Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - - కన్నడ సాహిత్యము: కన్నడ సాహిత్యము యొక్క ఆరంభకాలమును నిర్ల యించుటకు నిష్కృష్టమైన ఆధారములు ఇదివరకు ఉప లబ్దములు కాలేదు. క్రీ. శ. 5వ శతాబ్దమునందు దొరకక హల్మిడిశాసనము కన్నడ భాషయందు లిజంపబడి యున్నది. ఈ శాసనము యొక్క లిపి కన్నడ లిపియై యున్నది. 5 వ శతాబ్దమునుండి 9వ శతాబ్దమువరు కన్నడ శాసనములు అధిక సంఖ్యలో లభించుచున్నవి. సంస్కృత కవియగు దండిచే స్తుతింపబడిన శ్రీ వర్ధ దేవుడు కన్నడ మందు తొంబదియారు సహస్రగ్రంథ సంఖ్యగల 'చూడా మణి' వ్యాఖ్యాన గ్రంథమును వ్రాసినాడు. ఈ గ్రంథ వ్యాఖ్యానగ్రంథమును కర్తృకాలము 6 వ శతాబ్దికి పూర్వమని చెప్పవచ్చును. ఇప్పు డీ గ్రంథము అనుపలబ్ధము. కన్నడ, జైనకవులు సాధారణముగ తమ కావ్యారంభమున సమంత భద్ర, పూజ్యపాద, కవి పరమేష్ఠులు అను నీ మువ్వురను స్తుతిం తురు, కానీ ఈ కవిత్రయమువారు కన్నడమందు గ్రంథ ములను వ్రాసిరన్న విషయము సందిగ్ధము. రాష్ట్రకూట చక్రవర్తియగు నృపతుంగుడు కన్నడ కవులను పదిమందిని పేర్కొని యున్నాడు. వీరు గద్య పద్య గ్రంథములను రచించిరి. ఈ కవులు వ్రాసిన కావ్యములు ఉపలబ్ధములు కాలేదు. నృపతుంగుడు కావ్యప్రభేదములలో చెత్తాణ, బెదండె అను రెండు కావ్యప్రక్రియలను ప్రస్తావించి, వీటి లక్షణములను సూత్రీకరించినాడు. ఈ కావ్యస్వరూపము లను నిరూపించు గ్రంథములు లభింపలేదు. నృపతుంగుడు (క్రీ. శ. 814.77) అత్యంత ప్రాచీన గ్రంథములలో నృపతుంగుడు వ్రాసిన కవిరాజమార్గ మొకటి, రాష్ట్రకూట చక్రవర్తులు కన్నడ సాహిత్య సృష్టికి చాల ప్రోత్సాహ మొసగిరి. వారు స్వయముగ గ్రంథములను వ్రాసిరి. నృవతుంగుడు మాన్యఖేట (ప్రస్తుత మళిఖేడ) మందు సుమారు 64 సంవత్సరములవరకు అత్యంత వైభవముగా వీలెను. ఇతని కాలమందు కన్నడ సాహిత్యము అభివృద్ధి చెందెను. నృపతుంగుని 'కవిరాజ మార్గము' సాహిత్యదృష్టిలో మహోదాత్తమైన గ్రంథము. ఇది లక్షణగ్రంథమగుటచే ఆ కాలమునకు పూర్వమునందే కన్నడ సాహిత్యము ప్రవర్థమానదశయందు ఉన్నట్లు నిర రింపవచ్చును, శబ్దాలంకార, అర్థాలంకారములను గురించి 509 కన్నడ సాహిత్యము ఈగ్రంథమందు సవిస్తరమున ప్రతిపావనము గలదు. కవిరాజమార్గమందు రామాయణ, మహాభారత్ గ్రంథ ములకు సంబంధించిన అవ్యములకొరకు ఉద్ధరింపబడిక పద్యములు గలవు. కర్ణాటక ప్రాంతము యొక్క విస్తీ ర్ణము మనోహరమై, శుద్ధమైన కన్నడభాష ప్రచారమం దుండిన ప్రదేశము. అప్రవేశము నందలి ప్రజల భాషా పరిజ్ఞానము, కన్నడ కావ్యపరిణతి మొదలయిన గొప్ప విషయములు ఈ గ్రంథమువలన తెలియుచున్నవి. క్రీ. 10వ శతాబ్దము : ఈ తాబ్దియందు వీరరస ప్రధా నము అయిన కావ్యములు రచితము లయ్యెను. రాజులు స్వీయ రాజ్య విస్తరణ కాండాపూరితులై పరస్పరము లహించుచుండిరి. దిగ్విజయములు, పోరాటముపై పోరాటములు జరుగుచుండెను. ఆ ఆ కాలమండలి ప్రతిభా విరాజితులైన కవులపై ఈ సంగ్రామముల ప్రభావము సహజముగ ముద్రితమయ్యెను. ఈ భావము యొక్క ఫలితము సంప, పొన్న, రన్నకవుల కావ్యములతో ప్రతి బింబితమయ్యెను. పంప, రన్న అను కవులు తాము వ్రాసిన కావ్యములను తమ పోషకులకే అంకిత మొనర్చిరి. పంపకవి 'విక్రమార్జున విజయము', రన్నకవి 'సాహస భీమ విజ యము* ఆ కాలమునందలి పిరరస ప్రతిపాదక కావ్య ములకు ప్రకృష్టోదాహరణములు. పంపకవి (941) కన్నడ కవి శ్రేణియందు ప్రథమ స్థానము నలంకరించుచున్నాడు. ఈ కవికి కన్నడ సాహిత్య మున 'ఆదికవి' యను ప్రసిద్ధి కలదు. పంపకవికి తరువాత వచ్చు కవులు అతని కవితా సామర్థ్యమును గొనియాడి కావ్యారంభ మొనర్చిరి. ఇది పంపకవి ప్రభావమునకు విదర్శనము. పంపకవీశ్వరుడు వేములవాడ అను ప్రదేశమును ఏలు చుండిన చాళుక్య శాఖా సామంత చూడామణి యైన రెండవ అరికేసరి యొక్క ఆస్థాన కవీశ్వరుడు. ఇతడు జైనమతావలంబియై యుండెను. 'విక్రమార్జున విజయ' మను లౌకిక కావ్యమును, 'ఆది తీర్థంకరపురాణ' మను ధార్మిక కావ్యమును వ్రాసెను. ఈ రెండును చంపూ ప్రబంధములు, విక్రమార్జున విజయమునకు 'పంప భారత' మని పేరు కలదు. ఈ భారతమందు కవి తన పోషకుడగు అరికేసరిని అర్జునునితో పోల్చి కథా నాయకునిగా