విజ్ఞానకోశము - ౨
కన్నడదేశ చరిత్ర - II
మొదటి పంగము శైవమువైపు మొగ్గు చూపెను. సాళువ, తుళువ వంశములకు వైష్ణవమువైపే చూపు ప్రసరించేను. మధ్వమతాచార్యులగు శ్రీ వ్యాసతీర్ణులు వీరనరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ ప్రభు పులకు రాజగురువైనట్లు తెలియుచున్నది.
వీరశైవయోగుల వచనములవలె వైష్ణవదాసుల గీతములును వాఙ్మయమున క్రొత్తపుంతలు త్రొక్కెను. బాదామి కల్యాణిచాళుక్యులవలెనే తుళువ వంశపు రాజులు కూడ పురాణ ప్రసిద్ధములయిన విఠల, కృష్ణ, రంగనాథ, శేషశాయి ప్రభృతి విష్ణుదేవతారాధనము నుద్ధరించిరి. పురందరదాసు, కనకదాసు మొదలగువారు దాసకూట మునకు చెందిన వైష్ణవస్వాములు. వీరు దేశీయ కర్ణాటక సంగీతమును పునరుద్ధరించి తమ ప్రతిభచే మెరుగులు దిద్దిరి.
రామరాయల ఆధిపత్యమున అత్యంతో దశ ననుభవించిన విజయనగర సామ్రాజ్యము కొలది కాలములోనే దక్కను సుల్తానుల కలయికవలన దుర్బలమై రక్షసతంగడి యుద్ధమున (1565) ఛిన్నాభిన్నమైపోయెను. విజయనగరమున రాజ్యమేలుట అసాధ్యమని గ్రహించిన రామరాజు యొక్క సోదరుడగు తిరుమలరాయలు పెనుగొండకు మరలెను. ఈ వంశపు వారసులు మహమ్మదీయ దండ యాత్రా సంక్షోభమునుండి తెప్పరిలి చంద్రగిరినుండి పాలించిరి. ఇచ్చటినుండియే శ్రీరంగరాజు ఇంగ్లీషు వారికి మద్రాసు ప్రాంతమును దత్తము చేసెను (1639). ఈ శ్రీరంగరాయల మరణముతో విజయనగర సామ్రాజ్యము అస్తమించెను (1680).
తురుష్కుల దాడులనుండి దేశమును రక్షించుటకు శివాజీ ఆధిపత్యమున మహారాష్ట్ర రాజ్యము స్థాపింపబడెను. ఇది ఉత్తర కర్ణాటకమునందలి అధిక భాగము నాక్రమించి యుండెను. వారితరువాత నేలిన బ్రాహ్మణ మంత్రులగు పీష్వాలు కర్ణాటక ప్రభువుల సైనికబలము నాధారముగా చేసికొని సామ్రాజ్యము వృద్ధిగావించిరి. కాని మొదట వ్యాపారస్థులుగా దేశమునందు ప్రవేశించి, పిదప రాజకీయములలో పాల్గొనిన పాశ్చాత్యుల మూలమున కడకు బ్రిటీషు పరిపాలనము మిగిలిన భారత దేశమందువలెనే కర్ణాటకమునందు కూడ స్థిరపడేను.
ఉపసంహారము : పరిపాలనా వ్యవస్థయందు రాజులు "త్రిభోహాథ్యంక కాసిద్ధి" ననుసరించి పాలించినట్లు వర్ణింపబడినది. అనగా వారు తమ రాజ్యాదాయమును విద్యావ్యాప్తికొరకును, దేవాలయము లందలి దేవతా పూజాభివృద్ధి కొరకును. ప్రజల సౌఖ్యసంపాదనము కొరకును వినియోగించిరి. ఆదాయములో ఆరవవంతును రాజులు సొంతమునకు ఉపయోగించుకొనేడివారు. గ్రామము బలవత్తరమైన ప్రాతిపదిక. అచటనే పరిపాలనావిధానము కేంద్రీకృతమైనది. కొన్ని గ్రామముల సముదాయము మహాగ్రామమని వ్యవహరింపబడెను. ఇట్లే విషయము, నాడు, మహానాడు, మండలము అను దేశవిభాగము లుండెను. నాడు, మహానాడు అమనవి రాష్ట్రకము, మహారాష్ట్రకము అని వ్యవహరింపబడుచుండెడివి. భారతీయ సంపదను సంరక్షించు వర్తకసంఘములే గ్రామ వ్యాపారమును నిర్వహించెడివి. ఇవియన్నియు బిజాపూరు జిల్లాలోని ఐహో లెనందున్న కేంద్ర వర్తక సంఘమునకు అనుబంధ సంఘములుగా నుండెను. ఆ కేంద్రసంఘమున ఏనూరు సభ్యులు ఉండేడివారు. వారి శాసనము తెలుగు, తమిళనాడులందంతటను చెల్లుబడి యగుచుండెను. వర్తక కేంద్రమునకు నఖరము లేక నగరము అని పేరు. వారిచే నిర్మింపబడు ఆలయములకు నగరేశ్వరాలయము లని పేరు. ఉరోదేయుడను రాజప్రతినిధి కాక, మహాజనులను సభ్యులుకల గ్రామపాలక సంఘము లుండెడివి.
చి.దా.శా
కన్నడదేశ చరిత్ర - II :
మైసూరు ఒడయరులు: మైసూరునగరమునకు కొంచెము దూరములో "హదినాడు" అను గ్రామ ముండెను. ఆ గ్రామ ప్రభువునకు మెదడు చెడినందున దేశము వదలి పోయెను. ఈ రాజున కొక్క కుమారిత యుండెను. ఆ రాజకుమారిని పెండ్లియాడి ఆ రాజ్యమును కబళింపవలెనని కారుగహళ్ళి గ్రామ ప్రభువునకు సంకల్పము కలిగెను. కాని కారుగహళ్ళి ప్రభువు హీనజాతివాడగుటచే హదినాడు వారు తమ కన్యను అతనికిచ్చి పెండ్లి చేయుటకు సమ్మతింపకుండిరి. అయినను, కారుగహళ్ళి ప్రభువు బలవంతుడగుటచే విధిలేక ఆతని కోరికకు సమ్మతించిరి.