కన్నడ భాష మునకు సామంతులైరి. మైసూరు మహారాజువంశ ములో 25 వ వాడగు శ్రీ జయచామరాజు ఒడయర్ మైసూరు రాజ్యమున 'రాజప్రముఖుడు'గా పరిపాలన నిర్వహింప సాగెను (1950). తరువాత హిందూదేశము ప్రజాసత్తాక రాజ్యముగ రూపొందెను. అప్పుడు రాష్ట్రముల పునర్నిర్మాణ పథకము తయారయ్యేను. ఈ పథకము ననుసరించి రాచరికము లన్నియు నిర్మూలింపబడెను. స్వదేశ సంస్థానాధిపతులకు ముంచి సంగబడిన 'రాజప్రముఖ' బిరుద పదవి, రాజ్య వారసత్వమును తీసివేయబడెను. హిందూ దేశమంతయు భాషామూలక ముగను, భౌగోళిక దృష్టితోడను 14 రాష్ట్ర ములుగా విభజనమయ్యెను. (1956 నవంబరు 1వ తేదీ) రాష్ట్రాధిపతులు గవర్నరు లనబడిరి. అప్పుడు మైసూరు రాజ్యము కన్నడ రాజ్యముగ పరిణతి చెందెను. ఈ నూతన వ్యవస్థప్రకారము కన్నడ రాజ్యములో బొంబాయి, మద్రాసు, హైద్రాబాదు రాష్ట్రములలో నున్న కన్నడ ప్రాంతములన్నియు మైసూరు రాష్ట్రములో చేర్చబడెను. విడివిడి రాష్ట్రములలో పలుకుబడి లేక మ్రుగ్గుచున్న కన్నడిగులందరు ఏకరాష్ట్ర పాలనలోనికి రాగలిగిరి. ఇండియన్ యూనియనులో రాష్ట్రముల పునర్నిర్మాణ ఫలితముగా ఏర్పడిన నూతన మైసూరు రాష్ట్రము యొక్క వైశాల్యము 74,847 చ. మైళ్ళు. జనాభా 1,94,01,407. రాజ్యభాష కన్నడము. జనసాంద్రత చ. మైలుకు 208 మంది. రాజధాని బెంగుళూరు. రాష్ట్రాధిపతి గవర్నరు. పశ్చిమదిశయందు అరేబియా సముద్రమును ఆనుకొని గొప్ప సముద్రతీర ప్రాంతముగలదు. చందనము, ఇనుము, ఉక్కు, సిమెంటు, కాగితము, ఉన్ని, పట్టు, మొదలగు పారిశ్రామిక కర్మాగారములు కలవు. హిందూస్థాన్ -ఎయిర్ క్రాఫ్ట్, హిందూస్థావ్ 'మెషిన్ టూల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్, గవర్న మెంటు సిల్కు వీవింగ్ ఫ్యాక్టరీ, మైసూరు ల్యాంప్ వర్క్స్ అమ ప్రతిస్థాపనలు కలవు. బంగారు గనులు గూడ కలవు. 1 . ప్రస్తుతపు మైసూరు రాష్ట్రమున 4 డివిజనులు, 18. జిల్లాలు ఈ క్రిందివిధముగ మన్నవి : . 506 సంగ్రహ ఆంధ్ర 1. మైసూరు డివిజన్ - మైసూరు, కూర్గు, మాండ్య, హసన్, దక్షిణ కెనరా, చికమాల్ ఘర్, జిల్లాలు (1) - 2. బెంగుళూరు డివిజన్ బెంగుళూరు, తుంకూరు, కోలారు, చితల్ దుర్గ్, బళ్ళారి జిల్లాలు (5) 3. బెల్గాం డివిజన్ - బెల్గాం, ధార్వాడ, బిజాపూరు, ఉత్తర కెనరా జిల్లాలు (4) 4. గుల్బర్గా డివిజన్ జిల్లాలు (8) గుల్బర్గా, రాయచూరు, ఓదర్ బెంగుళూరు (7,78,877), మైసూరు (2,44,828), కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (1,59,084), హుబ్లి (1,29,603). మంగుళూరు (1,17,088) అనునవి మొదటి తరగతి పట్టణ ములు. మైసూరు మహారాజుల పాలనములో విద్యా, వైజ్ఞా నిక రంగములలో ఎంతో అభివృద్ధి చెంది, మైసూరు రాష్ట్రము ప్రసిద్ధికెక్కి యున్నది. కన్నడ భాష : న. క్రీ. శ. ఆరంభమునకు ముందే కన్నడభాష ఉండి యుండెనని సాధించుట కాధారములు కలవు. తమిళ గ్రంథస్థము అయిన ఆధారములు, ఈజిప్టుదేశమున ఉప లబ్ధమై, గ్రీకు భాషలో రచింపబడిన హాస్య ప్రధాన నాట కము ఈ విషయమును బలపరచుచున్నవి. శిలా లేఖన ములు క్రీ. శ. ఐదవ శతాబ్దమునుండి ఉపలబ్ధము అగు చున్నవి. హల్మిడి యను స్థలమున దొరకిన కన్నడ శాస నము క్రీ. శ. ఐదవ శతాబ్దమున లిఖింపబడినదని విద్వాం సులు తెలిపియున్నారు. ఆ శాసనమున నుపయోగింప బడిన కన్నడ భాషయందు సంస్కృత శబ్దములు సూటి కేబది చొప్పున కలవు. ప్రసిద్ధమగు పంచద్రావిడ భాషలలో తమిళము తరు వాత కన్నడము భాషాప్రాధాన్యము వహించునని చరి శ్రజ్ఞులు, కన్నడము యొక్క ప్రాచీనతనుబట్టి, అభిప్రాయ మును వ్యక్తపరచియున్నారు. ప్రాచీన కన్నడమునకును, తమిళ భాషకును సాదృశ్య మధికముగ నున్నది. కన్నడ భాషయందు పూర్వదహళ గన్నడ (పూర్వజాను కన్నడ), హళగన్నడ (జానుగన్నడ). పడుగన్నడ, హొసగన్నడ
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/551
స్వరూపం