కన్నడ సాహిత్యము
సంగ్రహ ఆంధ్ర
వర్ణించెను. వ్యాసకృత భారతమునకును పంప భారతమునకును వ్యత్యాసము కలదు. పంప భారతమున ద్రౌపది పంచపత్ని కాదు. అర్జునుడు మత్స్యయంత్రమును భేదించి ద్రౌపదిని పాణిగ్రహణమును చేసికొనేను. ద్రౌపదీ వస్త్రాపహరణ ప్రసంగము పంప భారతములో లేదు. అర్జునుడు సన్న్యాసి వేషమున సుభద్ర యొక్క చిత్తమును హరించుట ఇందుకానము. మహాభారత యుద్ధానంతరము అర్జునునకే పట్టాభిషేకమగును.
ఆదిపురాణమందు జైన ప్రథమతీర్థంకరుని జీవితము అత్యంత గంభీరముగా, ఉదాత్తముగా వర్ణింపబడినది.
పంపకవి హితమితవచనము, అతని అనన్యసాధారణమైన ప్రతిభ, ప్రసన్న తాగుణము, సమతూకముగ వచ్చు సంస్కృత కన్నడ పదబంధము, ధ్వనిపూర్ణత మొదలయిన కావ్యగుణములు అతనికి కన్నడ సారస్వతములో అగ్రస్థానమును సమకూర్చినవి.
పొన్నకవి (950) జైనుడు. రాష్ట్రకూట చక్రవర్తి యగు మూడవ కృష్ణుడు ఇతనికి 'ఉభయకవి చక్రవర్తి' అను బిరుదము నొసగెను. ఇతడు కన్నడ సాహిత్యమందు ప్రథమకవి చక్రవర్తిగా వాసిగాంచెను. శాంతి పురాణము, జినాక్షరమాల, భువనైక రామాభ్యుదయము, గత ప్రత్యాగత అను గ్రంథములు ఈతని రచనలు. వీటిలో మొదటి రెండే ఉపలబ్ధములు. పొన్నకవికి తన కవితాశక్తి యందు పూర్ణవిశ్వాసము కలదు. కన్నడ కవితా రచనములో అసగకవికి శతగుణము శ్రేష్ఠమనియు, సంస్కృత కవితారచనలో కాళిదాసకవికీ చతుర్గుణ మధికమనియు నుర్ధోషించినాడు. పొన్నకవి సంస్కృతగ్రంథములు లభించుట లేదు. శాంతి పురాణమందు పొన్న కవి 18 వ జైనతీర్థంకరుని జీవితచరిత్రను వర్ణించినాడు. పొన్నుని కావ్యమందు సంస్కృతప్రభావము అధికముగ కనిపించును.
చాముండరాయడు (978) కన్నడమందు త్రిషష్ఠి శలాకా పురుష పురాణమను గద్య గ్రంథమును రచించెను. ఈ కవి గంగరాజుల యాస్థానమందు మంత్రిగ నుండెను. శ్రావణ బెల్గళమున జైన గోమఠేశ్వర విగ్రహమును ప్రతిష్ఠించి కీర్తినందెను. కన్నడమందు గద్య గ్రంథకర్తలుబడినట్లు . నృవుతుంగుడు ప్రస్తావించినాడు. ఆ గద్య గ్రంథము లీవరకు దొరకలేదు. చాముండరాయని కృతి ప్రకటింపబడినది.
ఈ శతాబ్దియందే శివకోట్యాచార్యుడు వడ్డారాధన మను గ్రంథమును గద్యమున రచించెనని తెలియుచున్నది.
మొదటి నాగవర్మ (990) కన్నడ ముందు ఛందోంబుధి అను ఛందో గ్రంథమును వ్రాసెను. గుణగాంకియకర్తృ కముగా ఛందో గ్రంథ మొకటి కన్నడమందుండినను, ఆ గ్రంథము నాధారముగా అమృతసాగరుడు (10 శతాబ్దము) తమిళ ఛందో గ్రంథమును వ్రాసెనని చెప్పియున్నాడు. గుణగాంకియ గ్రంథము దొరకలేదు. ఆ గ్రంథ కాలము 9 వ శతాబ్దము. ఈ నాగవర్మయే బాణుని కాదంబరిని కన్నడమున చంపూ ప్రబంధముగా వ్రాసెను.
కవి చక్రవర్తి రన్నుడు జైనమతావలంబి. కళ్యాణి చాళుక్య చక్రవర్తి యగు ఆహవమల్లుడు 'కవిచక్రవర్తి' అను బిరుదముతో రన్నకవిని గౌరవించెను.పంపకవికి తరువాత కన్నడ సాహిత్యమున రన్నకవికి ఉన్నత స్థానము కలదు. రన్నకవి పంపకవి ననుసరించి 'సాహస భీమ విజయ' మను కావ్యమును 'అజిత పురాణ' మును వ్రాసినాడు. 'రన్నకంద' మను నిఘంటు వొకటి ప్రకటింపబడినది. సాహసభీమ విజయము (గదా యుద్ధము) నందు భీమ దుర్యోధనులు గదాయుద్దము వర్ణింపబడినది. ఇది చంపూకావ్యము. వీరరస ప్రధానమైనది. రన్నకవి * ఇఱివ బెడంగ' అను పేరుగల చాళుక్యచక్రవర్తిని భారత భీమనేనునితో పోల్చి అభేదముగ వర్ణించెను. రన్న కవి యొక్క నాటకీయ రచన శ్లాఘనీయము. పాత్రపోషణ మందీ కవి శక్తి అసాధారణము. అజితపురాణము అనునది జైనమతమున ద్వితీయ తీర్థంకరుడైన అజిత వాథుని చరిత్రము. ఈ పురాణము జైనపురాణ లక్షణానుసార ముగ రచితమైన చంపూ గ్రంథము.
11 వ శతాబ్దము : ఈ శతాబ్దియందు చోళుల దాడుల వలన రాష్ట్రమందు శాంతిభద్రతలు లేకపోవుటచే గ్రంథ రచన కన్నడమందు అధికముగా జరుగలేదు. కల్యాణి చాళుక్యచక్రవర్తి యగు ఆరవ విక్రమాదిత్యుని కాల మిది. ఈ రాజు యొక్క శాసనము లనేకములు కర్ణాటాంధ్రదేశములందు లభించినవి. ఈ చక్రవర్తి కాశ్మీర దేశమునుండి వచ్చిన బిల్హణ, విజ్ఞానేశ్వరాదులకు ఆశ్రయ