Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - త దండెత్తుచుండిరి. క్రొత్తగా జయించిన రాజ్యమున శాంతిని నెలకొల్పుటకై, రెండవ జైలుడు, కల్లోలపరచు చున్న కరహాట, కొంకణ, మాల్వప్రభృతి ప్రభుత్వములను అణచిపై చెను. ఇతని సమారుడు ఇరివబెడంగ సత్యా శ్రయుడు కొంకణదేశ ప్రభువగు అపరాదిత్యుని ఓడించెను. ఇతని పాలనమున చోళరాజగు రాజరాజు అనేక యుద్ధములు జరిగెను. రాజరాజు నవలక్షా సంఖ్యాకమగు సైన్యముతో బిజాపూరు జిల్లా గోనూరువరకు సాగెను. చాళుక్య రాజ్యము యొక్క సరిహద్దును దాటకుండ సత్యా శ్రయుడు వేంగిరాజ సైన్యములకు నేతయై ఈతని నిరో ధించెను. కల్యాణీ చాళుక్యుల కాలములో చాళుక్యులకును చోళులకును ఎడ తెగని వే రము సాగుచుండెను. ఇందు చోళులే కలహకారకులై ఎట్లైనను తమ శాత్రపచాళుక్య కుటుంబమున భేదములు కల్పింప ప్రయత్నించుచుండిరి. ఐదవ విక్రమాదిత్యుడు, రెండవ జయసింహుడు, మొదటి సోమేశ్వరుడు, చోళుల బలప్రవాహోద్ధతి సరికట్టవలసి వచ్చెను. చోళరాజు (రాజాధిరాజు) కోప్పం యుద్ధమున చంపబడెను. ఒకటవ సోమేశ్వరుని యనంతరము రాజైన రెండవ సోమేశ్వర భువనైకమల్లుడు తన సోదరుడగు విక్రమేంద్రవర్మతో విరోధించి తన ఓటమిని ఒప్పుకొని రాజ్యమును పంచుకొనెను. ఆరవ త్రిభువనమల్ల విక్రమా దిత్యుడు చోళచాళుక్య రాజకీయములలో పాల్గొనుటే కాక తూర్పున గుంటూరుజిల్లా వరకును, ఉత్తరమున నాగపూరు వరకును చాళుక్య రాజ్యమును వ్యాపింప చేసెను శాలివాహన శకమును త్రోసిరాజని చాళుక్య విక్రమశకమును ప్రారంభించిన దితడే. ఈ శకము ఒక వంద సంవత్సరములు కర్ణాటక మునందేకాక విక్రమా దిత్యుని ప్రాబల్యముకల ఇతర రాజ్యములందును వాడుకలో నుండెను. ఆరవ విక్రమాదిత్యుని సుదీర్ఘ పరిపాలనము చోళులతోడను వేంగి చాళుక్యులతోడను యుద్ధములు చేయుటతోడనే గడచిపోయినది. ఈతని కాలమున పాళియ గాండ్రుగానున్న కాలచుర్యులు, హోయిసలులు, యాద వులు, కాకతీయులు, పరిసర రాజ్యములలో యుద్ధములు చేయుచు, స్థిరపడి కడకు కేంద్ర ప్రభుత్వము బలహీనమై పతనోన్ముఖమగుచున్న కాలమున స్వతంత్ర రాజ్యములనే స్థాపించుకొనిరి. 499 కన్నడదేశ చరిత్ర - 1 కాలచుర్య యాదవ హోయసలుల స్వతంత్ర రాజ్య స్థాపనము : క్రీ.శ. 1168 ప్రాంతమున కాలచుర్య రొట్టె లునిచే చాళుక్య ప్రభుత్వము కూలద్రోయబడెను. ఇతని వంశమువారు 20 సం. లు సింహాసనము నాక్రమించిరి. తరువాత నాలుగవ వీర సోమేశ్వరశర్మ, కొలదికాలము పాటు చాళుక్య ప్రభుత్వమును పునరుద్ధరించెను. కాని ఆ వెంటనే హోయిసల, యాదవ, కాకతీయరాజ్యము లేర్పడెను. ఇట్లు 12వ శతాబ్ది చివరిభాగమున దక్కను కర్ణాటకములలో క్రొత్త రాజ్యములు కలలెత్తి నిరంతర యుద్ధములకు దారితీ సెను, కల్యాణీ చాళుక్యుల యుగము పునరుజ్జీవనమునకును, సంస్కరణమునకును ప్రసిద్ధమైనదనవచ్చును. వీరికి పూర్వ మందున్న రాష్ట్రకూటులు, గాంగులు జైనమతాను యాయులు. రుమాత్రము వైదిక పౌరాణిక మతసంప్ర దాయానుయాయులై దానిని పునరుద్ధరించుటకై శిల్ప మును, చిత్రకళను ప్రోత్సహించిరి. అసంఖ్యాకములయిన శివ కేశవాలయములను నిర్మించిరి. వాటి శిల్పపురీతి ప్రత్యేకమై, విశిష్టమైన చాళుక్యరీతియని భారతీయ శిల్ప రీతులలో ప్రసిద్ధి గాంచెను. చాళుక్యులు గొప్ప భాషాపోషకులై విలసిల్లిరి. వారు కవులకు, పండితులకు భూరిదానములు చేసిరి. పంపకవి చాళుక్య రెండవ అరికేసరి ఆస్థానకవి. పొన్నకవి రాష్ట్ర కూట మూడవ కృష్ణుని ఆస్థానకవి. రన్న కవి రెండవ రన్నకవి రైలుని ఆస్థానము నలంకరించెను. వాగవర్మ, దుర్గా సింహుడు, చంద్రరాజు మొదలగు కవులు రెండవ జయ సింహుని కాలమున వర్ధిల్లిరి. ఆరవ విక్రమాదిత్యుడు బిల్హణుడను కవిని, విజ్ఞానేశ్వరుడను స్మృతివ్యాఖ్యాతను పోషించెను. ఆతని తరువాత మూడవ సోమేశ్వరుడు ప్రఖ్యాత పండితుడై అభిలషి కార్థ చింతామణి అను విజ్ఞాన కోశమును రచించెను. బసవేశ్వరుని ఆధిపత్యమున నెలకొల్పబడిన వీరశైవ మతమునకు కాలచుర్యులు పోషకులు. ఇది కర్ణాటకమందలి మత, శాత్త్విక వాఙ్మయమున ఒక క్రొత్త పంథ త్రొక్కినది. నూతనవచనశైలిలో గ్రంథరచనముచేసి, కులవర్ణ వివక్షత లేక సామాన్య ప్రజలకు అంద జేయుట, శివభక్తి ప్రచారము అనునవి ఈ పునరుజ్జీవనము యొక్క ముఖ్యలక్షణములు.