కన్నడ సాహిత్యము కవులు షట్పదిలో వ్రాసిరి. ఈ శతాబ్దమున జైన మతస్థు డును శృంగార కవియు నైన నేమిచంద్రుడు (1170) లీలావతీ చంపూ ప్రబంధము వ్రాసి ప్రఖ్యాతిగాంచెను. ఈ శతాబ్దియందు బ్రాహ్మణ కవులందు సుప్రసిద్ధు లయినవారు దుర్గసింహ (1145), రుద్రభట్టు (1180) లు. దుర్గసింహకవి కన్నడమున పంచతంత్రమును చంపూ రూపమున రచించెను. రుద్రభట్టు మహాకవులలో ఒకడుగ పరిగణింపబడెను. ఇతడు జగన్నాథ విజయమను చంపూ కావ్యమును వ్రాసెను. సంస్కృత, కన్నడ భాషలందు ఈ కవికి అసాధారణమైన ప్రౌఢి కలదు. మహాకావ్యము నకు ఆవశ్యకములైన అష్టాదశ వర్ణనములు ఈ కృతి యందు చక్కగ కాననగును. శ్రీకృష్ణుని కథ ఈ కావ్యము నందలి వస్తువు. పదమూడవ శతాబ్ది ఆరంభమున నున్న తృతీయ కవి చక్రవర్తి యగు జన్నుడు (1209-80) యశోధర చరిత్రను, అనంతనాథ పురాణమును రచించెను. వీరబల్లా చక్రవర్తి జన్నునకు 'కవిచక్రవర్తి' యను బిరుదము నొసంగెను. జస్నుని కథాపోషణ శక్తి అనన్యసాధారణము, యశో ధర చరితమునందు "చిత్ర మపాత్రే రమతే నారీ" అను విషయమును ఈ యశోధరుని చరిత్రమును వస్తువుగా నంగీకరించి, మనోజ్ఞ ముగ చిత్రించినాడు. ఇది కందపద్య ప్రధానమైన కావ్యము. జన్నుడు జైన మతావలంబి. కనుక అతడు జైన తీర్థంకరుడైన అనంతనాథుని పురాణ మును చంపురూపమున వ్రాసినాడు. దీనియందు చండ శాసుని దుష్ప్రణయ కథ మిక్కిలి కుశలతతో వర్ణితమై నది. అండయ్య (1285) "కబ్బిగరకావ" అను గ్రంథమును రచించెను. సంస్కృత పద మిశ్రణరహితముగా రచింప బడియుండుట దీనికి గల విశిష్టత. జైనకవి కులోచేందుడు (1275) తన రామాయణమును వివిధ షట్పదులతో రచించెను. చౌండరన కవి (1300) బ్రాహ్మణుడు. ఇతడు దండి కవి ప్రణీతమైన దశకుమార చరితమును చంపూ ప్రబంధముగ రచించెను. ఇది పండరీపుర విఠలస్వామికి అంకితమైనది. ఈ శతాబ్దమున మల్లికార్జునుడు (1245) తనకు పూర్వ మందుండిన ప్రసిద్ధకవుల కావ్యములనుండి అష్టాదశ వర్ణన సంబంధించిన ఉత్తమమైన పద్యములను సంకలనము సంగ్రహ ఆంధ్ర చేసి “సూక్తి సుధార్ణవము" అను గ్రంథమును రచించెను. కన్నడమందు వెలసిన ప్రథమ పద్య సంకలన గ్రంథ మిది. మల్లి కార్జునుని కుమారుడగు కేశిరాజు (1280) 'శబ్దమణి దర్పణము' అను వ్యాకరణ గ్రంథమును వ్రాసెను. ఇది కన్నడభాషలో ప్రమాణబద్ధమైన వ్యాకరణముగ పరిగ ణింపబడుచున్నది. 14, 16, 18 శతాబ్దములందు కన్నడ సాహిత్యమునకు విజయనగర ప్రభువు లాశ్రయులై, పోష కులై వరలిరి. జైనకవులకు వీరశైవ కవులకు, బ్రాహ్మణ కవులకు రాజాశ్రయము లభించెను. భీమకవి (1889) బసవపురాణమను కావ్యమును షట్పదిలో రచించెను. ఈ బసవపురాణము పాల్కురికి సోమనాధుడు రచించిన తెలుగు బసవపురాణము ఆధారముగా రచింపబడినది. 512 మధురకవి (1885) ధర్మనాధ పురాణమును చంపూ ప్రబం ధముగ వ్రాసెను. ప్రౌఢదేవరాయల కాలము (1419- 1448) నందుండిన కుమార వ్యాసుడు కన్నడమున మహా భారతము యొక్క దశమ పర్వమువరకు వ్రాసెను. కన్నడ సాహిత్యమందు బహుజనాదర పాత్రమైన కావ్యము ఈ మహాభారతము, పండిత పామరులకు ఈ కావ్యము సులభగ్రాహ్యమై యుండుటవలన దీనికింత ప్రాశస్త్యము కలిగినది. ఈ కావ్యమును పఠించు సందర్భ మున శ్రోతలు హర్షపులకితులై వివిధ ఉదాత్త భావా విన్ద హృదయు లగుదురు. పాత్రపోషణమునందు కవి మిక్కిలి నిపుణతను చూపినాడు. భీముని పరాక్రమము, దుర్యోధనుని కౌటిల్యము, భారత నాటక సూత్రధారు డుగా శ్రీకృష్ణుని కౌశల్యము, ద్రౌపది వీరపాతివ్రత్యము తత్ప్రతిజ్ఞా నిర్వహణదక్షత సముచితముగ పోషింపబడినది. పాండవుల కష్ట సహనశీలము, వారి భ్రాతృవాత్సల్యము, విదురుని నీతి పారగత్వము మిక్కిలి మనోజ్ఞ ముగ వర్ణిత ములైనవి. కుమారవ్యాసుని కవితాధార అనర్గళము, నిస్తులము. ఆతని శృంగార, వీర, కరుణ, శాంతరస పోష ణము సందర్భోచితము, సముచితము. ఇందలి సంస్కృత శబ్దముల కంటే కన్నడ పదములే సామాన్యజనులకు సులభ గ్రాహ్యము లగుచున్నవి. వీరశైవ కవియైన చామరసుడు ఈ కాలమునందే ఉన్న వాడు. ఈ కవి వ్రాసిన ప్రభులీల అను గ్రంథము తెనిగింప బడినది. కుమార వాల్మీకి (1500) అను కవి వాల్మీకి
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/557
స్వరూపం