వేంకటేశయ్యంగారు, జేన్ద్ర, పూ. 8. నరసింహా చార్యులు మొదలయిన ప్రతిభావంతులగు కవులు కన్నడ మందు శ్రేష్ఠమైన భావగీతములను, దీర్ఘగీతములను రచిం చిరి. ఆధునిక కావ్యప్రపంచమును ప్రవర్ధమానము చేసిరి. కె.వి. కె. వి. పుట్టప్ప (కావ్యనామము కువెంపు) వ్రాసిన శ్రీ రామాయణదర్శనము మహాకావ్యమని ప్రసిద్ధి కాంచీ ఆ ఇది 514 సంగ్రహ ఆంధ్ర నది. సామాజిక నాటకములు. విడంబనములు, సమాజ మందున్న లోపములను నిషేధించుటకై వ్రాయబడు చున్నవి. 'కైలాసము, బేన్దె. ఆర్. వి. జాగిర్దారు, శివ రామకరంతు, మొదలగువారు ఉ తమ సామాజిక నాటక ప్రణేతలుగా వాసిగాంచిరి. కథానికలలో మాస్తి వేంక టేశయ్యంగారి పేరు అగ్రగణ్యమై యున్నది. నవలా రచన ములో (కాదంబరి) శివరామకరంతు, కె. వి. పుట్టప్ప, ఇనాందారు, నిరంజను (తా. రా. సు.) మొదలగు వారు సుప్రసిద్ధులు. జీవిత చరిత్రలు, విమర్శన గ్రంథములు, వైజ్ఞా. నిక గ్రంథములు, కన్నడమందు అసంఖ్యాకములుగా వ్రాయబడుచున్నవి. కన్నడ సాహిత్యము జైన సాహిత్య మనియు, వీరశైవ సాహిత్యమనియు, బ్రాహ్మణసాహిత్య మనియు, ఆధునిక సాహిత్యమనియు, సామాన్య విభాగము లున్నవి. కన్నడమున అలంకార గ్రంథములు, వ్యాకరణ గ్రంథములు, రసప్రక్రియల ప్రతిపాదించు గ్రంథములు, కోళములు, వేదాంత, వైద్య, ఆయుర్వేద, హస్తి-గజ, గోవైద్య, జ్యోతిశ్శాస్త్ర, గణితశాస్త్ర, సూపశాస్త్ర, సంగీతశాస్త్ర విషయములను గూర్చి ప్రాచీన కాలమునుండి అనేక గ్రంథములు రచింపబడినవి. అండయ్యకవి సంస్కృత శబ్దములను ఉపయోగింపక ("కబ్బిగరకావము" అను కావ్యమును వ్రాసినసంగతి ఈ మొదటే చెప్పబడియున్నది) సంస్కృత కన్నడ శబ్దముల మిశ్రణమును ప్రాచీనకవులు కటువుగా నిషేధించిరి. వీటి యొక్క మిశ్రణము ముత్యాల, మిరియాల పోలిక వంట దనియు, మృతతై ల మిశ్రణమువంటి దనియు ఖండించినారు. ఇటీవల కవులు సాధ్యమైనంతవరకు దేశ్యపదములనే వాడుచున్నారు. భారతదేశమునకు స్వాతంత్ర్యము లభించిన తరువాత కన్నడ సాహిత్యమునందు రాష్ట్రీయభావము లెక్కువగా ప్రతిబింబితము లగుచున్నవి. కన్ఫ్యూషియస్ 8. a. b. చీనా విజ్ఞాన ప్రపంచమునకు ధ్రువతారయై వరలిన పురుషుడగు కన్ఫ్యూషియస్ క్రీస్తునకు పూర్వము 550 వ సంవత్సరమున లూ అను రాష్ట్రములో జన్మించెను. ఈతని తండ్రి పేరు లియంగ్ హై అనునది. లియంగ్ హై ఒక పై నికోద్యోగిగ నుండెడివాడు. ఈయనకు స్త్రీసంతానమే -
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/559
స్వరూపం